థండర్‌బోల్డ్‌ డిస్‌ప్లేతో అదరహో అనిపించే ఆపిల్ ఉత్పత్తులు

By Super
|
Apple Mac Mini
ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ వాడకం బాగా పెరిగింది. మ్యాక్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌ని వాడేటటువంటి యూజర్లు కూడా పెరిగారు. ఇటీవల కాలంలో ఆపిల్ కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసినటువంటి తన కొత్త ఉత్పత్తుల విశేషాలను తెలుసకుందాం. మొదటగా

మ్యాక్ మినీ దీనిని మానిటర్‌ లేని 'మినీ మ్యాక్‌'గా అనుకోవచ్చు. దీన్ని మీరు వాడుతున్న మ్యాక్‌కి అనుసంధానం చేసి పని చేయవచ్చు. 1.4 అంగుళాల మందంతో తయారు చేసిన దీంట్లో సెకండ్‌ జనరేషన్‌ డ్యుయల్‌ కోర్‌ ఐ5, ఐ7 ప్రాసెసర్లను వాడారు. సాధారణ మ్యాక్‌ల కంటే 2x ప్రాసెసింగ్‌ వేగంతో పని చేస్తుంది. 8 జీబీ ర్యామ్‌, 500 జీబీ హార్డ్‌డ్రైవ్‌, 256 జీబీ ప్లాష్‌ స్టోరేజ్‌, AMD Radeon HD 6630 Graphics... సదుపాయాలు ఉన్నాయి. వెనక భాగంలో నాలుగు యూఎస్‌బీ పోర్ట్‌లను కూడా ఏర్పాటు చేశారు. వై-ఫై, బ్లూటూత్‌, ఫైర్‌వైర్‌, ఈథర్నెట్‌, థండర్‌బోర్డ్‌ సదుపాయాల్ని నిక్షిప్తం చేశారు. OS X Lion Or OS X Loin Sever ఓఎస్‌లను ఇన్‌బిల్డ్‌ ఓఎస్‌గా అందిస్తున్నారు. దీన్ని టీవీకి కనెక్ట్‌ చేసి సినిమాలు చూడొచ్చు. ఐఫొటో, ఐమూవీ, ఐక్యాల్‌, అడ్రస్‌బుక్‌, సఫారీ బ్రౌజర్‌... లాంటి అప్లికేషన్లు దీంట్లో నిక్షిప్తం చేశారు. ధర సుమారు రూ.44,900. దీని గురించిన పూర్తి సమాచారం కావాలంటే www.apple.com/macmini/ వెబ్ సైట్‌లో చూడండి.

రెండవది మ్యాక్ బుక్ ఎయిర్. ఇది మూడవ జనరేషన్‌ మ్యాక్‌ బుక్‌. 11, 13 అంగుళాల తెరలతో రూపొందించారు. పేరు Mac book Air. 1.7 సెంటీ మీటర్లు మందంతో నాజూకు రూపం. ఐ5, ఐ7 ప్రాసెసర్లతో 2.5ఎక్స్‌ ప్రాసెసింగ్‌ వేగంతో పని చేస్తుంది. ఓఎస్‌ ఎక్స్‌, గిగాబైట్‌ ఈథర్నెట్‌, మూడు యూఎస్‌బీ పోర్ట్‌లు, ముందు భాగంలో ఫేస్‌టైం హెడ్‌ కెమేరా, 2.1 స్టీరియో సౌండ్‌, బిల్డ్‌ఇన్‌ మైక్రోఫోన్‌ సౌకర్యాలతో తయారు చేశారు. కీబోర్డ్‌ని బ్యాక్‌లైట్‌ టెక్నాలజీతో తయారు చేశారు. చీకట్లో కూడా టైపింగ్‌ చేసుకుకోవచ్చు. మల్టీటచ్‌ ట్రాక్‌ప్యాడ్‌ మరో ప్రత్యేకత. పేజీని స్క్రోల్‌ చేయాలంటే రెండు వేళ్లతో ప్యాడ్‌పై కదిపితే చాలు. పేజీలను జూమ్‌ చేయాలంటే రెండు వేళ్లతో ప్యాడ్‌పై రెండు సార్లు తాకాలి. పుస్తకంలో పేజీల మాదిరిగా పేజీలను తిరగేయాలంటే ప్యాడ్‌పై రెండు వేళ్లతో పక్కకు జరిపితే సరి! 11 అంగుళాల మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ బ్యాటరీ బ్యాక్‌అప్‌ 5 గంటలు. అదే 13 అంగుళాలు అయితే 7 గంటలు పని చేస్తుంది. ధర సుమారు 56,000. దీని గురించిన పూర్తి సమాచారం కావాలంటే www.apple.com/mac/ వెబ్ సైట్‌లో చూడండి.

ప్రపంచంలో మొదటిసారి ఈ టెక్నాలజీ థండర్‌బోల్డ్‌ డిస్‌ప్లేని యాపిల్‌ పరిచయం చేస్తోంది. నాణ్యమైన రిజల్యుషన్‌లో వీడియోలను చూడొచ్చు. సినిమా డిస్‌ప్లే మానిటర్లుగా వీటిని పిలుస్తున్నారు. వీటి తెర పరిమాణం 27 అంగుళాలు. LED backilit డిస్‌ప్లే, 2560X1440 పిక్సల్‌ రిజల్యుషన్‌తో వీడియోలను చూడొచ్చు. మానిటర్‌ వెనక భాగంలో ఏర్పాటు చేసిన యూఎస్‌బీ పోర్ట్‌లతో యాపిల్‌ డివైజ్‌లను మానిటర్‌కి అనుసంధానం చేయవచ్చు. వాటిని 'థండర్‌బోర్డ్‌ పోర్ట్‌లు'గా పిలుస్తున్నారు. ఒకేసారి ఆరు యాపిల్‌ డివైజ్‌లను థండర్‌బోల్డ్‌ డిస్‌ప్లే మానిటర్‌కు కనెక్ట్‌ చేయవచ్చు. వీడియో ఛాటింగ్‌కి అనువుగా ముందుభాగంలో ఫేస్‌టైం కెమెరా, బిల్డ్‌ఇన్‌ 2.1 ఛానల్‌ స్పీకర్లను దీంట్లో నిక్షిప్తం చేశారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X