24GB ర్యామ్, 1 TB స్టోరేజీతో కొత్త స్మార్ట్‌ఫోన్లు.. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, సేల్ వివరాలు..!
అసూస్ నుంచి కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి. CES (కంజ్యుమర్ ఎలక్ట్రానిక్ షో) వేదికగా Asus ROG Phone 8 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు విడుదల అయ్యాయి. ఈ సిరిస్‌లో రోగ్ ఫోన్ 8 మరియు రోగ్ ఫోన్ 8 ప్రో, ప్రో ఎడిషన్ స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. కటింగ్ ఎడ్జ్ 5G మోడల్ పంచ్ హోల్ డిజైన్‌తో అందుబాటులోకి వచ్చాయి.
అసూస్ రోగ్ ఫోన్ 8 స్పెసిఫికేషన్లు : ఈ ఫోన్‌ను గేమింగ్ సహా మెరుగై పనితీరును దృష్టిలో పెట్టుకొని లాంచ్ చేశారు. పాత మోడల్ ఫోన్లతో పోలిస్తే స్లిమ్ డిజైన్ సహా 15 శాతం తక్కువ మందం (Thickness)తో వస్తుంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ స్నా్ప్ డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది 24GB LPDDR5X ర్యామ్, 1TB UFS 4.0 స్టోరేజీతో వస్తుంది.

గేమింగ్ సమయంలో ఉత్పత్తి అయ్యే వేడిని తగ్గించేందుకు ప్రత్యేక టెక్నాలజీతో వస్తుంది. రాపిడ్ కూలింగ్ కండక్టర్ డిజైన్ సహా ఎయిరో యాక్టివ్ కూలర్ Xla వస్తుంది. మరియు ఈ ఫోన్లు 65W హైపర్ ఛార్జ్ మరియు 15W Qi సర్టిఫైడ్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీ సపోర్టుతో వస్తుంది. నీరు, డస్ట్ర రెసిస్టెన్స్ నుంచి IP68 రేటింగ్ రక్షణ కలిగి ఉంటుంది.
అసూస్ ఫోన్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.78 ఫ్లెక్సిబుల్ అయోలెడ్ డిస్‌ప్లే మరియు అడాప్టివ్ రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. మరియు 2500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ ఫోన్ మెరుగైన డిస్‌ప్లే అనుభూతిని కలిగిస్తుంది. మరియు సూపీరియర్ కలర్ కాంబినేషన్‌తో వస్తుంది. అసూస్ రోగ్ ఫోన్ 8 ఆండ్రాయిడ్ 14 ఆధారిత ROG UI పైన పనిచేస్తుంది.

అసూస్ కొత్త ఫోన్లు వెనుకవైపు మూడు కెమెరాలను అమర్చారు. 50MP సోనీ కెమెరా, 3x టెలీఫోటో లెన్స్, 13MP అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంటుంది. అదే విధంగా సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరా విభాగం OZO ఆడియో టెక్నాలజీ మరియు 6 యాక్సెస్ హైబ్రిడ్ గింబల్ స్టెబిలైజర్ 3.0ను కలిగి ఉంటుంది. ఇవి ఫొటోగ్రఫీ, వీడియోల నాణ్యతను మెరుగుపరుస్తాయి.
అసూస్ రోగ్ ఫోన్ 8 సిరీస్ ఫోన్ల పనితీరును మెరుగుపరిచేందుకు కొన్ని ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో బ్యాగ్రౌండ్ మోడ్, X క్యాప్చర్, X సెన్స్, AI గ్రాబర్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సీమాంటిక్ సెర్చ్, AI వాల్‌పేపర్, వాయిస్, వీడియో కాల్స్, గేమ్ కమ్యూనికేషన్ కోసం AI నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీని కలిగి ఉంటుంది.
అసూస్ రోగ్ ఫోన్ 8 సరికొత్త AniMe Vision, అరా RGB లైటింగ్ ఫీచర్‌ను కలిగి ఉంది. అదే ప్రో, ప్రో ఎడిషన్ మోడల్ స్మార్ట్‌ఫోన్ AniMe Vision మిని LED డిస్‌ప్లే ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫీచర్లు యూజర్ క్రియేటెడ్ యానిమేషన్‌లో ఉపయోగపడతాయి. గేమింగ్ కోసం ఎయిర్ ట్రిగ్గర్ అల్ట్రాసోనిక్ కంట్రోల్‌లను కలిగి ఉంటుంది. ఇవి అనేక గేస్చర్‌లతోపాటు 10 మోషన్ కంట్రోల్‌లను సపోర్టు చేస్తాయి.
అసూస్ రోగ్ ఫోన్ 8 స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్, 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లో లభిస్తుంది. అయితే భారత్‌లో ఈ వేరియంట్ ధరను ఇంకా వెల్లడించలేదు. ప్రో మోడల్ 16GB ర్యామ్+ 512GB అంతర్గత స్టోరేజీ, ప్రో ఎడిషన్ 24GB ర్యామ్+ 1TB స్టోరేజీ వేరియంట్‌లో లభిస్తుంది. 16GB ర్యామ్ వేరియంట్ ధర రూ.94999గా ఉంది. 24GB ర్యామ్ వేరియంట్ ధర రూ.1,19,999 గా ఉంది.
అయితే ఈ అసూస్ రోగ్ ఫోన్ 8.. సేల్ వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. సేల్ తేదీ అందుబాటులోకి వస్తే విజయ్ సేల్స్ స్టోర్, అసూస్ e-షాప్, అసూస్ ఎక్లూజివ్ స్టోర్ మరియు రోగ్ స్టోర్‌లో కొనుగోలు చేయవచ్చు. ప్రో, ప్రో ఎడిషన్ ఫాంటమ్ బ్లాక్ రంగులో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అదే రోగ్ ఫోన్ 8 రెబల్ గ్రే, ఫాంటమ్ బ్లాక్ రంగుల్లో లభించనుంది.


Click it and Unblock the Notifications








