ఈ పౌచ్ వాడితే మీ ఫోన్ వానలో తడవదు!

Written By:

Asus తన జెన్ లైనప్ నుంచి ఓ కొత్త ప్రొడక్ట్‌ను లాంచ్ చేసింది. పేరు జెన్‌పౌచ్. IPX8 సర్టిఫికేషన్‌తో కూడిన వాటర్‌ప్రూఫ్ క్యారీ పౌచ్ మీ స్మార్ట్‌ఫోన్‌లను వర్షం నుంచి కాపాడుతుంది.

ఈ పౌచ్ వాడితే మీ ఫోన్ వానలో తడవదు!

థర్మోప్లాస్టిక్ పాలియురేతేన్ అలానే నైలాన్ పదార్థాల కలయకతో రూపొందించబడిన ఈ పౌచ్ నీటి ప్రమాదాల బారి నుండి మీ ఫోన్‌లను రక్షించగలదు. ఒక మీటర లోతైన నీటిలో పడినప్పటికి ఈ పౌచ్‌లోని ఫోన్ చెక్కుచెదరదు. మార్కెట్లో ఈ పౌచ్ ధర ఇంకా అందుబాటుకు సంబధించిన వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Read More : ఈ చైనా ఫోన్‌ల దెబ్బకు దిగ్గజ బ్రాండ్‌లు వణకాల్సిందే..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Asus జెన్‌పౌచ్ ప్రత్యేకతలు

క్రిస్టల్ క్లియర్ ఫ్రంట్ విండో ఆప్షన్‌తో వస్తోన్న ఈ జెన్‌పౌచ్ లోపలి నుంచే ఫోన్‌ను ఆపరేట్ చేయవచ్చు. ఫోన్‌ను పౌచ్‌లో ఉంచే ఫోటోలు, వీడియోలు చిత్రీకరించుకోవచ్చు.

Asus జెన్‌పౌచ్ ప్రత్యేకతలు

ఈ పౌచ్ మీ ఫోన్‌లనే కాకుండా మీ డబ్బులను, క్రెడిడ్ కార్డులను ప్రొటెక్ట్ చేయగలదు. ఫింగర్ హుక్, హ్యాండ్ స్ట్రాప్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

Asus జెన్‌పౌచ్ ప్రత్యేకతలు

Asus జెన్‌పౌచ్ లో 5.5 అంగుళాలు ఇంకా అంతకన్నాతక్కువ డిస్‌ప్లే సామర్థ్యం కలిగిన ఫోన్‌లు ఫిట్ అవుతాయి.

Asus జెన్‌పౌచ్ ప్రత్యేకతలు

మీ స్మార్ట్‌ఫోన్‌ను ఈ పౌచ్‌లో ఉంచి స్విమ్మింగ్ పూల్ దగ్గర నిశ్చింతగా వాడుకోవచ్చు. బోటింగ్ అలానే స్నానం కూడా ఆస్వాదించవచ్చు.

Asus జెన్‌పౌచ్ ప్రత్యేకతలు

రెండు కలర్ ఆప్షన్స్‌లో ఈ పౌచ్ అందుబాటులో ఉంటుంది. ఒకటి లైట్నింగ్ ఎల్లో, మరొకటి స్టార్మ్ బ్లాక్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Asus Just Launched a Waterproof Pouch with Strap for your Smartphone. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot