ఆసుస్ నుంచి 6కొత్త స్మార్ట్ ఫోన్లు..!

అధికారికంగా ప్రకటించిన తైవానీస్ కంపెనీ

By Madhavi Lagishetty
|

ఎన్నోరూమర్లు...అంచనాల తర్వాత తైవానీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఆసుస్ చివరకు స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది. జెన్ ఫోన్ 4 సిరీస్ స్మార్ట్ ఫోన్లను కంపెనీ ఆవిష్కరించింది.

 
Asus ZenFone 4 series smartphones officially announced: Six new devices

కంపెనీ నుంచి నాలుగు కొత్త శ్రేణి స్మార్ట్ ఫోన్లు రిలీజ్ అయ్యాయి. అయితే కంపెనీ పలు రకాల హ్యాండ్ సెట్లను వినియోగదారులకు విస్తారంగా అందిస్తోంది. ప్రధానంగా కంపెనీ ఆరు వేర్వేరు స్మార్ట్ ఫోన్లను ప్రకటించింది. జెన్ ఫోన్ 4, జెన్ ఫోన్ 4 ప్రో, జెన్ ఫోన్ 4 సెల్ఫీ, జెన్ ఫోన్ 4 సెల్ఫీ ప్రో, జెన్ ఫోన్ 4 మాక్స్, జెన్ ఫోన్ 4 మాక్స్ ప్రో.

కొత్త జెన్ ఫోన్ సిరీస్ ప్రధానంగా డ్యుయల్ కెమెరాలు అమర్చారు. ఏ సందర్భంలో అయినా కొత్త స్మార్ట్ ఫోన్ల కీ ఫీచర్లు మరియు స్పెక్స్ ల్లో కొన్నింటిని చూద్దాం.

ఆసుస్ జెన్ ఫోన్ 4...

ఆసుస్ జెన్ ఫోన్ 4...

ఆసుస్ జెన్ ఫోన్ 4 స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే...5.5 అంగుళాల పూర్తి హెచ్ డి ఐపిఎస్ డిస్ ప్లే ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 660 చిప్పెట్స్ తో 6జిబి ర్యామ్ మరియు 64జిబి స్టోరెజీతో ఉంటుంది. డివైస్ 3300ఎంఏహెచ్ బ్యాటరీ మద్దతు ఇస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 7.1.1నూగట్ తో ఆధారంగా జెన్ యుఐ 4.0పై నడుస్తుంది. కెమెరాల కొరకు స్మార్ట్ ఫోన్ 12మెగాపిక్సెల్ 8మెగాపిక్సెల్ తో సెకండరీ సెన్సార్ 120డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్ ఉంది. ముందు భాగంలో 8మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

జెన్ ఫోన్ 4 ప్రో...

జెన్ ఫోన్ 4 ప్రో...

జెన్ ఫోన్ 4 ప్రో స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే....అత్యంత ప్రీమియం హ్యాండ్ సెట్ తోపాటు 5.5అంగుళాల పూర్తి హెచ్ డి ఆల్మోడ్ డిస్ ప్లే తో వస్తుంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 835చిప్పెట్స్ తో పాట్ స్మార్ట్ ఫోన్ 6జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరెజీతో జతచేయబడింది. కెమెరాల కొరకు స్మార్ట్ ఫోన్ 12మెగాపిక్సెల్ 16మెగాపిక్సెల్ తో సెకండరీ సెన్సర్ 2జూమ్ కొరకు ఉపయోగించబడుతుంది. ముందుకు ఒక 8మెగా పిక్సెల్ ఉంది. డివైస్ 3600ఎంఏహెచ్ బ్యాటరీ మద్దతు ఇస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 7.1.1 నూగట్ ఆధారంగా జెన్ యుఐ 4.0పై నడుస్తుంది.

ఆసుస్ జెన్ ఫోన్ 4 సెల్ఫీ....
 

ఆసుస్ జెన్ ఫోన్ 4 సెల్ఫీ....

ఇది 5.5అంగుళాల హెచ్ డిఐపిఎస్ డిస్ ప్లే తో వస్తుంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 4300చిప్పెట్స్ తో పాటు 4జిబి ర్యామ్ మరియు 64జిబి స్టోరెజీతో మరింత స్మార్ట్ గా ఉంటుంది. డివైస్ 3000ఎంఏహెచ్ బ్యాటరీతో మద్దతు ఇస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 7.1.1నూగట్ ఆధారంగా జెన్ యుఐ 4.0పై నడుస్తుంది. కెమెరాల కోసం స్మార్ట్ ఫోన్ వెనక ఒక 16మెగాపిక్సెల్ కెమెరా కలిగి ఉంటుంది. ముందు 20మెగాపిక్సెల్ ,8మెగాపిక్సెల్ కెమెరా సెకండరీ సెన్సార్ వైడ్ యాంగిల్ లెన్స్ గా పనిచేస్తుంది.

ఈ మౌసే ఒక స్కానర్..ఈ మౌసే ఒక స్కానర్..

ఆసుస్ జెన్ ఫోన్ 4 సెల్ఫీ ప్రో...

ఆసుస్ జెన్ ఫోన్ 4 సెల్ఫీ ప్రో...

