అసూస్.. సామ్‌సంగ్‌ల మధ్య ఫాబ్లెట్ వార్?

అసూస్ తన ఒరిజనల్ ప్యాడ్ ఫోన్‌కు సక్సెసర్ వర్షన్‌గా ప్యాడ్ ఫోన్ 2ను ప్రకటించిన నేపధ్యంలో ఫాబ్లెట్ ప్రపంచంలో ఉత్కంఠత మొదలైంది. తాజా నివేదికల ప్రకారం ప్యాడ్ ఫోన్2 జర్మన్ మార్కెట్టో డిసెంబర్ 1 నుంచి లభ్యంకానుంది. సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ తన గెలాక్సీ నోట్‌కు సక్సెసర్ వర్షన్‌గా గెలాక్సీ నోట్ 2ను ఇటీవల బెర్లిన్‌లో నిర్వహించిన ఐఎఫ్ఏ ఎగ్జిబిషన్‌లో ఆవిష్కరించింది. ఇండియన్ మార్కెట్ ధర రూ.39,990. అసూస్ ప్యాడ్ ఫోన్ 2 ధర తెలియాల్సి ఉంది. ఈ ఏడాదికిగాను పోటీ గ్యాడ్జెట్‌లుగా భావిస్తున్న ఈ రెండు డివైజ్‌ల స్పెసిఫికేషన్‌ల పై తులనాత్మక అంచనా.....
బరువు ఇంకా చుట్టుకొలత....
అసూస్ ప్యాడ్‌ఫోన్ 2: చుట్టుకొలత 137.9 x 68.9 x 9మిల్లీ మీటర్లు, బరువు 135 గ్రాములు,
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్2: చుట్టుకొలత 151.1 x 80.5 x 9.4మిల్లీ మీటర్లు, బరువు 180 గ్రాములు,
డిస్‌ప్లే....
అసూస్ ప్యాడ్ ఫోన్ 2: 4.7 అంగుళాల సూపర్ ఐపీఎస్+ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్,
సామ్ సంగ్ గెలాక్సీ నోట్2: 5.5 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్ (ప్రత్యేకతలు: ఎస్-పెన్ సపోర్ట్, మెరుగైన టచ్ స్పందనలు),
ప్రాసెసర్....
అసూస్ ప్యాడ్ ఫోన్ 2: క్వాడ్‌కోర్ క్వాల్కమ్ ఏపీక్యూ8064 సాక్ ప్రాసెసర్,
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్2: సామ్‌సంగ్ ఎక్సినోస్ 4412 క్వాడ్ చిప్‌సెట్,
ఆపరేటింగ్ సిస్టం......
అసూస్ ప్యాడ్ ఫోన్ 2: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
సామ్ సంగ్ గెలాక్సీ నోట్2: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (ప్రాజెక్ట్ బట్టర్, కాంట్రాక్టిబుల్ నోటిఫికేషన్స్. రీసైజబుల్ అప్లికేషన్ విడ్జెట్స్, లైవ్ వాల్ పేపర్ ప్రివ్యూ, హైరిసల్యూషన్ కాంటాక్ట్ ఫోటోస్),
కెమెరా....
అసూస్ ప్యాడ్ ఫోన్ 2: 13 మెగా పిక్సల్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్2: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా(ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
స్టోరేజ్......
అసూస్ ప్యాడ్ ఫోన్ 2: ఇంటర్సల్ స్టోరేజ్ వర్షన్స్ (16జీబి, 32జీబి, 64జీబి), 2జీబి ర్యామ్, 32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ(వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్),
సామ్ సంగ్ గెలాక్సీ నోట్2: ఇంటర్సల్ స్టోరేజ్ వర్షన్స్ (16జీబి, 32జీబి, 64జీబి), 2జీబి ర్యామ్, 32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ(వయా మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్),
కనెక్టువిటీ.....
అసూస్ ప్యాడ్ ఫోన్ 2: 3జీ, వై-పై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్2: 3జీ, వై-పై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
బ్యాటరీ....
అసూస్ ప్యాడ్ ఫోన్ 2: 2140ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,
సామ్ సంగ్ గెలాక్సీ నోట్2: 3100ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.
ధరలు.....
అసూస్ ప్యాడ్ ఫోన్ 2: ధర తెలియాల్సి ఉంది.
సామ్ సంగ్ గెలాక్సీ నోట్2: ఇండియన్ మార్కెట్ ధర రూ.39,990.
ప్రత్యేకతలు...
అసూస్ ప్యాడ్ ఫోన్ 2: ఈ ఫాబ్లెట్ ను ఫ్యాడ్ ఫోన్ స్టేషన్ సాయంతో టాబ్లెట్ లా మార్చుకోవచ్చు. టాబ్లెట్ డాక్ బరువు 514 గ్రాములు, 5000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 13-పిన్ కనెక్టర్.
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్2: ఎస్ వాయిస్, డైరెక్ట్ కాల్, స్మార్ట్‌స్టే, ఎస్ బీమ్, పాప్-అప్ ప్లే,
తీర్పు.....
పెద్దదైన డిస్‌ప్లే, మెరుగైన బ్యాటరీ బ్యాకప్ ఇంకా ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ అనుభూతులను కోరుకునే వారికి గెలాక్సీ నోట్ 2 ఉత్తమ ఎంపిక.


Click it and Unblock the Notifications