ఐఫోన్ 5 వచ్చేసింది.. ఆపిల్ అభిమానులకు పండుగే!

శాన్‌ఫ్రాన్సిస్కో: ఆపిల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐఫోన్ 5 బుధవారం ఆవిష్కరణకు నోచుకుంది. సంస్థ సీఈవో టిమ్ కుక్ టెక్ ప్రముఖుల మధ్య సొగసరి ఐఫోన్ 5ను ఆవిష్కరించారు. ఆధునిక సాంకేతికతో తుదిమెరుగులు దిద్దుకున్న ఈ అధికముగింపు స్మార్ట్‌ఫోన్ ముందస్తు బుకింగ్‌లు ఈ నెల 14 అంటే రేపటి నుంచి ప్రారంభమవుతాయి. 21నుంచి డివైజ్‌ను మార్కెట్లో విక్రయిస్తారు. ఐఫోన్ 5ను ముందుగా అమెరికా, కెనడా, సింగపూర్, హాంకాంగ్ తదితర దేశాల్లో విక్రయిస్తారు.
కీలక ఫీచర్లు:
4 అంగుళాల స్ర్కీన్, సరికొత్త ఐవోఎస్6 ఆపరేటింగ్ సిస్టం, శక్తివంతమైన ఏ6 చిప్, 1జీబి ర్యామ్,8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో స్టెబిలైజేషన్), 1.3 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ వీజీఏ కెమెరా, 4జీ ఎల్‌టీఈ వైర్‌లెస్
నెట్‍వర్క్, నెట్‌వర్క్ సపోర్ట్ (జీఎస్ఎమ్ 850 / 900 / 1800 / 1900), (సీడీఎమ్ఏ 800 / 1900- Verizon), (3జీ నెట్‌వర్క్ - హెచ్‌ఎస్‌డిపిఏ 850 / 900 / 1900 / 2100), బ్యాటరీ బ్యాకప్
(8 గంటలు 3జీ టాక్‌టైమ్, 10 గంటలు వై-ఫై బ్రౌజింగ్ ఇంకా వీడియో వీక్షణ సమయం, 40 గంటల పాటు మ్యూజిక్ వినొచ్చు, 225 గంటల స్టాండ్‌బై సదుపాయం).
ఇతర ఫీచర్లు:
నానో సిమ్‌కార్డ్ సపోర్ట్,
యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్,
సిరీ లాంగ్వేజ్ కమాండ్స్,
ఐక్లౌడ్ క్లౌడ్ సర్వీస్,
ట్విట్టర్ ఇంకా ఫేస్‌బుక్ అనుసంధానం,
టీవీ అవుట్,
ఐమ్యాప్స్,
ఐబుక్స్ పీడీఎఫ్ రీడర్,
ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్,
ఇమేజ్ ఎడిటర్,
వాయిస్ మెమో.
వివిధ టెలికం కంపెనీలతో కాంట్రాక్టుల ప్రకారం 16 జీబీ రేటు 199 డాలర్లు, 32 జీబీకి 299 డాలర్లు, 64 జీబీ 399 డాలర్లు ఉంటుంది. ఐఫోన్5ని గాజు, అల్యూమినియంతో రూపొందించారు. మార్కెట్లో ప్రస్తుతం అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్ ఇదే అవుతుందని యాపిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఫిల్ షిలర్ తెలిపారు. కేవలం 7.6 మిల్లీ మీటర్ల మందంతో ఇది 4ఎస్‌తో పోలిస్తే 18% స్లిమ్‌గా ఉంటుంది. ఇక బరువు కూడా 20% తక్కువగా 112 గ్రాములే.
ఐఫోన్ 5 ఇండియాలో ఎప్పుడంటే..?
ప్రముఖ టెక్ పోర్టల్ బీజీఆర్ వెల్లడించిన సమాచారం మేరకు ‘ఆపిల్ ఐఫోన్ 5’ను నవంబర్ 13, దిపావళీ కానుకగా భారత్‌లో విక్రయించనున్నారు. ఎయిర్‌టెల్ ఇంకా ఎయిర్‌సెల్ రిటైల్ స్టోర్‌లలో ఈ ఫోన్ విక్రయాలు జరగనున్నాయి.


Click it and Unblock the Notifications