టాంగో 3డీ టెక్నాలజీతో అసుస్ నుంచి అదిరే ఫోన్

Written By:

తైవాన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగ్గజం అసుస్ తన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌‌ను అసుస్ జెన్‌ఫోన్ ఏఆర్‌ పేరుతో విడుదల చేసింది. ప్రఖ్యాత సెర్చ్ ఇంజిన్ గూగుల్ డీ టాంగో టెక్నాలజీతో వచ్చిన ఈ ఫోన్ వినియోగదారులకు సరికొత్త అనుభవాన్ని అందించనుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇందులో అగ్ మెంటెడ్ వర్చువల్ రియాలిటీ ఫీచర్లు వినియోగదారులకు సరికొత్త అనుభవాన్ని ఇవ్వనున్నాయి. కాగా అగ్ మెంటెడ్ రియాలిటీ టాంగో కంప్యూటింగ్ ఫ్లాట్ ఫాంలో ఇది రెండవ మొబైల్.

2017లో జుకర్ బర్గ్ విసిరిన సవాల్..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లెనోవా ఫ్యాబ్ 2

గతేడాది చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ దిగ్గజం లెనోవా ఫ్యాబ్ 2 ని లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఫోన్ మన చుట్టూ ఉన్న పరిసరాలను 3డీ స్కానింగ్ చేయగలదు. ఇప్పుడు అదే ఫీచర్ తో అసుస్ జెన్‌ఫోన్ ఏఆర్‌ వస్తోంది.

సూపర్ అమోల్డ్ స్క్రీన్

5.7- అంగుళాల సూపర్ అమోల్డ్ స్క్రీన్ తో పాటు క్వాల్కం స్నాప్ డ్రాగన్ 821 ప్రాసెసర్ మీద ఫోన్ రన్ అవుతుంది. ఆపరేటింగ్ విషయానికొస్తే ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ మీద ఆపరేట్ అవుతుంది.

ర్యామ్ , కెమెరా

8 జిబి ర్యామ్ తో ఈఫోన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే కెమెరా విషయానికొస్తే 23 ఎంపీ కెమెరాతో ఈ ఫోన్ రానున్నట్లు సమాచారం. 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటే అవకాశం ఉంది. ఈ ఫోన్ ఎంతనేది కంపెనీ ఇంకా నిర్ణయించలేదు.

త్వరలోనే

లాస్ వెగాస్ లో నిర్వహించిన కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ షో సీఈఎస్ -2017 లో దీన్ని ఆవిష్కరించింది.ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో దీన్ని అందుబాటులోకి తేనున్నట్టు అసుస్ ఛైర్మన్ జానీ షిస్ తెలిపారు.

స్మార్ట్‌ఫోన్‌ రంగంలో ఇది ఓ సంచలనమని

అంతే కాకుండా స్మార్ట్‌ఫోన్‌ రంగంలో ఇది ఓ సంచలనమని టాంగో, గూగుల్ డే డ్రీమ్ ఆధారిత మొబైల్ ను లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందని మార్కెటింగ్ చీఫ్ ఎరిక్ హెర్మాన్ సన్ తెలిపారు.

గూగుల్ ప్లే స్టోర్ లోకి

ఇదిలా ఉంటే డజన్ల కొద్దీ ట్యాంగో ఆధారిత యాప్ లు గూగుల్ ప్లే స్టోర్ లోకి అందుబాటులోకి తీసుకురానున్నట్టు గూగుల్ ప్రాజెక్ట్ ట్యాంగో లీడర్ జానీ లీ వెల్లడించారు. మొత్తానికి త్వరలో మరో సంచలనం రాబోతుందన్నమాట.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Asus Launches New Smartphone With Google 3D Tango read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot