Asus ROG గేమింగ్ స్మార్ట్‌ఫోన్ మీద రూ.3000 భారీ ధర తగ్గింపు!!!
ఇండియాలో గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఆసుస్ ఫోన్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఏడాది జూలైలో ప్రముఖ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌కు అప్ డేట్ వెర్షన్ గా సంస్థ ఆసుస్ ROG ఫోన్ 3 ను విడుదల చేసింది. రూ.49,999 రిటైల్ ధర వద్ద ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేశారు. అయితే కొద్ది నెలల తరువాత ఇప్పుడు సంస్థ ఈ ఫోన్ యొక్క ధర మీద రూ.3,000 తగ్గించింది. దీని ఫలితంగా ఈ గేమింగ్ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.46,999 తగ్గింపు ధర వద్ద లభిస్తుంది. అదనంగా ఫ్లిప్‌కార్ట్ అందించే అన్ని రకాల డిస్కౌంట్లు మరియు ఆఫర్లతో పాటుగా రాయితీ ధరతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రస్తుతం కొనుగోలు చేయగలుగుతారు. దీని గురించి మరిన్ని తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఆసుస్ ROG గేమింగ్ స్మార్ట్‌ఫోన్ తగ్గింపు ధరల వివరాలు
ఆసుస్ ROG ఫోన్ 3 యొక్క అన్ని వేరియంట్ల మీద ఇప్పుడు రూ.3,000 తగ్గింపు ధర లభిస్తుంది అని కంపెనీ ప్రకటించింది. ధర తగ్గింపు పొందిన తరువాత ఆసుస్ ROG ఫోన్ 3 యొక్క 8GB ర్యామ్ / 128GB స్టోరేజ్ వెర్షన్ 12GB ర్యామ్ / 128GB స్టోరేజ్ వెర్షన్ మరియు 12GB ర్యామ్ / 256GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధరలు వరుసగా రూ.46,999, రూ.49,999 మరియు 54,999 రూపాయలు. బజాజ్ ఫైనాన్స్‌తో కుదుర్చుకున్న భాగస్వామ్యంలో భాగంగా మూడింట ఒక వంతు చొప్పున కొనుగోలు చేసే అవకాశాన్ని వినియోగదారులకు ఇస్తుంది. మిగిలిన మొత్తాన్ని 12 వాయిదాలలో చెల్లించడానికి అవకాశం ఉంది.

ఫ్లిప్‌కార్ట్ దీపావళి అమ్మకంలో ఆసుస్ ROG ఫోన్ 3 ఆఫర్స్
ఫ్లిప్‌కార్ట్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో ప్రస్తుతం అక్టోబర్ 29 మధ్యాహ్నం (IST) నుండి ప్రారంభమైన ఫ్లిప్‌కార్ట్ దీపావళి అమ్మకంలో వీటి యొక్క కొత్త ధరలు ప్రతిబింబిస్తున్నాయి. అయితే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ కస్టమర్లు ఇప్పటికే పైన పేర్కొన్న తగ్గింపు ధర వద్ద ఆసుస్ ఆర్‌ఓజి ఫోన్ 3 ను కొనుగోలు చేయవచ్చు. యాక్సిస్ బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డులను ఉపయోగించి 10 శాతం తక్షణ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది.

ఆసుస్ ROG ఫోన్ 3 స్పెసిఫికేషన్స్
ఆసుస్ ROG ఫోన్ 3 యొక్క స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇది 6.59-అంగుళాల AMOLED స్క్రీన్‌ను 1080 × 2340 పిక్సెల్‌ల FHD + రిజల్యూషన్ పరిమాణంలో కలిగి ఉంటుంది. ఇది RGB బ్యాక్ ప్యానెల్ కలిగి ఉండడమే కాకుండా ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌లో రన్ అవుతుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865+ SoC చిప్ సెట్ ఆధారితమైన ఈ స్మార్ట్‌ఫోన్ మూడు స్టోరేజ్ ఆప్షన్లలో వస్తుంది. ఇమేజింగ్ విషయంలో ROG ఫోన్ 3 వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ మరియు 24 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. వెనుకవైపున గల కెమెరాలలో 64 మెగాపిక్సెల్ షూటర్ మెయిన్ కెమెరా, వైడ్ యాంగిల్ లెన్స్‌తో 13 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా మరియు 5 మెగాపిక్సెల్ డీప్ లెన్స్ కెమెరాలతో జత చేయబడి వస్తుంది.


Click it and Unblock the Notifications








