Home
Mobile

Asus ROG గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లు ప్రత్యేక ఫీచర్లతో లాంచ్! ధర ఎక్కువే...

ఆసుస్ రోగ్ ఫోన్ 5s మరియు రోగ్ ఫోన్ 5s ప్రో గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లు నేడు భారతదేశంలో లాంచ్ చేయబడ్డాయి. ఈ రెండు గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లు టాప్-ఎండ్ స్టోరేజ్ ఫీచర్లను కలిగి ఉండడంతో పాటుగా స్నాప్‌డ్రాగన్ 888+ SoC మరియు అడ్రినో 660 GPUతో జత చేయబడి ఉంటాయి. ఆసుస్ రోగ్ ఫోన్ 5s మరియు రోగ్ ఫోన్ 5s ప్రో రెండు కూడా 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.78-అంగుళాల ఫుల్-HD+ సామ్ సంగ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండడమే కాకుండా 6,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Asus ROG ఫోన్ 5s, Asus ROG ఫోన్ 5s ప్రో ధరలు

Asus ROG ఫోన్ 5s, Asus ROG ఫోన్ 5s ప్రో ధరలు

Asus ROG ఫోన్ 5s ఇండియాలో రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. ఇందులో 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.49,999 కాగా 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 57,999. మరోవైపు Asus ROG ఫోన్ 5s ప్రో మోడల్ కేవలం ఒకే ఒక వేరియంట్లో లాంచ్ అయింది. 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.79,999. ఈ రెండు ఆసుస్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లు ఫిబ్రవరి 18 నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా మొదటిసారి విక్రయించబడనున్నాయి.

Asus ROG ఫోన్ 5s, 5s ప్రో గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ల స్పెసిఫికేషన్స్

Asus ROG ఫోన్ 5s, 5s ప్రో గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ల స్పెసిఫికేషన్స్

Asus ROG కొత్త గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ల యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇవి డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ROG UIతో ఆండ్రాయిడ్ 11ని అమలు చేస్తాయి. అలాగే ఈ రెండూ 6.78-అంగుళాల ఫుల్-HD+ (1,080x2,448 పిక్సెల్‌లు) సామ్ సంగ్ AMOLED డిస్‌ప్లేను 144Hz రిఫ్రెష్ రేట్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1ms ప్రతిస్పందన సమయం, 24ms టచ్ లేటెన్సీ, HDR10+ సపోర్ట్ మరియు గరిష్టంగా 1200 వరకు బ్రైట్‌నెస్ ఫీచర్లను కలిగి ఉంటాయి. రెండు గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌తో 2.5D కర్వ్డ్ గ్లాస్‌ను పొందుతాయి. డిస్ప్లే విధులు Pixelworks i6 ప్రాసెసర్ ద్వారా నిర్వహించబడతాయి. ROG ఫోన్ 5s ప్రో వెనుక ప్యానెల్‌లో ROG విజన్‌తో కూడిన చిన్న PMOLED డిస్‌ప్లేను కూడా కలిగి ఉంది. ఆసుస్ రోగ్ ఫోన్ 5s మరియు రోగ్ ఫోన్ 5s ప్రో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 888+ SoC ద్వారా మరియు Adreno 660 GPUతో జత చేయబడి ఉంటుంది. మొదటిది 12GB వరకు LPDDR5 RAM మరియు 256GB వరకు UFS 3.1 స్టోరేజ్‌తో జత చేయబడి ఉండగా ప్రో మోడల్ 18GB LPDDR5 RAM మరియు 512GB UFS 3.1 స్టోరేజ్‌ను కలిగి ఉంది.

కెమెరా సెటప్‌

ఆసుస్ రోగ్ ఫోన్ 5s మరియు ROG ఫోన్ 5s ప్రో రెండూ కూడా ఫోటోలు మరియు వీడియోల కోసం వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లను కలిగి ఉన్నాయి. ఇందులో f/1.8 ఎపర్చరుతో 64-మెగాపిక్సెల్ సోనీ IMX686 ప్రైమరీ సెన్సార్, f/2.4 ఎపర్చర్‌తో 13-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్ మరియు f/2.0 ఎపర్చర్‌తో 5-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్‌ కెమెరాలు ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం ముందు భాగంలో f/2.45 ఎపర్చరుతో 24-మెగాపిక్సెల్ సెన్సార్‌ని కలిగి ఉన్నాయి. అలాగే ఇది డ్యూయల్ ఫ్రంట్ స్టీరియో స్పీకర్లతో పాటు 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ను కూడా కలిగి ఉన్నాయి.

కనెక్టివిటీ

Asus ROG ఫోన్ 5s మరియు ROG ఫోన్ 5s ప్రోలో కనెక్టివిటీ ఎంపికలు 5G, 4G LTE, Wi-Fi 6 విత్ 802.11 a/b/g/n/ac/ax, Wi-Fi డైరెక్ట్, బ్లూటూత్ v5.2, NFC మరియు a USB టైప్-సి పోర్ట్. ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో GNSS GPS, గ్లోనాస్, గెలీలియో, బీడౌ, QZSS, NaviC, యాక్సిలెరోమీటర్, ఇ-కంపాస్, సామీప్య సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, అండర్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, గైరోస్కోప్ మరియు ఎయిర్‌ట్రిగ్గర్ 5 మరియు గ్రిప్ ప్రెస్ కోసం అల్ట్రాసోనిక్ సెన్సార్లు ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Asus ROG Phone 5s, 5s Pro Gaming Smartphones Launched in India With Snapdragon 888+ SoC: Price, Specs, Sale Date, Sale Offers and More.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X