100జీబి స్టోరేజ్‌తో Asus 4జీ ఫోన్‌, రూ.6,999కే

Asus తన జెన్‌ఫోన్ సిరీస్ నుంచి సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. 'జెన్‌ఫోన్ గో 4.5 ఎల్టీఈ' పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్ ధర రూ.6,999. నేటి నుంచి అన్ని ఆఫ్‌లైన్ అలానే ఆన్‌లైన్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది.

100జీబి స్టోరేజ్‌తో  Asus 4జీ ఫోన్‌, రూ.6,999కే

Read More : రూ.9,999 నోకియా ఫోన్‌లో 4జీబి ర్యామ్..?

4.5 అంగుళాల FWCA డిస్‌‌ప్లే (రిసల్యూషన్854x 480పిక్సల్స్), 1.0గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, అడ్రినో 306 జీపీయూ, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, గూగుల్ డ్రైవ్ స్టోరేజ్ ద్వారా 100జీబి క్లౌడ్ స్టోరేజ్‌ను రెండు సంవత్సరాల పాటు ఉపయోగించుకునే అవకాశాన్ని ఆసుస్ కల్పిస్తోంది. 8 మెగా పిక్సల్ రేర్ ఫేసిగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటిగ్ సిస్టం, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్ 4.0, డ్యుయల్ సిమ్, మైక్రో యూఎస్బీ.

English summary
Asus launches Zenfone Go 4.5 LTE in India for Rs 6,999. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot