మార్కెట్లోకి Asus కొత్త సిరీస్ ఫోన్‌లు

తైవాన్ బ్రాండ్ Asus మూడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో అనౌన్స్ చేసింది. Zenfone 4 Selfie సిరీస్ క్రింద ఈ ఫోన్‌లు లభ్యమవుతాయి. జెన్‌ఫోన్ 4 సెల్ఫీ ప్రో (ధర రూ.23,999), జెన్‌ఫోన్ 4 సెల్ఫీ విత్ సింగిల్ ఫ్రంట్ కెమెరా (ధర రూ.9,999), జెన్‌ఫోన్ 4 సెల్ఫీ విత్ డ్యుయల్ ఫ్రంట్ కెమెరా (ధర రూ.14,999) పేర్లతో ఈ ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి. సెప్టంబర్ 21 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ స్టార్ట్ అవుతుంది.

Read More : సెప్టంబర్ 22 నుంచి ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ ప్రీ-ఆర్డర్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డ్యుయల్ ఫ్రంట్ కెమెరా సపోర్ట్...

ZD553KL మోడల్ నెంబర్‌తో లభ్యమయ్యే జెన్‌ఫోన్ 4 సెల్ఫీ ప్రో అలానే జెన్‌ఫోన్ 4 సెల్ఫీ స్మార్ట్‌ఫోన్‌లు డ్యుయల్ ఫ్రంట్ కెమెరాలను కలిగి ఉంటాయి. ZB553KL మోడల్ నెంబర్‌తో లభ్యమయ్యే జెన్‌ఫోన్ 4 సెల్ఫీ స్మార్ట్‌ఫోన్‌ కేవలం ఒక ఫ్రంట్ కెమెరాను మాత్రమే కలిగి ఉంటుంది.

జెన్‌ఫోన్ 4 సెల్ఫీ ప్రో వేరియంట్ స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.0 విత్ జెన్‌యూజర్ ఇంటర్‌ఫేస్ 4.0, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ విత్ అడ్రినో 506 జీపీయూ, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 2TB వరకు విస్తరించుకునే అవకాశం, 24 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 3000mAh బ్యాటరీ, 4జీ వోల్ట్ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, గ్లోనాస్, బీడీఎస్ఎస్, మైక్రో యూఎస్బీ, డ్యుయల్ సిమ్ స్లాట్.

జెన్‌ఫోన్ 4 సెల్ఫీ విత్ డ్యుయల్ ఫ్రంట్ కెమెరా వేరియంట్ స్సెసిఫికేషన్స్..

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.0 విత్ జెన్‌యూజర్ ఇంటర్‌ఫేస్ 4.0, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్ విత్ అడ్రినో 505 జీపీయూ, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 2TB వరకు విస్తరించుకునే అవకాశం, 20 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 3000mAh బ్యాటరీ, 4జీ వోల్ట్ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, గ్లోనాస్, బీడీఎస్ఎస్, మైక్రో యూఎస్బీ, డ్యుయల్ సిమ్ స్లాట్.

జెన్‌ఫోన్ 4 సెల్ఫీ విత్ సింగల్ ఫ్రంట్ కెమెరా వేరియంట్ స్సెసిఫికేషన్స్..

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.0 విత్ జెన్‌యూజర్ ఇంటర్‌ఫేస్ 4.0, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్ విత్ అడ్రినో 505 జీపీయూ, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 2TB వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000mAh బ్యాటరీ, 4జీ వోల్ట్ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, గ్లోనాస్, బీడీఎస్ఎస్, మైక్రో యూఎస్బీ, డ్యుయల్ సిమ్ స్లాట్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Asus Zenfone 4 Selfie series launched in India, price starts at Rs 9,999. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot