టూ ఇన్ వన్ ఆఫర్ స్మార్ట్‌ఫోన్ కమ్ టాబ్లెట్..!!

Posted By: Staff

టూ ఇన్ వన్ ఆఫర్ స్మార్ట్‌ఫోన్ కమ్ టాబ్లెట్..!!

 

డిజిటల్ ప్రపంచానికి విశిష్ట సేవలందిస్తున్న ‘అసస్’(Asus) ఉత్తమ లక్షణాలతో కూడిన ఆధునిక టెక్నాలజీ పరికరాలను వ్ళద్థి చేస్తుంది. తాజాగా ఈ బ్రాండ్ వినూత్నతరహాలో స్మార్ట్ ఫోన్ కమ్ టాబ్లెట్ పీసీని రూపొందించింది. ‘అసస్ ప్యాడ్ ఫోన్’ నమూనాలో వస్తున్న ఈ డివైజ్‌ను కంప్యూటింగ్ అదే విధంగా మొబైల్ అవసరాలకు వినియోగించుకోవచ్చు. ఈ అద్భుత స్ళష్టికి రూపురేఖలందించిన అసస్ టెక్ ప్రపంచానికి తన కొత్తదనాన్నిరుచిచూపించింది.

రెండు విడి పరికరాలుగా ఈ డివైజ్‌లను రూపొందించారు. ఒకటి టాబ్లెట్ పీసీ, మరొకటి స్మార్ట్ ఫోన్. ఈ మల్టీ డిజైనింగ్ గ్యాడ్జెట్ ద్వారా కంప్యూటింగ్ లావాదేవీలను పూర్తి స్థాయిలో నిర్వహించుకోవచ్చు. కంప్యూటర్‌లా ఉపయోగించుకోవాలనుకునేవారు స్మార్ట్ ఫోన్‌ను టాబ్లెట్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన నిర్థారిత స్థానంలో అమర్చాల్సి ఉంటుంది. ఆ అవసరం లేని వారు టాబ్లెట్ నుంచి ఫోన్‌ను వేరు చేసుకుని ఫోన్ కాల్స్ నిర్వహించుకోవచ్చు. టాబ్లెట్ 10.1 అంగుళాల డిస్ ప్లే సామర్ధ్యాన్ని కలిగి ఉండగా,

స్మార్ట్‌ఫోన్ 4.3 అంగుళాలు స్ర్కీన్ పరిమాణాన్ని కలిగి టచ్ ఆధారితంగా పని చేస్తాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot