Home
Mobile

యాపిల్‌కు ఊహించని ఎదురుదెబ్బ.. ఐఫోన్ అమ్మకాలు 5% పతనం... అదే కారణమా..?

By Ram Kumar

ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థకు గడ్డుకాలం ఎదురైంది. 2024 చివరి మూడు నెలల్లో యాపిల్ ఐఫోన్ల అమ్మకాలు ఏకంగా 5% మేర పడిపోయాయి. దీనికి ప్రధాన కారణం కొత్త ఐఫోన్లలో పెద్దగా ఆకట్టుకునే ఫీచర్లు లేకపోవడం, మరోవైపు చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌ల నుంచి తీవ్రమైన పోటీ ఉండటమేనని తెలుస్తోంది.

కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం, యాపిల్ ప్రపంచ మార్కెట్ వాటా ఒక్క శాతం పాయింట్ తగ్గిపోయి 18%కి చేరుకుంది.

Apple s Holiday Cheer Dampened  iPhone Sales Slip 5  Amid AI Letdown

యాపిల్‌తో పాటు దాని ప్రధాన ప్రత్యర్థి శామ్‌సంగ్ కూడా అమ్మకాల పరంగా ఇబ్బందులు పడుతుండగా, షియోమీ, వివో వంటి చైనా బ్రాండ్లు మాత్రం తమ మార్కెట్ వాటాను పెంచుకున్నాయి. 2024 మొత్తం సంవత్సరంలో యాపిల్ అమ్మకాలు 2% తగ్గాయి. ఇదిలా ఉంటే, ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ మాత్రం 4% వృద్ధిని నమోదు చేయడం గమనార్హం.

యాపిల్ సేల్స్ తగ్గడానికి ముఖ్య కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విషయంలో నెమ్మదిగా అడుగులు వేయడమే. యాపిల్ సెప్టెంబర్ 2024లో విడుదల చేసిన ఐఫోన్ 16లో కొన్ని AI ఫీచర్లను ప్రవేశపెట్టినా, అవి ఇంకా చైనాలో అందుబాటులోకి రాలేదు.

* చైనానే బిగ్ మార్కెట్

యాపిల్‌కు అమెరికా తర్వాత అతిపెద్ద మార్కెట్ చైనానే. రైటింగ్ అసిస్టెన్స్, ఇమేజ్ జనరేషన్ వంటి AI టూల్స్‌ను చైనాలో అందుబాటులోకి తీసుకురావడానికి యాపిల్ స్థానిక భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తోంది. అయితే, యాపిల్ AI ఫీచర్లపై పెట్టుబడిదారులు ఎక్కువగా అంచనాలు పెట్టుకున్నారని, అది కూడా సంస్థ పనితీరును మరింత దిగజార్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

* రీసెర్చ్‌లో ఆసక్తికర విషయాలు

కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ మాట్లాడుతూ, "ఐఫోన్ 16 సిరీస్‌కు మిశ్రమ స్పందనలు వచ్చాయి. దీనికి ప్రధాన కారణం 'యాపిల్ ఇంటెలిజెన్స్' లాంచ్ సమయంలో సిద్ధంగా లేకపోవడమే. అయితే, యాపిల్ తన ప్రధాన మార్కెట్లు కాని లాటిన్ అమెరికా వంటి ప్రాంతాల్లో బలమైన వృద్ధిని కనబరిచింది" అని తెలిపారు.

చైనాలో అమ్మకాలు తగ్గినా, యాపిల్ మాత్రం అక్కడి వినియోగదారులు ప్రీమియం మోడళ్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ప్రో మరియు ప్రో మాక్స్ వెర్షన్లు దేశంలో మొత్తం ఐఫోన్ అమ్మకాల్లో సగానికి పైగా ఉన్నాయి. ఇది యాపిల్ బ్రాండ్ విలువను సూచిస్తుంది.

* వీటి నుంచి గట్టి పోటీ

మరోవైపు, మోటోరోలా, హువావే, హానర్ వంటి పోటీదారులు వేగంగా వృద్ధి చెందాయి. ఈ బ్రాండ్లు తమ వినియోగదారులను ఆకర్షించడానికి అత్యాధునిక ఫీచర్లతో కూడిన సొంత AI టూల్స్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. ఇది యాపిల్‌కు గట్టి పోటీనిస్తోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో న్యూయార్క్ ట్రేడింగ్‌లో యాపిల్ షేర్లు 2.8% తగ్గి 230.20 డాలర్లకి చేరుకున్నాయి. ఇది స్టాక్ మార్కెట్‌లో నెలకొన్న సాధారణ ఆందోళనలను ప్రతిబింబిస్తుంది.

యాపిల్ ఆలస్యంగా AI ఫీచర్లను ప్రవేశపెట్టడం, మరోవైపు వినూత్నమైన చైనా బ్రాండ్‌ల నుంచి ఎదురవుతున్న తీవ్రమైన పోటీ కారణంగా ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి యాపిల్ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది.

కొన్ని ప్రాంతాల్లో బాగా రాణిస్తున్నా భవిష్యత్తులో వృద్ధి చెందాలంటే ఈ అడ్డంకులను అధిగమించడం యాపిల్‌కు చాలా కీలకం.

More from GizBot

Best Mobiles in India

English summary
Apple's iPhone sales declined by 5% due to underwhelming upgrades and strong Chinese competition. Their market share dropped, hindered by delayed AI features while rivals innovate.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X