Home
Mobile

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ శక్తి పెరగాలంటే..?

ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ల కోసం లక్షలాది ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లు గూగుల్ ప్లే స్టోర్‌లో కొలువుతీరి ఉన్నాయి. వీటిలో నచ్చిన వాటిని డౌన్‌లోడ్ చేసుకుని తరచూ ఉపయోగించటం ద్వారా బ్యాటరీ బ్యాకప్ త్వరగా తగ్గిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి, ఆండ్రాయిడ్ యూజర్లు ఈ విషయం పై దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్యాటరీ బ్యాకప్ పొదుపు అనే అంశం పై వినియోగదారులకు అవగాహన కలిగించే క్రమంలో అందుబాటులో ఉన్న బెస్ట్ బ్యాటరీ సేవింగ్ అప్లికేషన్‌ల వివరాలను గిజ్‌బాట్ మీకు సూచిస్తోంది...

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ శక్తి పెరగాలంటే..?

బ్యాటరీ డీఆర్ సేవర్... ఈ అప్లికేషన్ ఫోన్ బ్యాటరీ శక్తిని ఆదా చేయటంతో పాటు డివైజ్ వేగవంతంగా రన్ అయ్యేలా చేస్తుంది. బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, స్ర్కీన్ బ్రైట్‌నెస్ వంటి అంశాలను ఎప్పటికప్పుడు ఆడ్జస్ట్ చేస్తుంది.

గ్రీన్ పవర్ ఫ్రీ బ్యాటరీ సేవర్... ఈ పవర్ సేవింగ్ అప్లికేషన్‌ను ఒక్కసారి కాన్ఫిగర్ చేసుకుంటే చాలు. తనతంటదే పనిచేయటం ప్రారంభిస్తుంది. ఏ విధమైన సూచనలు చేయనవసరం లేదు. బ్యాటరీ శక్తిని ఏమాత్రం వృధా కానివ్వదు అన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ఈ అప్లికేషన్ సపోర్ట్ చేస్తుంది.

ఈజీ బ్యాటరీ సేవర్... ఈ పవర్ సేవర్ అప్లికేషన్ నాలుగు ప్రీసెట్ మోడ్‌లను కలిగి ఉంటుంది. వీటిని ఆన్ చేసుకోవటం ద్వారా నెట్‌వర్క్ కనెక్టువిటీ, స్ర్కీన్ బ్రైట్‌నెస్, స్ర్కీన్ టైమ్ అవుట్ వంటి అంశాలు నియంత్రణలో ఉంటాయి. తద్వారా బ్యాటరీ శక్తి కొంత మేర ఆదా అవుతుంది.

జ్యూస్ డిఫెండర్ బ్యాటరీ సేవర్... ఈ అప్లికేషన్ మీ బ్యాటరీ బ్యాకప్ పెరుగుదలకు మరింత దోహదపడుతుంది. అధిక బ్యాటరీ శక్తిని వినియోగించుకునే వై-ఫై, 3జీ, 4జీ వంటి ఫీచర్లను అవసరం మేరకు మాత్రమే ఉపయోగించుకునేలా చేస్తుంది. బ్యాటరీ శక్తిని ఏ మాత్రం వృధాకానివ్వదు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X