ఈ ఫోన్‌పై మళ్లీ రూ. 2 వేలు తగ్గింపు , మొత్తంగా రూ. 5 వేలు..
ఆసుస్ తన జెన్‌ఫోన్ 3 మ్యాక్స్(ZC553KL) ధర మళ్లీ తగ్గించింది. గతంలో రూ. 3 వేలు తగ్గిన ఈ ఫోన్ మళ్లీ కొద్ది రోజులకే రూ. 2వేల డిస్కౌంట్ తో వినియోగదారులకు లభిస్తోంది.
ఆసుస్ తన జెన్‌ఫోన్ 3 మ్యాక్స్(ZC553KL) ధర మళ్లీ తగ్గించింది. గతంలో రూ. 3 వేలు తగ్గిన ఈ ఫోన్ మళ్లీ కొద్ది రోజులకే రూ. 2వేల డిస్కౌంట్ తో వినియోగదారులకు లభిస్తోంది.అసుస్ కంపెనీ భారత్‌లో ఈ ఫోన్‌ను రూ.12,999కే అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ కొత్త ధర ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ అన్ని కొనుగోళ్లకు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపింది.

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్
ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్‌తో పాటు రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ లభ్యమవుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ సొంత ఎక్స్‌క్లూజివ్ స్టోర్లలో ఇది విక్రయానికి ఉంది.

లాంచింగ్ సందర్భంగా..
లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్ ధర రూ.17,999. తర్వాత 3వేల రూపాయల మేర ధర తగ్గించి, ఈ ఫోన్‌ను రూ.14,999కే అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇప్పుడు రూ.12,999కే
ప్రస్తుతం మరోసారి రెండు వేల రూపాయల మేర ధర తగ్గించింది. ఇప్పుడు రూ.12,999కే అందుబాటులో ఉంది.

జెన్‌ఫోన్ 3 మ్యాక్స్(ZC553KL) ఫీచర్లు
5.5 అంగుళాల ఫుల్-హెచ్‌డీ డిస్‌ప్లే
1.4గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 430 ఎస్‌ఓసీ
3జీబీ ర్యామ్, 32జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్
128జీబీ వరకు విస్తరణ మెమరీ
16 ఎంపీ రియర్ కెమెరా
8 ఎంపీ ఫ్రంట్ కెమెరా
4100 ఎంఏహెచ్ బ్యాటరీ
హైబ్రిడ్ డ్యూయల్ సిమ్(మైక్రో+నానో) సపోర్టు
వెనుక వైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్


Click it and Unblock the Notifications