ఐఫోన్ నుంచి మూడు కొత్త వేరియంట్లు, తక్కువ ధరలో..

Written By:

ఆపిల్ కంపెనీ మరో సంచలనానికి రెడీ కాబోతోంది. ఐఫోన్ X విజయవంతమైన నేపథ్యంలో వచ్చే ఏడాది మరో మూడు సరికొత్త మోడళ్లను తీసుకువచ్చే ప్రణాళికలు చేస్తోందంటూ కొన్ని వార్తలు గుప్పుమంటున్నాయి. KGI Securitiesకి చెందిన ఆపిల్ ఎనాలసిస్ట్ కుయో , అతని టీమ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. అన్నీ కుదిరితే ఈ ఏడాది చివరకల్లా దీనిపై ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఆపిల్ తలరాతని మార్చేసిన ఐఫోన్ X ,రికార్డుల హోరు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే

6.1, 6.5అంగుళాల తెరతో వచ్చే మొబైల్స్‌లో ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉండగా 5.8 అంగుళాల మొబైల్‌లో టీఎఫ్‌టీ-ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉండొచ్చని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన చిత్రం కూడా హల్ చల్ చేస్తోంది.

దాదాపు రూ.50,000 వరకు..

ఆపిల్ నుంచి రాబోతోన్న 6.1 అంగుళాల మొబైల్‌ ఫోన్‌ ధర దాదాపు రూ.50,000 వరకు ఉండొచ్చని సంస్థ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. మిగతా రెండు ఫోన్ల ధర గురించి మాత్రం ఎలాంటి సమాచారం లేదు.

డిజైన్ పరంగా..

కాగా ఈ మూడు ఫోన్లు డిజైన్ పరంగా ఐఫోన్ Xని పోలి ఉంటాయని, ఫీచర్లు కూడా అదే స్థాయిలో ఉండవచ్చని ఆ విశ్లేషక సంస్థ తెలిపింది. ఇక కెమెరా సామర్ధ్యం కూడా ఐఫోన్ Xలాగే ఉండే అవకాశం ఉంటుందని సమాచారం.

120 మిలియన్ల ఐఫోన్లను..

కాగా ఆపిల్ 2018 ఆగస్టు చివరినాటికల్లా 120 మిలియన్ల ఐఫోన్లను మార్కెట్లోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు దూసుకువెళుతోంది.

ఐఫోన్ X ఇప్పటికే..

మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ X ఇప్పటికే రికార్డ్ స్థాయి అమ్మకాలను కొల్లగొట్టిన సంగతి తెలిసిందే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Apple will release 3 new iPhones next year - including a super-sized iPhone X Read more News At Gizbot Telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting