హిట్ టాక్‌తో...!

Posted By: Staff

 హిట్ టాక్‌తో...!

 

 

ప్రకటించిన నాటి నుంచి విశ్లేషకుల ప్రశంసలనందుకుంటున్న ‘అసస్ ప్యాడ్ ఫోన్2’ను  మంగళవారం (అక్టోబర్ 16) వినూత్నంగా రెండు వేరువేరు ప్రాంతాల్లో ఆవిష్కరించారు. ఏకకాలంలో మిలాన్ అలాగే తైపీ ప్రాంతాల్లో నిర్వహించిన ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా మిశ్రమ స్పందన లభించింది.

సరికొత్త ప్యాడ్‌ఫోన్2 ఫీచర్లను పరిశీలించినట్లయితే... 4.7 అంగుళాల సూపర్ ఐపీఎస్+ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), క్వాడ్‌కోర్ క్వాల్కమ ఏపీక్యూ8064 సాక్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా విత్ బీఎస్ఐ సెన్సార్), 1.2మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),  ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 2జీబి ర్యామ్, 50జీబి అసస్ వెబ్ స్టోరేజ్,  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, మెమెరీ వేరియంట్స్ 16జీబి,32జీబి,64జీబి. శక్తివంతమైన 2,140ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.

కనెక్టువిటీ ఫీచర్లు: 3జీ, వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్(ఎన్ఎఫ్‌సీ).

ప్రత్యేకత ఏంటంటే..?

అసస్ ప్యాడ్‌ఫోన్2‌ను, ప్యాడ్‌ఫోన్ స్టేషన్ అనే డాక్ సాయంతో  టాబ్లెట్‌లా ఉపయోగించుకోవచ్చు. మరో డాక్ కీబోర్డ్ సాయంతో ప్యాడ్‌ఫోన్2ను ల్యాపీలా వినియోగించుకోవచ్చు.  ప్యాడ్‌ఫోన్ స్టేషన్ ( టాబ్లెట్ డాక్) ఫీచర్లు... -  10.1 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే,

-  5000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, -  బరువు 514 గ్రాములు, -  13 పిన్ కనెక్టర్ పోర్ట్.

అసస్ ప్యాడ్‌ఫోన్2 ఎప్పుడు విడుదలవుతుంది..?

ప్యాడ్ ఫోన్2 ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా డివైజ్ విడుదలకు సంబంధించి పలు కీలక వివరాలను అసస్ వర్గాలు వెల్లడించాయి. ఈ హైబ్రిడ్ డివైజ్ డిసెంబర్ నాటికి  యూరోపియన్ ఇంకా ఆసియా మార్కెట్లలో విడుదలవుతుంది. అంటే.... అసస్ ప్యాడ్‌ఫోన్2ను ఇండియన్ యూజర్లు డిసెంబర్‌లో సొంతం చేసుకోవచ్చు.

ధర సంగతేంటి:  

దేశీయ మార్కెట్లో అసస్ ప్యాడ్‌ఫోన్2 ధర రూ.64,999 నుంచి రూ.70,000 మధ్య ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot