Home
Mobile

Asus 6Z, 5Z Price Cut: ఈ ఫోన్‌ల పై RS.7000 డిస్కౌంట్

ప్రముఖ తైవానీస్ స్మార్ట్‌ఫోన్‌ తయారీదారు ఇటీవల ఇండియాలో ఆసుస్ ROG ఫోన్ 2 ను విడుదల చేశారు. ఇది గేమింగ్ అనుభవం కోసం ప్రత్యేకంగా క్యూరేట్ చేయబడిన కొన్ని పవర్-ప్యాక్డ్ స్పెసిఫికేషన్‌లతో వస్తుంది. ఏదేమైనా ఆసుస్ నుండి వచ్చిన స్మార్ట్‌ఫోన్‌లు ఆసుస్ 6Z మరియు ఆసుస్ 5Z గతంలో రెడ్‌మిK 20 కు గట్టి పోటీని ఎదుర్కొన్నాయి. అయితే కొత్త అప్‌డేట్‌లో ఆసుస్ 6 జెడ్, ఆసుస్ 5 జెడ్ రెండింటి ధరలను తగ్గిస్తున్నట్లు ఆసుస్ ప్రకటించింది.

ఆసుస్ ఫ్లాగ్‌షిప్

ఆసుస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లకు ఇప్పుడు ఇండియాలో అతి పెద్ద ధర తగ్గింపు లభించింది. ఆసుస్ 6Z మరియు ఆసుస్ 5Z యొక్క ధరలను ఇప్పుడు సుమారు రూ.7 వేల వరకు కంపెనీ తగ్గించింది. ఈ తగ్గింపు ధర ఆసుస్ 6 జెడ్ మరియు ఆసుస్ 5 జెడ్ స్మార్ట్‌ఫోన్‌ల యొక్క అన్ని మోడళ్లలో లభిస్తుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఈ రోజు నుండి ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త ధరల వద్ద లభిస్తాయి.

 

ఆసుస్ 6Z: కొత్త ధర  vs పాత ధర

ఆసుస్ 6Z: కొత్త ధర vs పాత ధర

- ఆసుస్ 6 జెడ్ స్మార్ట్‌ఫోన్‌ యొక్క 6 జిబి RAM + 64 జిబి స్టోరేజ్ మోడల్ మీద సుమారు రూ.4,000 వరకు ధర తగ్గింపు లభించింది. ఇప్పుడు రూ.27,999 ధర వద్ద లభిస్తుంది. ఈ ఫోన్ ఇంతకు ముందు రూ.31,999 ధర వద్ద అందుబాటులో ఉండేది.

- ఆసుస్ 6 జెడ్ యొక్క 6 జిబి RAM +128 జిబి స్టోరేజ్ మోడల్ ఇప్పుడు రూ.30,999 ధర వద్ద లభిస్తుంది. దీని యొక్క పాత ధర సుమారు రూ.34,999. అంటే ఈ మోడల్ మీద రూ.4,000 వరకు తగ్గింపు లభించింది.

- అలాగే ఆసుస్ 6 జెడ్ యొక్క 8 జిబి RAM మరియు 256 జిబి స్టోరేజ్ వేరియంట్ మీద రూ.5,000 తగ్గింపు పొందిన తర్వాత ఇప్పుడు ఇది రూ.34,999 ధర వద్ద లభిస్తుంది.

 

 

ఆసుస్ 5Z: కొత్త ధర  vs పాత ధర

ఆసుస్ 5Z: కొత్త ధర vs పాత ధర

- ఆసుస్ 5 జెడ్ 6 జిబి RAM మరియు 64 జిబి స్టోరేజ్ వేరియంట్ మీద ఇప్పుడు రూ.5 వేలు తగ్గింపు పొందిన తర్వాత ఇది రూ.16,999 ధర వద్ద లభిస్తుంది.

- అలాగే ఇందులో 6 జీబీ RAM + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ఇప్పుడు రూ.18,999 ధర వద్ద లభిస్తుంది. దీని పాత ధర రూ.24,999 అంటే ఈ వేరియంట్ మీద సుమారు 6వేలు వరకు తగ్గింపు లభించింది.

-ఈ స్మార్ట్‌ఫోన్‌ యొక్క టాప్ వేరియంట్ 8 జీబీ RAM + 256 జీబీ స్టోరేజ్ మోడల్ ఇప్పుడు రూ.21,999 కు లభిస్తుంది. దీని పాత ధర రూ .28,999 తో పోలిస్తే ఈ మోడల్‌ మీద అత్యధికంగా 7 వేల వరకు తగ్గింపు లభించింది.

 

 

ఆసుస్ 6z స్పెసిఫికేషన్స్

ఆసుస్ 6z స్పెసిఫికేషన్స్

ఆసుస్ 6z స్మార్ట్‌ఫోన్‌ 6.4-అంగుళాల ఫుల్ HD + నానోహెడ్జ్ డిస్ప్లేతో గొరిల్లా గ్లాస్ 6 రక్షణతో వస్తుంది. క్వాల్కమ్ యొక్క స్నాప్‌డ్రాగన్ 855 చిప్‌సెట్‌తో ఇది రన్ అవుతుంది. ఇది 8GB వరకు ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే ఆసుస్ 6z స్టాక్ ఆండ్రాయిడ్‌తో ZenUI తో రన్ అవుతుంది . ఈ స్మార్ట్‌ఫోన్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

 

స్మార్ట్‌ఫోన్‌లో

ఆసుస్ 6 జెడ్ స్మార్ట్‌ఫోన్‌లో అతి పెద్ద హైలైట్ దాని ఫ్లిప్ కెమెరాలు. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ గల దీని కెమెరాలు సెల్ఫీలు తీయడానికి కూడా ముందుకు తిప్పవచు. కెమెరా సెటప్‌లో 48 మెగాపిక్సెల్ సోనీ IMX586 సెన్సార్ మరియు 13 మెగాపిక్సెల్ 125-డిగ్రీల వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. ఇందులో ముందువైపు సెల్ఫీ కెమెరా ఉండదు.

 

ఆసుస్ 5z స్పెసిఫికేషన్స్

ఆసుస్ 5z స్పెసిఫికేషన్స్

ఆసుస్ 5 జెడ్‌ స్మార్ట్‌ఫోన్‌ విషయానికి వస్తే ఇది స్నాప్‌డ్రాగన్ 845 SoC ఆధారంగా రన్ అవుతుంది. ఇది 8GB వరకు RAM మరియు 256GB వరకు స్టోరేజ్‌ గల వివిధ వేరియంట్ లతో వస్తుంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో గల 6.4-అంగుళాల ఫుల్ HD + IPS LCD డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 3,300mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Best Mobiles in India

English summary
Asus Two Smartphones Now in Flipkart with RS.7000 discount
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X