భారత్‌లో ఆపిల్ ఐఫోన్‌లకు కష్టకాలం!
ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో యాపిల్ ఐఫోన్ అమ్మకాలు నిరాశాజనకంగా ఉన్నట్లు తాజా సర్వేలు చెబుతున్నాయి.
ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో యాపిల్ ఐఫోన్ అమ్మకాలు నిరాశాజనకంగా ఉన్నట్లు తాజా సర్వేలు చెబుతున్నాయి. ఆండ్రాయిడ్ నుంచి ఎదురవుతోన్న పోటీ కారణంగా పరిస్థితులు రోజరోజుకు దిగజారుతుండటంతో కొత్త మార్గాలను ఆపిల్ అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.

అయినా ఫలితం లేకుండా పోయింది..
ఐఫోన్‌లను అత్యధికంగా వినియోగించుకుంటోన్న దేశాల్లో యూఎస్ మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాతి స్థానంలో చైనా ఉంది. చైనా మార్కెట్లో ఐఫోన్ అమ్మకాలు తగ్గుతండటంతో యాపిల్ తన ఫోకస్‌ను భారత్‌కు షిఫ్ట్ చరేసింది. మేక్ ఇన్ ఇండియా నినాదానికి మద్దతుగా ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ 6ఎస్ వంటి పాత వెర్షన్ ఐఫోన్ మోడల్స్‌ను భారత్‌లోని తయారు చేసి వాటిని బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో విక్రయించే ప్రయత్నం చేస్తోంది. ఇదే సమయంలో మిగిలిన ఐఫోన్ మోడల్స్‌ను కూడా నెట్‌వర్క్ క్యారియర్స్‌తో కలిసి యాపిల్ విక్రయిస్తోంది.

6 నెలల్లో 10 లక్షల ఐఫోన్‌లు..
కౌంటర్ పాయింట్ రిసెర్చ్, తాజాగా విడుదల చేసిన ఓ రిపోర్ట్ ప్రకారం 2018 మొదటి 6 నెలలకు గాను యాపిల్ సంస్థ 10 లక్షల ఐఫోన్‌లను మాత్రమే భారత్‌లో విక్రయించగలిగింది. గతేడాది ఇదే సమయానికి ఈ సంఖ్య 3.2 మిలియన్లుగా ఉందని కౌంటర్ పాయింట్ రిసెర్చ్ తన నివేదికలో పేర్కొంది. సేల్ భారీగా తగ్గిపోవటంతో ఐఫోన్ మార్కెట్ షేర్ 2 శాతానికి పడిపోయింది.

ముగ్గురు టాప్ ఎగ్జిక్యూటివ్‌లు రాజీనామా..
భారత్‌లో ఐఫోన్ మార్కెట్ మరింత ఫేలవంగా తయారవుతండటంతో కంపెనీకు సంబంధించిన ముగ్గురు టాప్ ఎగ్జిక్యూటివ్‌లు తమ పదవుల నుంచి తప్పుకున్నారు. వీరిలో నేషనల్ సేల్స్ ఇంకా డిస్ట్రిబ్యూషన్ అండ్ ఆపరేటర్ బిజినెస్ హెడ్ రాహుల్ పూరి, ఐఫోన్ సేల్స్ మోడ్రన్ ట్రేడ్ అండ్ యాపిల్ ప్రీమియమ్ రిటైల్ హెడ్ జయంత్ గుప్తా, టెలికామ్ నేషనల్ సేల్స్ హెడ్ మనీష్ శర్మలు ఉన్నారు.

ఐఫోన్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ మరింత కఠినతరం..
ఎకనిమక టైమ్స్ రిపోర్ట్ చేసిన కథనం ప్రకారం తాజాగా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని యుద్ధప్రాతిపదికన సరికొత్త సేల్స్ ఆడిట్ టీమ్‌ను యాపిల్ సంస్థ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆడిట్ టీమ్‌ను కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అయిన గౌరబ్ దుగ్గల్ పర్యవేక్షించనున్నారు. దేశంలో ఐఫోన్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్‌ను మరింత కఠినతరం చేసే క్రమంలో ఐదుగురు నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్‌కు దూరంగా ఉండాలని యాపిల్ నిర్ణయం తీసుకుంది.


Click it and Unblock the Notifications








