Just In
- 6 hrs ago
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- 8 hrs ago
వివో X90 ప్రో స్మార్ట్ ఫోన్లు ఇండియాలో లాంచ్ అయింది! ధర ,స్పెసిఫికేషన్లు!
- 13 hrs ago
కొత్త ఆండ్రాయిడ్ అప్డేట్ తో మీ ఫోన్ ను వెబ్ కెమెరా లాగా వాడొచ్చు
- 1 day ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
Don't Miss
- News
SI: పోలీసు జీపులో ఎస్ఐ చెవ్వు కొరికోసి తినేయాలని ప్రయత్నించాడు. ఏం జరిగిందంటే ?
- Movies
Writer Padmabhushan Day 2 collections రెండో రోజు పెరిగిన కలెక్షన్లు.. సుహాస్ మూవీకి భారీ రెస్పాన్స్
- Sports
ఏమబ్బా అశ్విన్.. ఆట మొదలవ్వకముందే భయపెడుతున్నావ్ కదా: వసీం జాఫర్
- Finance
adani issue: అదానీ వ్యవహారంపై స్పందించిన కేంద్ర మంత్రి.. హెచ్చుతగ్గులు సాధారణమేనంటూ వ్యాఖ్యలు
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Asus నుంచి మరో ఫ్లాగ్‌షిప్ ఫోన్.. విడుదల తేదీ కోసం ఓ లుక్కేయండి!
ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ Asus తమ కంపెనీ నుంచి త్వరలో మరో కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ను గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేయనుంది. Asus Zenfone 9 జులై 28 వ తేదీన ఈ ఫ్లాగ్‌షిప్ మొబైల్ విడుదల కానుంది. గ్లోబల్‌గా పలు ఎంపిక చేసిన మార్కెట్లలో ఈ మొబైల్ విడుదల కానుంది. ఈ మేరకు కంపెనీ తమ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. కాగా, ఈ మొబైల్‌కు సంబంధించి ఇదు వరకే ఆన్‌లైన్‌లో ఓ ప్రమోషనల్ వీడియో ద్వారా స్పెసిఫికేషన్లు, ఫీచర్లు లీకయ్యాయి. లీకైన వివరాల ప్రకారం ఈ ఫోన్ Qualcomm Snapdragon 8+ Gen 1 SoC ప్రాసెసర్ సహా మరిన్ని ఆసక్తికర ఫీచర్లతో వస్తోంది.

Asus Zenfone 9 లీక్‌డ్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:
ఈ మొబైల్ కు 5.9 అంగుళాల full-HD + AMOLED డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఇది 120Hz రిఫ్రెష్ రేటుతో పని చేస్తుంది. Qualcomm Snapdragon 8+ Gen 1 SoC ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఇది హోల్ పంచ్ డిస్‌ప్లే తో వస్తోంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పనిచేస్తుంది. ఈ మొబైల్ డ్యుయల్ కెమెరా సెటప్ మరియు ఎల్ఈడీ ఫ్లాష్ కలిగి ఉంది. ఈ ఫోన్‌కు 50 మెగా పిక్సెల్ క్వాలిటీ గల ప్రధాన కెమెరా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇది IP68 రేటింగ్ కలిగిన వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇక ఛార్జ్ విషయానికొస్తే 4,3000mAh సామర్థ్యం గల బ్యాటరీని అందిస్తున్నారు. ఇది 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.

భారత మార్కెట్లో దీని ధర ఎంత ఉండొచ్చు:
భారత్‌లో మార్కెట్లో ఈ Asus Zenfone 9 గ్లోబల్‌గా విడుదలైన వెంటనే త్వరలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ ధర భారత్ మార్కెట్లో ROG Phone 6 మోడల్ కన్నా తక్కువగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. విశ్లేషకుల అంచనా ప్రకారం భారత మార్కెట్లో Asus Zenfone 9 (8జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజీ) వేరియంట్ ధర దాదాపు రూ.60,000 వరకు ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే విడుదలైన Asus ROG Phone 6, ROG Phone 6 ప్రో ల ప్రత్యేకతలు:
ROG ఫోన్ 6 మరియు ROG ఫోన్ 6 ప్రోలు ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoC తో వస్తుంది. ఇవి TSMC యొక్క 4nm ప్రాసెసర్‌ని ఉపయోగించి రూపొందించబడ్డాయి. Snapdragon 8 Gen 1తో పోల్చినప్పుడు, Adreno 730 GPUతో పాటుగా 3.2GHz గరిష్ట CPU క్లాక్ స్పీడ్‌తో 8+ Gen 1 ప్రాసెసర్ మరింత శక్తి-సమర్థవంతమైనదిగా చెప్పబడింది.ROG ఫోన్ 6 మరియు ROG ఫోన్ 6 ప్రో లో 6.78-అంగుళాల డిస్‌ప్లే 165Hz రిఫ్రెష్ రేట్‌తో 2448x1080p యొక్క స్థానిక రిజల్యూషన్‌ను మరియు కార్నింగ్ గొరిల్లా విక్టస్ రక్షణతో 1ms ప్రతిస్పందన సమయాన్ని అందిస్తుంది. ఈ ఫోన్‌లు సిరస్ లాజిక్ యాంప్లిఫైయర్‌లతో డ్యూయల్ స్టీరియో స్పీకర్ సెటప్‌ను కలిగి ఉన్నాయి మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉంది.

RAM మరియు స్టోరేజ్ వివరాల ప్రకారం, ROG ఫోన్ 6 , 8/12GB RAM మరియు 128/256GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందిస్తుంది, అయితే ROG ఫోన్ 6 ప్రో 18GB RAM మరియు 512GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందిస్తుంది. ఈ రెండు వేరియంట్‌లు స్టోరేజీ ను పెంచుకోవడానికి మద్దతు ఇవ్వనప్పటికీ, రెండు పరికరాలు 5G నెట్‌వర్క్‌కు మద్దతుతో డ్యూయల్ నానో-సిమ్ కార్డ్ స్లాట్‌లను అందిస్తాయి. ROG ఫోన్ 6 మరియు ROG ఫోన్ 6 ప్రో వెనుక ఉన్న ట్రిపుల్ కెమెరా సెటప్‌లో 50MP ప్రైమరీ సెన్సార్, 13MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ మరియు 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. 1080p వీడియో రికార్డింగ్‌కు మద్దతుతో ముందు భాగంలో 12MP సెల్ఫీ కెమెరా కూడా వస్తుంది.
భారత్‌లో Asus ROG Phone 6, ROG Phone 6 ప్రో ధరలు:
18GB RAM మరియు 512GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో Asus ROG ఫోన్ 6 ప్రో ధర భారతదేశంలో రూ.88,999. అదేవిధంగా, ROG ఫోన్ 6 ఫోన్ 12GB RAM మరియు 256GB అంతర్గత నిల్వతో వచ్చే ఫోన్ ధర రూ. 71,999, ఇది ప్రారంభ ధర రూ.49,999 తో వచ్చిన ROG ఫోన్ 5s కంటే కొంచెం ఖరీదైనది గా లాంచ్ చేయబడింది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470