కొత్త స్మార్ట్‌ఫోన్ కొన్నారా.. సెక్యూరిటీ మాటేమిటి?
గూగుల్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మొబైల్ గుండె చప్పుడులా మారిపోయింది. పేరొందిన మొబైల్ ఆపరేటింగ్ సిస్టంలను వెనక్కి నెట్టేసి మొదటిస్థానంలో కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్న మొబైల్ ఫ్లాట్‌ఫాంగా రికార్డ్‌లు సృషిస్తోంది. ఆండ్రాయిడ్ గూగుల్ ప్లే స్టోర్‌లో వివిధ అంశాలకు సంబంధించి సుమారు 675,000 అప్లికేషన్ ల అందుబాటులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ల వినియోగం రోజురోజుకు పెరుగుతున్న నేపధ్యంలో హ్యాకర్లు వైరస్‌లతో దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ మొబైల్స్‌కి అంగరక్షకుల్ని ఏర్పాటు చేసుకోవడం ఎంతైనా అవసరం.

మొబైల్‌ను స్కాన్ చేసి వైరస్ జాడల్ని వెతికి పట్టేయాలంటే యాంటీ వైరస్‌ను మీ హ్యాండ్ సెట్‌లో నిక్షిప్తం చేసుకోవాల్సిందే. ఈ అప్లికేషన్‌లోని షెడ్యూల్ స్కానింగ్ ఆప్షన్‌ను ఎంచుకోవటం ద్వారా నిర్ణీత సమయానికి ఆటోమాటిక్‌గా మీ ఫోన్ స్కాన్ అయిపోతుంది. సాఫ్ట్‌వేర్‌లను డౌన్‌లోడ్ సమయంలో ఏవిధమైన వైరస్ లోనికి ప్రవేశించకుండా చూస్తుంది. వెబ్‌సైట్‌లు, ఈమెయిళ్లు, ఎసెమ్మెస్‌ల నుంచి డౌన్‌లోడ్ చేసే డేటాని కూడా స్కాన్ చేస్తుంది. మాల్వేర్స్, ట్రాజాన్స్ వంటి వైరస్‌లు ఫోన్ పనితీరును పూర్తిగా ధ్వంసం చేసేస్తాయి. ఈ విధమైన వైరస్‌ల నుంచి స్మార్ట్ ఫోన్ సురక్షితంగా ఉండాలంటే వైరస్ రిమూవల్ సాఫ్ట్‌వేర్‌లను తప్పనిసరిగా ఇన్స్‌స్టాల్ చేసుకోవాలి. మరిన్ని సూచనలు..........
స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్‌లను రిస్టోర్ చేసకోండి: వైరస్ నుంచి ఉపశమనం పొందే తక్షణమార్గంగా స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్‌లను రిస్టోర్ చేసుకోండి.
ఖచ్చితమైన యాంటీ -వైరస్ ప్రోగ్రామ్ వాడండి: వైరస్ నుంచి రక్షణ పొందే క్రమంలో మీ ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకున్నయాంటీ వైరస్ ప్రోగ్రామ్ ఖచ్చితమైన పనితీరును కనబర్చేదిగా ఉండాలి.
యాంటీ వైరస్ అప్‌డేట్‌లు ముఖ్యం: మీ ఫోన్‌లో నిక్షిప్తం చేయబడి ఉన్న యాంట్రీ వైరస్ ప్రోగ్రామ్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవటం మంచిది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications