రిమూవబుల్ బ్యాటరీతో వచ్చే ఫోన్‌లతో లాభమా, నష్టమా?

రెండు రకాల బ్యాటరీ ఫిట్టింగ్స్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను ప్రస్తుతం మనం మార్కెట్లో చూస్తున్నాం. వాటిలో మొదటి రకం రిమూవబుల్ బ్యాటరీలతో వచ్చేవి కాగా, రెండవ రకం నాన్-రిమూవబుల్ బ్యాటరీతో వచ్చేవి. ఈ మధ్య లాంచ్ అవుతోన్న చాలా వరక స్మార్ట్‌ఫోన్‌లు నాన్-రిమూవబుల్ బ్యాటరీలతోనే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిమూవబుల్, నాన్-రిమూవబుల్ బ్యాటరీల మధ్య తేడాలేంటి..? వాటి వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి..? అనే దాని పై విశ్లేషణను ఇప్పుడు చూద్దాం..

Read More : రూ.149 ఆఫర్స్‌తో పండుగ చేస్కోండి!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్లిమ్‌నెస్ ప్రధాన కారణం..

స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ప్రధానంగా నాన్-రిమూవబల్ బ్యాటరీలను ఎంపిక చేసుకోవటానికి ప్రధాన కారణం ‘స్లిమ్‌నెస్'.

నీరుగాని దుమ్ముగాని చొరబడదు..

మొబైల్ ఫోన్‌లను మరింత స్లిమ్‌గా తీర్చిదిద్దే క్రమంలో ఫోన్ తయారీ కంపెనీలు తమకు నచ్చినట్లుగా బ్యాటరీలను మౌల్డ్ చేసి ఫోన్‌లలో సీల్ చేసేస్తున్నాయి. ఈ క్రమంలో ఫోన్ బ్యాటరీలోకి నీరుగాని దుమ్ముగాని చొరబడేందుకు ఆస్కారం ఉండదు. ఇదే సమయంలో రిమూవబుల్ బ్యాటరీల విషయానికి వచ్చేసరికి బిగింపు అంత టైట్‌గా లేకపోవటంతో నీరు అలానే దుమ్ము చొరబడే ఆస్కారం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బ్యాటరీలను బయటకు తీసేసే వీలుంటుంది.

రిమూవబుల్ బ్యాటరీలతో వచ్చే ఫోన్‌లలో బ్యాటరీలను బయటకు తీసేసే వీలుంటుంది. ఒక్కో సమయంలో ఫోన్ ప్రీజ్ అయినపుడు ఫోన్ నుంచి బ్యాటరీని తొలగించి మళ్లీ ఇన్ సర్ట్ చేయవల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో రిమూవబుల్ బ్యాటరీతో వచ్చే ఫోన్‌లు బెస్ట్ అనిపిస్తాయి.

బ్యాటరీని బయటకు తీయాల్సి వస్తే..

నాన్ రిమూవబుల్ బ్యాటరీలతో వచ్చే ఫోన్‌లలో బ్యాటరీలను బయటతీసేందుకు ఏ మాత్రం ఆస్కారం ఉండదు. ఒకవేళ బ్యాటరీని బయటకు తీయాల్సి వస్తే నిపుణులైన టెక్నీషియన్స్ అవసరమవుతారు. వీరికి ఎక్కువ మొత్తం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

నిపుణులే అవసరం లేదు

రిమూవబుల్ బ్యాటరీలతో వచ్చే స్మార్ట్‌ఫోన్‌లలో బ్యాటరీ సమస్యలను సులువుగా పరిష్కరించవచ్చు. బ్యాటరీని మార్చాల్సి వచ్చినప్పటికి సులువుగా రీప్లేస్ చేయవచ్చు. ఈ పనికి నిపుణులే అవసరం లేదు, కొంచం అవగాహన ఉంటే మీరైనా చేయవచ్చు.

వాటికే రీసేల్ వాల్యూ..

నాన్-రిమూవబుల్ బ్యాటరీలతో వచ్చే స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే రిమూవబుల్ బ్యాటరీలతో వచ్చే స్మార్ట్‌ఫోన్‌లకు రీసేల్ వాల్యూ ఎక్కువుగా ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Are Non-Removable Batteries Advantageous Than the Removable Ones?. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot