యాపిల్ నుంచి డ్యుయల్ సిమ్ ఐఫోన్..?
యాపిల్ బ్రాండ్ నుంచి ఏదైనా కొత్త ఐఫోన్ మార్కెట్లో లాంచ్ అవుతోందంటే ఆ సందడే వేరు. యాపిల్ తన కొత్త ఐఫోన్ మోడల్స్‌ను మరికొద్ది రోజుల్లో ప్రపంచానికి పరిచయం చేయబోతోంది.
యాపిల్ బ్రాండ్ నుంచి ఏదైనా కొత్త ఐఫోన్ మార్కెట్లో లాంచ్ అవుతోందంటే ఆ సందడే వేరు. యాపిల్ తన కొత్త ఐఫోన్ మోడల్స్‌ను మరికొద్ది రోజుల్లో ప్రపంచానికి పరిచయం చేయబోతోంది. ఈ నేపథ్యంలో ఓ హాట్ రూమర్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. చైనా మొబైల్ అనే ఆపరేటర్ వెల్లడించిన వివరాల ప్రకారం యాపిల్ తన కొత్త ఐఫోన్‌లను ఐఫోన్ ఎక్స్‌సీ (iPhone XC) ఇంకా ఐఫోన్ ఎక్స్ఎస్ ప్లస్ (iPhone XS Plus) మోడల్స్‌లో మార్కెట్లో లాంచ్ చేయబోతోంది.

వీటిలో ఐఫోన్ ఎక్స్‌సీ మోడల్...
వీటిలో ఐఫోన్ ఎక్స్‌సీ మోడల్ 6.1 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లేను కలిగి ఉంటే, మరొక మోడల్ అయిన ఐఫోన్ ఎక్స్ఎస్ ప్లస్ 6.1 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. వీటితో పాటు యాపిల్ తన మొట్టమొదటి డ్యుయల్ సిమ్ ఐఫోన్‌ను కూడా మార్కెట్లో లాంచ్ చేయబోతున్నట్లు చైనా మొబైల్ చెబుతోంది. అయితే ఈ ప్రచారంలో నిజానిజాలు ఎంతనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

ఐఫోన్ ఎక్స్‌కు అప్‌గ్రేడెడ్ మోడల్స్‌గా...
ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోన్న మరికొన్ని లీక్స్ ప్రకారం యాపిల్ లాంచ్ చేయబోతోన్న కొత్త ఐఫోన్‌లు ఐఫోన్ ఎక్స్ఎస్ (iPhone XS), ఐఫోన్ ఎక్స్ఆర్ (iPhone XR) ఇంకా ఐఫోన్ ఎక్స్ఎస్ మాక్స్ (iPhone XS Max) మోడల్స్‌లో లాంచ్ కాబోతున్నాయి. వీటిలో ఐఫోన్ ఎక్స్ఎస్ ఇంకా ఐఫోన్ ఎక్స్ఎస్ మాక్స్ మోడల్స్ ఐఫోన్ ఎక్స్‌కు అప్‌గ్రేడెడ్ మోడల్స్‌గా నిలుస్తాయట.

యాపిల్ ఏ12 చిప్‌సెట్ పై రన్ అవుతాయి..
OLED స్క్రీన్లలతో వస్తోన్న ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 5.8 అంగుళాలు ఇంకా 6.5 అంగుళాల స్క్రీన్లను కలిగి ఉంటాయట. సరికొత్త యాపిల్ ఏ12 చిప్‌సెట్ పై ఇవి రన్ అవుతాయని లీకైన రిపోర్ట్స్ ద్వారా తెలుస్తోంది. వీటిలో మరొక మోడల్ అయిన ఐఫోన్ ఎక్స్ఆర్ 6.1 అంగుళాల ఎల్‌సీడీ ప్యానల్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో సింగిల్ కెమేరాను మాత్రమే అమర్చినట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి.

3డీ మ్యాపింగ్ నిర్విహించుకునేందు వీలుగా యాపిల్ ఫేస్‌ఐడీతో పాటు....
యాపిల్ లాంచ్ చేయబోతోన్న మూడు కొత్త ఐఫోన్ మోడల్స్‌లో 3డీ మ్యాపింగ్ నిర్విహించుకునేందుకు గాను యాపిల్ ఫేస్‌ఐడీతో పాటు ట్రూడెప్త్ సెన్సార్‌లను యాపిల్ నిక్షిప్తం చేసిందట. ఈ మూడు కొత్త ఐఫోన్‌లు iOS 12 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతాయట. యానిమోజీస్‌తో పాటు Memojis అనే కొత్త యానిమేషన్ ఫీచర్‌ను ఈ ఫోన్‌లలో యాపిల్ ఏర్పాటు చేసినట్లు లీక్ అయిన రిపోర్ట్స్ ద్వారా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








