మీరు జియో ప్రైమ్ యూజర్లా..అయితే బంపరాఫర్ మీకోమే

Written By:

జియో తన ప్రైమ్‌ ఖాతాదారులకు అలాగే ఆసుస్ ఫోన్లను కొత్తగా కొన్న యూజర్లకు శుభవార్త. రిలయన్స్ జియో తో భాగస్వామ్యంతో, ఆసుస్‌ ఎడిషనల్‌ డేలా పేరుతో ఒక పథకాన్ని అందిస్తోంది. తాజా ప్లాన్‌ ప్రకారం 10 రీఛార్జ్ లపై నెలకు 10జీబీ అదనపు డేటాను, మొత్తంగా 100 జిబి 4జీ డేటాను పొందవచ్చు. జూన్ 16, 2017,లేదా ఆ తరువాత అసుస్ స్మార్ట్‌ఫోన్లను కొన్న వారికి ఈ ఆఫర్ వర్తించనుంది. మూడు కేటగిరీలుగా ఈ ఉచిత డేటాను ఆఫర్‌ చేస్తోంది.

BSNL తాజా ఆఫర్లివే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో సిమ్‌ను అసుస్ ఫోన్‌లో వేసి

మీరు ఏం చేయాలంటే జియో సిమ్‌ను అసుస్ ఫోన్‌లో వేసి రూ.309 ఆపైన ప్యాక్‌ను రీచార్జి చేసుకుంటే చాలు. ఈ ఆఫర్ కింద వస్తున్న వినియోగదారులకు జియోలో రూ .309 లేదా అంతకంటే ఎక్కువ రీచార్జ్‌ వచ్చే రోజుకు 1జీబీ డేటాతోపాటుగా నెలకు 10 జీబీ డేటా లభించనుంది.

రీఛార్జి తరువాత

క్రెడిట్ పొందడానికి రీఛార్జి తరువాత వినియోగదారులకు 48 గంటలు వేచి చేయాలి. పది నెలలకు అంటే.. మార్చి 31, 2018 వరకు గరిష్టంగా 10 రీచార్జిలకు ఈ ఆఫర్‌ను వాడుకోవచ్చన్నమాట.

10 నెలలకు 100 జీబీ జియో 4జీ డేటా

ఆసుస్ జెన్‌ఫోన్ జూమ్, జెన్‌ఫోన్ 3 డీలక్స్, జెన్‌ఫోన్ 3 అల్ట్రా, జెన్‌ఫోన్ 3 (5.2), జెన్‌ఫోన్ 3 (5.5) ఫోన్లను వాడే వారికి నెలకు 10 జీబీ డేటా చొప్పున 10 నెలలకు 100 జీబీ జియో 4జీ డేటా ఉచితంగా లభిస్తున్నది.

నెలకు

అదేవిధంగా జెన్‌ఫోన్ 2, జెన్‌ఫోన్ 2 లేజర్, జెన్‌ఫోన్ 2 లేజర్ 5.5, జెన్‌ఫోన్ 3ఎస్ మ్యాక్స్, జెన్‌ఫోన్ 3 లేజర్, జెన్‌ఫోన్ 3 మ్యాక్స్ 5.2, జెన్‌ఫోన్ 3 మ్యాక్స్ 5.5 ఫోన్లను వాడుతున్న యూజర్లకు నెలకు 5జీబీ డేటా చొప్పున 10 నెలలకు 50 జీబీ డేటా లభిస్తుంది.

జెన్‌ఫోన్ మ్యాక్స్,

ఇక జెన్‌ఫోన్ సెల్ఫీ, జెన్‌ఫోన్ మ్యాక్స్, జెన్‌ఫోన్ లైవ్, జెన్‌ఫోన్ గో 4.5 ఎల్‌టీఈ, జెన్‌ఫోన్ గో 5.0 ఎల్‌టీఈ, జెన్‌ఫోన్ గో 5.5 ఎల్‌టీఈ ఫోన్లను వాడుతున్న వారికి నెలకు 3 జీబీ డేటా చొప్పున 10 నెలలకు 30 జీబీ డేటా ఉచితం.

మై జియో యాప్‌లో

మై జియో యాప్‌లో అనువర్తనాన్ని డౌన్లోడ్ చేసి ఈ దశలను పాటించాలి. Open MyJio App -> My Vouchers -> View voucher -> Recharge my number -> Confirm recharge -> Successful recharge notification వస్తుంది.

జియో జతకట్టిన కంపెనీల్లో

అయితే జియో జతకట్టిన కంపెనీల్లో ఆసుస్‌ మొదటి కాదు. ఇంతకుముందు షియామి, జియోనీ కంపెనీ ఫోన్లలో కూడా జియో ఉచిత డేటాను ప్రకటించింది. మరోవైపు జూన్ నెలలో రిలయన్స్ జీయో 4 జి మొబైల్ స్పీడ్ చార్టులో టాప్‌లోఉందని ట్రాయ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Asus partners Reliance Jio; to offer up to 100GB free 4G data to users read more at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot