షాకింగ్, త్వరలో స్మార్ట్‌ఫోన్‌లు కనుమరుగు

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ అనేది ప్రతి ఒక్కరికి నిత్యావసర వస్తువు. అయితే ఈ పరిస్థితి కొద్ది రోజులు మాత్రమేనని, రానున్న అయిదేళ్ల తరువాత స్మార్ట్‌ఫోన్లు అనేవి కంటికి కనపడవని ఓ అధ్యయనం చెబుతోంది. మరి స్మార్ట్‌ఫోన్లు కనుమరుగైపోతే వాటి స్థానంలోకి ఏం వస్తావనేగా మీ డౌటు, అయితే ఇది చదవండి..

Read More : టెక్నాలజీ విషయంలో నిర్లక్ష్యం వద్దు మిత్రమా!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్మార్ట్‌ఫోన్లు మరికొద్ది కాలం మాత్రమే..

నిత్యవసర వస్తువుగా మారిపోయిన స్మార్ట్‌ఫోన్లు మరికొద్ది కాలం మాత్రమే అందుబాటులో ఉంటాయట. స్మార్ట్ యూజర్స్ త్వరలోనే వాటికి గుడ్ బై చెబుతారట. ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ

అయితే, స్మార్ట్‌ఫోన్ లేకపోతే ఎలా అని దిగులు అక్కర్లేదు.. ఎందుకంటే, వాటి స్థానంలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. అదే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ.

స్మార్ట్‌ఫోన్ బదులుగా..

మరో ఐదు సంవత్సరాల తర్వాత స్మార్ట్‌ఫోన్ బదులుగా ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్‌ను వాడుతారని ఎరిక్సన్ సంస్థ తమ సర్వే ద్వారా ఈ విషయాలను వెల్లడించింది.

‘సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు 95% ఇండియన్ ఇంజినీర్లు పనికిరారు'

ఫోన్ అవసరంలేకుండానే మాట్లాడుకోవచ్చు..

ఫోన్, టాబ్లెట్ లాంటి పరికరాలు వాడకుండానే మనకు కావలసిన వారితో ఇంటరాక్షన్ అయ్యే వీలుందని సర్వే నిర్వహించిన మరిన్ని సంస్థలు ఏఐ టెక్నాలజీపై ఆశాభావం వ్యక్తంచేశాయి.

రూ.333తో రోజుకు 3జీబి డేటా, 90 రోజులు మీ ఇష్టం

స్వీడన్ సహా 39 దేశాలలో..

స్వీడన్ సహా 39 దేశాలలో సుమారు లక్ష మందిని సంప్రదించినట్లు రీసెర్చర్స్ తెలిపారు. 2021 నుంచి ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సర్వే ద్వారా అంచనా వేస్తున్నారు.

ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వస్తే..

ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వస్తే మరింత సులువుగా మన బంధువులు, ఫ్రెండ్స్ అందరితో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉందని అధ్యయనం చేపట్టిన బృందం పేర్కొంది.

రూ.333తో రోజుకు 3జీబి డేటా, 90 రోజులు మీ ఇష్టం

లక్ష మందిని సర్వే చేశారు

ఆస్ట్రేలియాలోని ఎరిక్‌సన్ కన్‌జ్యూమర్ ల్యాబ్‌కు చెందిన పలువురు పరిశోధకులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 39 దేశాలలో దాదాపు లక్ష మందిని సర్వే చేశారు.

మరో 5 ఏళ్ల తరువాత

ప్రతి సందర్భంలోనూ స్మార్ట్‌ఫోన్ల వాడకం ఎక్కువైన నేపథ్యంలో సదరు వ్యక్తులను ఈ విషయంపై సర్వే చేయగా 'మరో 5 ఏళ్ల తరువాత స్మార్ట్‌ఫోన్లు అనేవి కనుమరగవుతాయని, వాటి స్థానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రజలకు సేవలందిస్తుందని, స్మార్ట్‌ఫోన్లనేవి గతానికి చెందినవిగా మారుతాయ'ని వారు చెప్పారు.

ఇక పాస్‌వర్డ్ లేకుండా మైక్రోసాఫ్ట్ అకౌంట్లలోకి లాగిన్ కావొచ్చు

కృత్రిమ మేథస్సు అద్భుతాలు

భవిష్యత్తులో 'కృత్రిమ మేథస్సు' అద్భుతాలు చేయనుందని కూడా వారు సమాధానమిచ్చారని పరిశోధకులు తెలిపారు. 2021వ సంవత్సరం వరకు ఈ రంగంలో ఆశ్చర్యకర ఫలితాలు వస్తాయని ఈ విషయం తెలుసుకున్న నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Artificial intelligence, The Future Of Smartphones. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot