ఊరిస్తోన్న Asus కొత్త ఫోన్‌లు

సుధీర్ఘమైన బ్యాటరీ బ్యాకప్‌ను ఆఫర్ చేసే రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను Asus ఇండియా బుధవారం మార్కెట్లో లాంచ్ చేసింది. Zenfone 3 Max పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్ రెండు వేరింయట్‌లలో అందుబాటులో ఉంటుంది. ఫోన్ ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే..

Read More : బెస్ట్ బ్యాటరీ, టాప్ క్వాలిటీ 4జీతో 10 స్మార్ట్‌ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పూర్తి మెటల్ బాడీతో..

ఆసుస్ జెన్‌ఫోన్ 3 మాక్స్ పూర్తి మెటల్ బాడీతో వస్తుంది. రెండు సైజుల్లో అందుబాటులో ఉంటుంది. ZC520TL వేరియంట్ 5.2 అంగుళాల డిస్‌ప్లేతో, ZC553KL వేరియంట్ 5.5 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఈ రెండు వేరిరయంట్స్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిజైన్‌ను కలిగి ఉంటాయి.

2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌

5.2 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లో లభ్యమయ్యే జెన్‌ఫోన్ 3 మాక్స్‌ఫోన్ MediaTek MT6737M chipsetను కలిగి 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌

5.5 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లో లభ్యమయ్యే జెన్‌ఫోన్ 3 మాక్స్ ఫోన్ 1.4GHz octa-core Qualcomm Snapdragon 430 SoCను కలిగి 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఈ రెండు ఫోన్‌లలోని స్టోరేజ్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం ఉంటుంది.

ZenUI 3.0

సాఫ్‌వేర్ విషయానికి వచ్చేసరికి ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన ZenUI 3.0 పై రన్ అవుతాయి. డ్యుయల్ సిమ్ సపోర్ట్‌తో వస్తోన్న ఈ రెండు ఫోన్‌లలో ఫింగర్ ప్రింట్ స్కానర్ అందుబాటులో ఉంటుంది.

16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా

కెమెరా విషయానికి వచ్చేసరికి 5.5 అంగుళాల వేరియంట్‌లో లభ్యమయ్యే ఆసుస్ జెన్‌ఫోన్ 3 మాక్స్ ఫోన్ 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, f/2.2 aperture, 84 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్ వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలో పొందుపరిచారు.

క్వాలిటీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా..

5.2 అంగుళాల వేరియంట్ లో లభ్యమయ్యే ఆసుస్ జెన్‌ఫోన్ 3 మాక్స్ ఫోన్‌లో 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా షూటర్‌ ను ఏర్పాటు చేసారు.

4జీ వోల్ట్ సపోర్ట్‌

4జీ వోల్ట్ సపోర్ట్‌తో వస్తోన్న ఈ రెండు ఫోన్‌లు రిలయన్స్ జియో నెట్‌వర్క్‌తో పాటు
వెల్‌కమ్ ఆఫ‌ర్‌ను సపోర్ట్ చేస్తాయి.

బ్యాటరీ ఇంకా ధర

బ్యాటరీ విషాయానికి వచ్చేసరికి ఈ రెండు ఫోన్‌లలో శక్తివంతమైన 4,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేయటం జరిగింది. మార్కెట్లో జెన్‌ఫోన్ 3 మాక్స్ ZC520TL వేరియంట్ ధర రూ.12,999 కాగా, ZC553KL వేరియంట్ ధర రూ.17,999గా ఉంటుంది.

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Asus Zenfone 3 Max With Support for Reliance Jio Launched in India: 7 Alluring Features to Know. Read More in Telugu Gizbot.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot