యాపిల్ నుంచి చవక ధర ఐఫోన్ 5సీ..?

Posted By:

ఐఫోన్‌ల తయారీ దిగ్గజం యాపిల్ చవక ధర శ్రేణిలో ఐఫోన్ 5సీ 8జీబి వేరియంట్‌ను ఈ రోజు అంతర్జాతీయ మార్కెట్లో ప్రకటించే అవకాశముందని జర్మనీకి చెందిన ప్రముఖ ఇంటర్నెట్ బ్లాగ్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఐఫోన్ 5సీ 8జీబి వేరియంట్ ధరను 60 యూరోలు (షుమారుగా రూ.5,000కు) కోట్ చేస్తూ జర్మన్ క్యారియర్ O2 ఓ మెయిల్‌ను సదరు బ్లాగ్‌కు పంపినట్లు తెలుస్తోంది.

యాపిల్ నుంచి చవక ధర ఐఫోన్ 5సీ..?

ఐఫోన్ 5ఎస్‌తో పాటు ఇటీవల ఇండియన్ మార్కెట్లో విడుదులైన ఐఫోన్ 5సీ (16జీబి వేరియంట్) నెగిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. విడుదల సమయంలో ఐఫోన్ 5సీ (16జీబి వర్షన్) దేశీయ మార్కెట్ ధర రూ.41,900. ధర తగ్గింపులో భాగంగా ప్రస్తుతం ఈ డివైస్‌ను రూ.36,900కు విక్రయిస్తున్నారు.

ఐఫోన్ 5సీ 8జీబి వేరియంట్‌ను ఇండియన్ మార్కెట్లో సైతం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు యాపిల్ సన్నాహాలు చేస్తున్నట్లయితే డివైస్ ధర ఎంత ఉండొచ్చనే ప్రశ్న మార్కెట్లో ప్రధాన చర్చకు దారితీస్తోంది.

ఐఫోస్ 5సీ కీలక స్పెసిఫికేషన్‌లు: పటిష్టమైన పాలికార్బొనేట్ ప్లాస్టిక్ డిజైనింగ్,4 అంగుళాల రెటీనా డిస్‌ప్లే (రిసల్యూషన్ 640 x 1136పిక్సల్స్), యాపిల్ ఏ6 చిప్‌సెట్, ఐఓఎస్ 7 ఆపరేటింగ్ సిస్టం (200 కొత్తఫీచర్లను సపోర్ట్ చేస్తుంది), 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 100 ఎంబీపీఎస్ ఎల్‌టీఈ కనెక్టువిటీ, వై-ఫై ఏ/బి/జి/ ఎన్, బ్లూటూత్ 4.0.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot