సామ్‌సంగ్‌తో భారీ డీల్ కుదుర్చుకున్న యాపిల్..?

ఐఫోన్8 స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి మరో 60 మిలియన్ యూనిట్ల OLED ప్యానల్స్‌ను అందించేందుకు యాపిల్ నుంచి సామ్‌సంగ్ డిస్‌ప్లేకు కొత్త ఆర్డర్ లభించినట్లు సమాచారం. సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ సబ్సిడరీ గ్రూపుల్లో సామ్‌సంగ్ డిస్‌ప్లే కూడా ఒకటి. ఈ డీల్‌లో భాగంగా దాదాపు 4.3 బిలియన్ డాలర్లను యాపిల్ కంపెనీ, సామ్‌సంగ్‌కు చెల్లించనుందట.

Read More : గుర్తు తెలియని మొబైల్ నెంబర్స్ విసిగిస్తున్నాయా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

The Investor కథనం ప్రకారం..

దక్షిణ కొరియాకు చెందిన The Investor అనే ప్రముఖ వెబ్‌సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం యాపిల్, సామ్‌సంగ్‌ల మధ్య ఈ డీల్ 2016లోనే ఓకే అయ్యింది. ఐఫోన్8కు సంబంధించి తొలత 100 మిలియన్ OLED ప్యానల్ యూనిట్లను ఆర్డర్ చేసిన యాపిల్ డిమాండ్ ఎక్కువుగా ఉంటుందని భావిస్తోన్న నేపథ్యంలో తాజాగా మరో 60 మిలియన్ యూనిట్ల OLED ప్యానల్స్‌ను ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది.

విప్లవాత్మక ఫీచర్లతో ఐఫోన్ 8

ఐఫోన్ 7కు సక్సెసర్ వర్షన్‌గా యాపిల్ త్వరలో లాంచ్ చేయబోతోన్న ఐఫోన్ 8, సెప్టంబర్ 2017లో మార్కెట్లో లాంచ్ చేసింది. ఇప్పటికే ఈ ఫోన్ కు సంబంధించి అనేక ఆసక్తికర విషయాలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. యాపిల్ నుంచి ఈ ఏడాది మూడు కొత్త వేరియంట్‌లలో ఐఫోన్‌లు రాబోతున్నాయట. వాటిలో ఒక వేరియంట్ OLED కర్వుడ్ డిస్‌ప్లే ప్యానల్‌తో రాబోతోందట. ఐరిస్ స్కానర్, సరికొత్త 3డీ టచ్ వంటి విప్లవాత్మక ఫీచర్లను ఫోన్ 8లో యాపిల్ పొందుపరచనున్నట్లు సమాచారం.

ఇప్పటివరకు వచ్చిన ఐఫోన్లు కంటే..

ఆపిల్ తన తరువాతి తరం ఫోన్ ఐఫోన్ 8 పై భారీగానే కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు వచ్చిన ఐఫోన్లు కంటే అతి పెద్ద ఫోన్‌ను ఐఫోన్ 8 రూపంలో యాపిల్ బయటకు తీసుకురాబోతున్నట్లు సమాచరం. దీంతోపాటు తొలిసారిగా OLED డిస్‌ప్లే సపోర్ట్‌తో ఐఫోన్ 8 రానున్నట్లు రిపోర్టులు తెలియజేస్తున్నాయి.

మూడు రకాల వేరియంట్లలో

మూడు రకాల వేరియంట్లలో ఐఫోన్ 8 రానుందని సమాచారం. రిపోర్టుల ప్రకారం రానున్న ఐఫోన్ 8 మూడు రకాల సైజుల్లో మార్కెట్లోకి రానుంది. రెగ్యులర్‌గా వచ్చే 4.7 సైజ్, అలాగే 5.5 సైజ్‌తో పాటు తొలిసారిగా 5.8 ఇంచ్ అమోల్డ్ డిస్‌ప్లేను తీసుకురానుందని తెలుస్తోంది.

దాదాపు 60-70 మిలియన్ యూనిట్లు

ఆపిల్ కంపెనీ ఐఫోన్ 8 ఫోన్లను దాదాపు 60-70 మిలియన్ యూనిట్లను మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డ్యూయెల్ కర్వడ్ ఎడ్జ్ డిస్ ప్లేతో వచ్చిన శాంసంగ్ ఎస్7ఎడ్జ్ అలాగే నోట్ 7ల మాదిరిగా ఐఫోన్ 8 కూడా రానున్నట్లు సమాచారం.

వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా.

కొన్ని రూమర్స్ ప్రకారం వైర్‌లెస్ ఛార్జింగ్  సపోర్ట్‌తో ఐఫోన్ 8 రాబోతోంది. దీని ద్వారా ఛార్జింగ్ చాలా వేగవంతంగా అవుతుందని కంపెనీ చెబుతోంది. ప్రీక్వీన్సీ లో ఎటువంటి అంతరాయం కలగకుండా ఈ వైర్ లెస్ ఛార్జింగ్ పనిచేయనుంది.

అన్ని అనుకున్నట్లు జరిగితే..

 ఆపిల్ కంపెనీ ఐఫోన్ 8 ను కంపెనీ 10వ వార్షికోత్సవంలో విడుదల చేసే అవకాశం ఉంది. కంపెనీ నుంచి తొలిసారిగా 2007లో ఫస్ట్ ఐఫోన్ వచ్చింది. ఆపిల్ కంపెనీ తన 10 ఏళ్ల వార్షికోత్సవాన్ని అత్యంత వైభవంగా జరపనున్నట్లు తెలుస్తోంది. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Apple stikes a $4.3 billion OLED display deal with Samsung. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot