కాపీ ఉత్పత్తుల విషయంలో శ్యామ్‌సంగ్‌పై గెలిచిన యాపిల్

Posted By: Super

కాపీ ఉత్పత్తుల విషయంలో శ్యామ్‌సంగ్‌పై గెలిచిన యాపిల్

టోక్యో: తమకు పేటెంట్‌ హక్కులైన్న అప్లికేషన్స్‌ వాడుతున్నారని ఆరోపిస్తూ శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌పై యాపిల్‌ సంస్థ కోర్టు కెక్కింది. ఐఫోన్‌, ఐపాడ్‌లకు పరిమితమైన పలు అప్లికేషన్స్‌ శాంసంగ్‌ తన టాబ్లెట్‌ పిసిల్లో వాడుతోందన్నది యాపిల్‌ ప్రధాన ఆరోపణ. శాంసంగ్‌ మార్కెటింగ్‌ చేస్తున్న హాండ్‌సెట్ల అమ్మకాలను రద్దు చేయాలని, 100 మిలియన్‌ యన్‌లను (సుమారు 1.3 మిలియన్‌ డాలర్లు) నష్టపరిహారంగా తమకు చెల్లించాలని యాపిల్‌ జపాన్‌ కోర్టును కోరింది.

ఈ విషయంలో వీరిద్దరి మద్య గత కొంతకాలంగా విభేదాలున్న మాట వాస్తవం.శ్యామ్ సంగ్ రూపోందించిన గెలాక్సీ ట్యాబ్ 10.1 అచ్చం యాపిల్ ఐకానిక్ ఐప్యాడ్ మాదిరే ఉందన్న వార్తలు రావడం జరిగింది. ఈ విషయంపై శ్యామ్ సంగ్‌కి కొర్టులో చుక్కెదురు అయింది. జర్మనీలోని వెస్టరన్ సిటీలో ఉన్న డుసెల్డాఫ్ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం జర్మనీలో కోరియా దేశానికి చెందిన శ్యామ్ సంగ్ గెలాక్సీ టాబ్ 10.1ని అమ్మకూడదు.

జడ్జి జోహానా హాఫ్ మ్యాన్ మాట్లాడుతూ యాపిల్ ఉత్పత్తులను, శ్యామ్ సంగ్ అచ్చం అదేవిధంగా రూపోందించడం నిజమని తేలడంతోనే ఈ తీర్పుని ఇవ్వడం జరిగిందని తెలిపారు. రెండు తయారీదారు సంస్దలకు చెందిన ఉత్పత్తలను చూస్తుంటే శ్యామ్ సంగే, యాపిల్ ఉత్పత్తిని కాపీకొట్టిందని తెలిసిపోయింది. గతంలో ఇచ్చిన తీర్పుని చూసినట్లైతే మొత్తం యూరప్‌లో ఉన్న అన్ని దేశాలలో శ్యామ్ సంగ్ కాపీ ఉత్పత్తులను నిలిపివేయాలని ఇవ్వడం జరిగింది. కానీ ఈసారి ఇచ్చిన తీర్పు కొంత శ్యామ్ సంగ్‌కి ఊరట కలిగించే విషయం. ఎందుకంటే కేవలం ఒక్క జర్మనీలోనే శ్యామ్ సంగ్ ఉత్పత్తులను నిలిపివేయాలని తీర్పుని ఇచ్చింది కాబట్టి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot