నీటిలో మునిగే ఆర్కోస్ 50 ఫోన్ మరో సంచలనం సృష్టిస్తుందా..?
ఆర్కోస్ నుంచి సరికొత్త ఫోన్ మార్కెట్లోకి రాబోతోంది. ఈ ఫోన్ పై నుంచి పడినా అలాగే నీళ్లలో అరగంట సేపు ఉంచినా మొబైల్ చెక్కు చెదరదు. ఆర్కోస్ 50 సాఫిర్' పేరుతో వస్తున్న ఈ మొబైల్ ఐపీ 68 సర్టిఫైడ్ అని ధర కేవలం రూ.7500 మాత్రమేనని కంపెనీ చెబుతోంది. దీన్ని జర్మనీలోని బెర్లిన్‌లో జరుగుతున్న 'ఐఎఫ్ఏ 2016' ఎలక్ట్రానిక్స్ ట్రేడ్ షో లో కూడా దీన్ని ప్రదర్శనకు ఉంచింది. ఈ డివైస్ అక్టోబర్ నుంచి ప్రపంచ వ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి రానుంది. ఇక ఫీచర్ల కూడా అదే స్థాయిలో ఉన్నాయి.
ఎవరికీ తెలియని జియో పాత ప్రస్థానం..షాకింగ్ నిజాలు

#1
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్‌తో 5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 720 X 1280 పిక్సెల్ స్క్రీన్ రిజల్యూషన్ ఈ మొబైల్ దూసుకొస్తోంది.

#2
1.5 గిగా హెడ్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్ మొబైల్ చాలా ఫాస్ట్ గా రన్ అవుతుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

#3
ర్యామ్ విషయానికొస్తే 2 జీబీ ర్యామ్‌తో ఫోన్ ను ప్రవేశపెట్టారు. 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో పాటు 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌ను పొందుపరిచారు.

#4
కెమెరా విషయానికొస్తే 13 ఎంపీ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్‌తో ఫోటోలు తీసుకోవచ్చు. 5 ఎంపీ సెల్ఫీ కెమెరాతో అదిరిపోయే సెల్ఫీలు తీసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. అలాగే 1080తో వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు.

#5
ఐపీ68 సర్టిఫైడ్ వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0,Wi-Fi Direct, USB OTG, 3.5mm audio jack, and FM radio,5000 ఎంఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీతో వస్తోంది.

#6
కంపెనీ దీని ధరను 99 యూరోలు( సుమారు రూ.7,500)లుగా నిర్ణయించింది.ఈ డివైస్ అక్టోబర్ నుంచి ప్రపంచ వ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి రానుందని కంపెనీ తెలిపింది. కేవలం బ్లాక్ కలర్ మాత్రమే అందుబాటులో ఉంటుంది.

#7
ఈ ఫోన్ నిజంగా అందుబాటులోకి వస్తే ఇప్పుడున్న ఫోన్లకు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.


Click it and Unblock the Notifications



