ఆపిల్ తలరాతని మార్చేసిన ఐఫోన్ X ,రికార్డుల హోరు..

Written By:

ఐఫోన్‌ 10 ఏళ్ల వార్షికోత్సవంగా ఆపిల్‌ తీసుకొచ్చిన ఐఫోన్‌ ఎక్స్‌ ఆపిల్ చరిత్రను తిరగరాసింది. భారత్‌తో పాటు పలు దేశాల్లో ఈ ఫోన్‌ విక్రయానికి వచ్చిన నిమిషాల వ్యవధిలోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోయింది. వినియోగదారులు ఈ ఫోన్ కోసం ఎగబడ్డారు. శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు దీన్ని విక్రయానికి తీసుకురాగ, నిమిషాల వ్యవధిలోనే స్టాక్‌ అంతా అమ్ముడుపోయింది. దీంతో ఆపిల్‌ షేర్లు రికార్డు స్థాయిలను తాకాయి. కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ కూడా 890 బిలియన్‌ డాలర్ల దగ్గరకు చేరుకుంది.

iPhone Xకు పోటీ ఇచ్చే 10 ఫోన్‌లు ఇవే!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐఫోన్ ఎక్స్ ఫీచర్ల విషయానికొస్తే..

5.8 అంగుళాల సూపర్ రెటీనా హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఐఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టం, 3డీ టచ్ సిక్స్-కోర్ ఏ11 బయోనిక్ 64-బిట్ ప్రాసెసర్ విత్ 3 కోర్ జీపీయూ, ఎమ్11 మోషన్ కో-ప్రాసెసర్, స్టోరేజ్ ఆప్షన్స్ (64జీబి, 256జీబి), 12 మెగా పిక్సల్ + 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 7 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్.

ఎయిర్‌టెల్ ఆఫర్

ఎయిర్‌టెల్‌ తన ఆన్‌లైన్‌ స్టోర్‌ ద్వారా క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌తో ఈ ఫోన్‌ను విక్రయించింది. సాయంత్రం ఆరు గంటలకు దీన్ని విక్రయానికి తీసుకురాగ, నిమిషాల వ్యవధిలోనే స్టాక్‌ అంతా అమ్ముడుపోయింది. సిటీ బ్యాంకు క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.10వేల క్యాష్‌బ్యాక్‌ను ఎయిర్‌టెల్‌ అందించింది.

పోస్ట్‌-పెయిడ్‌ కస్టమర్లకు మాత్రమే

పైగా ఈ ఫోన్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా పోస్ట్‌-పెయిడ్‌ కస్టమర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌ బేసిస్‌లో, మొత్తం పేమెంట్‌ చేసిన వారికి ఈ ఫోన్‌ను ఎయిర్‌టెల్‌ విక్రయించింది. కాగా తాజా స్టాక్‌ వచ్చిన తర్వాత ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు నోటిఫై చేస్తుందని కంపెనీ తెలిపింది.

జియో ఆఫర్లు

ఆపిల్‌ కంపెనీ తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఐ ఫోన్‌ 10(x) పై రిలయన్స్ జియో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ నిలిచి ఐఫోన్‌ 10ను 70శాతం క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌తో కేవలం రూ. 26,7700 కే అందించనుంది. 256 జీబీ ఐ ఫోన్‌ 10 ధర రూ.30,600లకు లభ్యం కానుంది.

కొన్ని షరతులు..

అయితే దీనికి కొన్ని షరతులు కూడా ప్రకటించింది. రిలయన్స్‌ జియో కస్టమర్లు అయి వుండాలి. ఒక సంవత్సరం తరువాత ఈ స్మార్ట్‌ఫోన్‌నుతిరిగి జియోకి అప్పగించాల్సి ఉంటుంది. అదీ పూర్తిగా పనిచేసే స్థితిలో ఉన్నట్లయితే కంపెనీ దాన్ని తిరిగి కొనుగోలు చేస్తుంది.

నెలకు రూ.799 చొప్పున 12 నెలలు రీచార్జ్‌

అలాగే నమోదు చేసుకున్న తేదీ నుంచి పోస్ట్‌ పెయిడ్‌ ఖాతాదారులు నెలకు రూ.799 చొప్పున 12 నెలలు రీచార్జ్‌ తప్పనిసరిగా చేయించుకోవాలి. లేదా రూ. 9,999 వార్షిక రీఛార్జిని ఒకేసారి చేయించుకోవాలి.

అమెజాన్‌లో కొనుగోలు చేసిన వారికి మాత్రమే..

జియో స్టోర్‌, మై జియో యాప్‌ , రిలయన్స్‌ డిజిటల్‌, లేదా అమెజాన్‌లో కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. ఇక ఐ ఫోన్‌ 10(64జీబీ) కొనుగోలు సమయంలో అసలు ధర రూ. 89వేలు చెల్లించాలి.

సంవత్సరం తరువాత..

సంవత్సరం తరువాత పూర్తిగా కండీషన్‌లో ఉన్న ఐఫోన్‌ను తిరిగి జియోకి ఇస్తే ఆ సమయంలో​ రూ.62,300 లను జియో చెల్లిస్తుంది. ఇదే నిబంధన రూ. 1,02,000 విలువైన ఐ ఫోన్‌ 10 (256 జీబీ ధర) కూడా వర్తిస్తాయి. ఒక వేళ ఈ డివైస్‌కు పాక్షికంగా ఏదైనా డామేజ్‌ జరిగితే ఇచ్చే చెల్లింపుపై ఎలాంటి క్లారిటీ లేదు.

హాకాంగ్‌ వీధుల్లో..

ఇదిలా ఉంటే హాకాంగ్‌ వీధుల్లో ఐ ఫోన్‌ ఎక్స్‌ చక్కర్లు కొడుతోంది. ఐ ఫోన్‌ ఎక్స్‌ 256జీబీ వేరియంట్‌ ధర హాంకాంగ్‌ డాలర్‌ 10,300 నుంచి హాంకాంగ్‌ డాలర్‌ 10,500 పలుకుతోంది. అదేవిధంగా 64జీబీ వేరియంట్‌ ధర హాంకాంగ్‌ డాలర్‌ 8,800 నుంచి హాంకాంగ్‌ డాలర్‌ 8,900 మధ్యలో అక్కడి రోడ్ల మీద విక్రయిస్తున్నారు

టోక్యో నుంచి సిడ్నీ వరకు..

ఐఫోన్‌ ఎక్స్‌ కోసం టోక్యో నుంచి సిడ్నీ వరకు అన్ని ఆపిల్‌ స్టోర్లలోనూ పెద్ద పెద్ద క్యూలే దర్శనమిచ్చాయి. ముఖం గుర్తింపు విధానం, 3జీ సెన్సార్స్‌ వంటి కొత్త కొత్త ఆవిష్కరణలతో ఈ ఫోన్‌ అమ్మకానికి వచ్చిన సంగతి తెలిసిందే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Apple’s most expensive iPhone X is a big hit with Indians; sells out within minutes more News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot