వొంపు తిరిగిన స్ర్కీన్‌లతో యాపిల్ ఐఫోన్‌లు..?

|

కర్వుడ్ (వొంపుతిరిగిన) గ్లాస్ స్ర్కీన్‌లతో కూడిన ఐఫోన్‌లను యాపిల్ వృద్ధిచేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెండు డిస్‌ప్లే వేరియంట్‌లలో ఈ ఐఫోన్‌లు విడుదల చేస్తారని బ్లూబర్డ్ నివేదికులు చెబుతున్నాయి. 4.7 అంగుళాల, 5.5 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లలో రూపుదిద్దుకుంటున్న ఈ హ్యాండ్‌సెట్‌లు సామ్‌సంగ్ గెలాక్సీ నోట్3కి ప్రధాన పోటీదారుగా నిలవనున్నాయి. యాపిల్ కర్వుడ్ స్ర్కీన్ ఐఫోన్‌లను 2014 మూడవ త్రైమాసికం విడుదల చేసే అవకాశముందని పలు అనధికారిక నివేదికల ద్వారా తెలుస్తోంది. యాపిల్ తన తరువాతి వర్షన్ ఐఫోన్‌లలో ‘ప్రెజర్ సెన్సిటివ్ టెక్నాలజీ'ని పరీక్షిస్తున్నట్లు మరో రూమర్ ఇంటర్నెట్ ప్రపంచంలో హల్ చల్ చేస్తోంది.

సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ ఇప్పటికే ‘గెలాక్సీ రౌండ్' పేరుతో 5.7 అంగుళాల కర్వుడ్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌ను అంతర్జాతీయ మార్కెట్లో విడుడదల చేసింది. మరోవైపు ఎల్‌జి, తన మొదటి కర్వుడ్ డిస్‌ప్లే ఫోన్ ‘జీ ఫ్లెక్స్'ను మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.

సామ్‌సంగ్ గెలాక్సీ రౌండ్ కీలక ఫీచర్లు:

5.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ ఫ్లెక్సిబుల్ ఆమోల్డ్ స్ర్కీన్ (రిసల్యూషన్1080 x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, బ్లూటూత్, వై-ఫై, ఇన్‌ఫ్రా‌రెడ్ ఫీచర్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, జీపీఎస్, గ్లోనాస్ కనెక్టువిటీ, 2800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

వొంపు తిరిగిన స్ర్కీన్‌లతో యాపిల్ ఐఫోన్‌లు..?

వొంపు తిరిగిన స్ర్కీన్‌లతో యాపిల్ ఐఫోన్‌లు..?

వొంపు తిరిగిన స్ర్కీన్‌లతో యాపిల్ ఐఫోన్‌లు

ఎల్‌జి జీఫ్లెక్స్ ఫీచర్లను పరిశీలించినట్లయితే:

ఫోన్ పరిమాణం 160.5 x 81.6 x 7.9 x 8.7మిల్లీమీటర్లు, బరువు 177 గ్రాములు, 6 అంగుళాల హైడెఫినిషన్ కర్వుడ్ ఓఎల్ఈడి డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 2.26గిగాహెట్జ్ క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగెన్ 800(ఎమ్ఎస్ఎమ్8974) ప్రాసెసర్, 450మెగాహెట్జ్ అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి డీడీఆర్3 ర్యామ్, ఆండ్రాయిడ్ జెల్లీబీన్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్ ఫీచర్), 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, ఫోన్ మెమరీని మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ సౌలభ్యతతో మరింతగా విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 3జీ హెచ్ఎస్‌పీఏ, వైఫై 802.11 ఏసీ/ఏ/బీ/జీ/ఎన్, బ్లూటూత్ 4.0 విత్ ఏ2డీపీ, జీపీఎస్, ఏజీపీఎష్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 3500ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఈ హ్యాండ్‌సెట్ 24బిట్, 142కెహెచ్‌జడ్ సామర్ధ్యంతో కూడిన అధికముగింపు సౌండ్ క్వాలిటీని అందిస్తుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X