మీ స్మార్ట్‌ఫోన్‌ సేప్టీ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

By Hazarath
|

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ లేనివారు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కనీసం వారి వారి బడ్జెట్ స్థాయిలో ఓ మంచి స్మార్ట్‌ఫోన్ ఉండి తీరాల్సిందే. రోజువారీ దినచర్యలో అది అంతలా పెనవేసుకుని పోయింది. పొద్దున ఫేస్ కడుక్కోకుండానే ఫేస్‌బుక్ అలాగే వాటర్ తాగకుండా వాట్సప్..టీ తాగకుండా ట్విట్టర్..ఇలా మన బతుకంతా స్మార్ట్‌ఫోన్ల మీదనే ఆధారపడిందనేది కాదనలేని వాస్తవం. అయితే ఫోన్ వాడేటప్పుడు మీరు ఇవి చేస్తున్నారా ఓ సారి చూడండి.

Read more : తక్కువ బడ్జెట్‌లో టాప్ లేపుతున్న 4జీ స్మార్ట్‌ఫోన్లు

మొదటిది

మొదటిది

పాస్‌వర్డ్ అనేది చాలా ముఖ్యమైనది.. మీరు మీ ఫోన్లోని అన్ని యాప్‌లకు పాస్‌వర్డ్ ఇస్తున్నారా ఓ సారి చెక్ చేసుకోండి.

వైఫై కనెక్టింగ్

వైఫై కనెక్టింగ్

మీరు ఎక్కబ బడితే అక్కడ వైఫై కనెక్ట్ అవుతున్నారా..అయితే చాలా ప్రమాదం. మీ ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.

ఫోన్ క్లీనింగ్

ఫోన్ క్లీనింగ్

మీరు మీ ఫోన్ రోజూ క్లీన్ చేస్తున్నారా కనీసం వారానికోసారైనా క్లీన్ చేస్తున్నారా చెక్ చేసుకోండి.అలా చేయకుంటే బ్యాక్టీరియా చేరే ప్రమాదం ఉంది. ఎప్పటికప్పుడు టిష్యూ పేపర్ తో క్లీన్ చేసుకోవడం మర్చిపోకండి.

ఫోన్ ఛార్జింగ్

ఫోన్ ఛార్జింగ్

మీరు మీ ఫోన్ చార్జింగ్ కరెక్ట్ గా పెడుతున్నారా ఓ సారి చెక్ చేసుకోండి. మీరు రాత్రంతా మీ ఫోన్ చార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీ తొందరగా పాడయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఛార్జ్ పుల్ కాగానే తీసేయండి.

యాంటి వైరస్

యాంటి వైరస్

మీ స్మార్ట్ ఫోన్ అనేది చిన్న కంప్యూటర్ లాంటిది. కంప్యూటర్ కు యాంటి వైరస్ ఉన్నట్లుగానే మీ ఫోన్ కు యాంటీ వైరస్ ను వాడండి. మీరు ఇన్ స్టాల్ చేసే యాప్స్ నుంచి వైరస్ రాకుండా కాపాడుతుంది.

యాంటీ థెఫ్ట్స్ యాప్స్

యాంటీ థెఫ్ట్స్ యాప్స్

పనికిరాని యాప్స్ జోలికి అసలు వెళ్లవద్దు. ఒకవేళ వెళితే మీ ఫోన్ మీ నుంచి జారిపోయినట్లే

రెగ్యులర్ అప్‌డేట్స్

రెగ్యులర్ అప్‌డేట్స్

మీ ఫోన్ ఎప్పుడూ రెగ్యులర్ అప్ డేట్ లో పెట్టడం వల్ల మీ పని కూడా పాడయిపోతుంది. కాబట్టి మీకు వీలున్నప్పుడు అప్ డేట్ అప్సన్ పెట్టుకోండి.

రాండాం యాప్స్

రాండాం యాప్స్

మీరు యాప్స్ డౌన్ లోడ్ చేసుకునేటప్పుడు ఓ సారి రివ్యూలు అలాగే రేటింగ్స్ చెక్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల అది మంచిదో కాదో తెలుస్తుంది.

యాక్సస్ రాండాం లింక్స్

యాక్సస్ రాండాం లింక్స్

మీకు ఏమైనా అప్ డేట్స్ వచ్చాయంటే ఒకటికి 10 సార్లు చెక్ చేసుకొని దాని జోలికి వెళ్లండి. హ్యకర్స్ మీ ఫోన్ ఎప్పుడు హ్యాక్ చేద్దామా అని కాచుకుని ఉంటారు.

బ్లూటూత్

బ్లూటూత్

బ్లూటూత్ ను కూడా ఎప్పుడూ ఆన్ లో పెట్టుకోవద్దు. దానిద్వారా కూడా ఫోన్ హ్యాకింగ్ కు గురయ్యే ప్రమాదం ఉంది. బ్లూటూత్ యావరేజ్ రేంజ్ 10 మీటర్లు.

యాప్స్ లాగౌట్

యాప్స్ లాగౌట్

మీ ఫోన్ లోని యాప్స్ అవసరమైనప్పుడే లాగ్ ఆన్ చేయండి. మిగతా టైంలో వాటిని లాగౌట్ చేయండి.

మీ ఫోన్ కాంటాక్ట్స్

మీ ఫోన్ కాంటాక్ట్స్

మీరు మీ ఫోన్ కాంటాక్ట్స్ లో మీ పర్సనల్ పాస్ వర్డ్ లు సేవ్ చేసుకుంటే మీరు ఆర్థిక పరమైన లావాదేవీల వివరాల కోడ్స్ గురించి వెతుక్కోవాల్సిన పని ఉండదు.

 

 

Best Mobiles in India

English summary
Here Write Are you making these 10 mistakes while using a Smartphone

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X