5.5 అంగుళాల పూర్తి హెచ్ డి ఆల్మోడ్ డిస్ ప్లేతో వస్తుంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 625 చిప్పెట్స్ తో పాట్ స్మార్ట్ ఫోన్ 4జిబి,6జిబి ర్యామ్ మరియు 64జిబి స్టోరెజి తో జతచేయవచ్చు. డివైస్ 3000ఎంఏహెచ్ బ్యాటరీతో నడుస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 7.1.1నూగట్ ఆధారంగా పనిచేస్తుంది. కెమెరా కొరకు స్మార్ట్ ఫోన్ వెనక ఒక 16మెగాపిక్సెల్ కెమెరా కలిగి ఉంటుంది. ముందు 24మెగాపిక్సెల్ ,5మెగాపిక్సెల్ కెమెరా సెకండరీ సెన్సార్ వైడ్ యాంగిల్ లెన్స్ గా పనిచేస్తుంది.

ఆసుస్ జెన్ ఫోన్ 4 మాక్స్....

ఆసుస్ జెన్ ఫోన్ 4 మాక్స్....

5.5అంగుళాల హెచ్ డి ఐపిఎస్ డిస్ ప్లే వస్తుంది. స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 425లేదా 430చిప్పెట్స్ తో శక్తి ని కలిగి ఉంది. ఈ మోడల్ 3వేరియంట్స్ తో వస్తాయి. 2జిబి, 3జిబి లేదా 4జిబి ర్యామ్ ఉంటాయి. హ్యాండ్ సెట్ 64జిబి ఇంటర్నల్ స్టోరెజీని అందిస్తోంది. డివైస్ 5000ఎంఏహెచ్ బ్యాటరీతో నడుస్తుంది. ఆండ్రాయిడ్ నూగట్ 7.1.1ఆధారంగా పనిచేస్తుంది. కెమెరాల కొరకు స్మార్ట్ ఫోన్ 13మెగాపిక్సెల్ ,5మెగాపిక్సెల్ లో సెకండరీ సెన్సర్ వైడ్ యాంగిల్ లెన్స్ గా పనిచేస్తుంది. ఇక ఫోన్ ముందు భాగంలో ఒక 8మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

ఆసుస్ జెన్ ఫోన్ 4 మాక్స్ ప్రో....

ఆసుస్ జెన్ ఫోన్ 4 మాక్స్ ప్రో....

జెన్ ఫోన్ 4 మాక్స్ ప్రో కూడా మాక్స్ మోడల్ వంటి ఫీచర్స్ మరియు స్పెక్స్ కలిగి ఉంటుంది. స్మార్ట్ ఫోన్ 5.5అంగుళాల హెచ్ డి ఐపిఎస్ డిస్ ప్లేతో వస్తుంది. స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగోన్ 425లేదా 430 చిప్పెట్స్ తో శక్తిని కలిగి ఉంది. ఈ మోడల్ 2జిబి మరియు 3జిబి ర్యామ్ కలిగి ఉంటుంది.

ఇది రెండు మెమరీ రకాల్లో వస్తుంది. హ్యాండ్ సెట్ 32జిబి అంతర్గత స్టోరెజీ అందిస్తోంది. డివైస్ 5000ఎంఏహెచ్ బ్యాటరీతో నడుస్తుంది. ఆండ్రాయిడ్ నూగట్ 7.1.1 ఆధారంగా జెన్ యుఐ పై నడుస్తుంది. కెమెరాల కొరకు స్మార్ట్ ఫోన్ ఒక 16మెగాపిక్సెల్ ,5మెగాపిక్సెల్ కలిగి ఉంటంది. సెకండరీ సెన్సర్ వైడ్ యాంగిల్ లెన్స్ వలె పనిచేస్తుంది. ముందు 16మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది.

ధర మరియు లభ్యత....

ధర మరియు లభ్యత....

ఆసుస్ కూడా నాలుగు డివైస్ ధరలను ప్రకటించింది. అదేవిధంగా జెన్ ఫోన్ 4 399డాలర్లు( సుమారుగా రూ.25,575) వద్ద ప్రారంభం అవుతుంది. అయితే దాని ప్రో వేరియంట్ 599డాలర్లు(సుమారు రూ. 38,395)వద్ద రిటైల్ అవుతుంది. సెల్ఫీ మరియు సెల్ఫీ ప్రో నమూనాలు వరుసగా 279డాలర్లు (సుమారు రూ.17,883) 379డాలర్లు(సుమారు రూ.24,293) ధర ప్రారంభం అవుతుంది.

సంస్థ మాక్స్ నమూనాల ధరను అలాగే స్మార్ట్ ఫోన్ల విడుదల తేదీలను బహిర్గతం చేయలేదు. ఏది ఏమైనప్పటికీ సంస్థ ప్రకారం స్మార్ట్ ఫోన్స్ మొదట ఆసియాలో మొదలవుతాయి. తర్వాత ఈ స్మార్ట్ ఫోన్లు కొంతకాలం తర్వాత వెస్ట్రన్ లో రిలీజ్ అవుతాయి.

Best Mobiles in India

Read more about:
English summary
Asus has finally pulled the wraps off its ZenFone 4 series smartphones and it includes six new smartphones.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X