8జిబి ర్యామ్‌తో అసుస్ ఏఆర్‌ లాంచ్, దీనిపై ఆఫర్లే ఆఫర్లు..

Written By:

గూగుల్‌ డేడ్రీమ్‌, ట్యాంగో సపోర్టుతో ప్రపంచంలోనే తొలి స్మార్ట్‌ఫోన్‌ ఆసుస్‌ జెన్‌ఫోన్‌ ఏఆర్‌ మార్కెట్లోకి లాంచ్‌ అయింది. ఇంతవరకూ ఏ ఫోన్ అటువంటి ఫీచర్లతో రాలేదు. భారత రాజధాని న్యూఢిల్లీలో జరిగిన ఈవెంట్ లో ఈ ఫోన్‌ను కంపెనీ లాంచ్‌ చేసింది. లాంచ్ చేసి రోజునే దీన్ని అదిరే ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్‌లో ప్రవేశపెట్టారు. బ్లాక్ కలర్ వేరియంట్ లో నిన్న సాయంత్రం 4 గంటల నుంచే ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి వచ్చింది. ఫీచర్ల విషయానికొస్తే..

45 జిబి 4జీ డేటాతో ఓపెన్ సేల్‌లో హానర్ 8 ప్రొ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే

5.70 అంగుళాల క్యూహెచ్‌డీ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, కార్నింగ్‌ గొర్రిల్లా గ్లాస్‌ 4 ప్రొటెక్షన్‌, క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 821 ఎస్‌ఓసీ

ర్యామ్‌

8జీబీ ర్యామ్‌, 128జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌, 2టీబీ వరకు విస్తరణకు అవకాశం

కెమెరా

23 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా, 8 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా

బ్యాటరీ

3300ఎంఏహెచ్‌ బ్యాటరీ, 4జీ వాయిస్‌ఓవర్‌ ఎల్టీఈ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్‌ జాక్‌,​ఆండ్రాయిడ్‌ 7.0 ఓఎస్‌

ధర

దీని ధర రూ.49,999, ఈ ఫోన్‌ అతిపెద్ద ఆకర్షణ 8జీబీ ర్యామ్‌. అంతేకాక గూగుల్‌ ట్యాంగో ఏఆర్‌ ప్లాట్‌ఫామ్‌, గూగుల్‌ డేడ్రీమ్‌ వీఆర్‌ ప్లాట్‌ఫామ్‌లను ఇది సపోర్టు చేయడం మరో ప్రత్యేకత.

2,500 రూపాయల డిస్కౌంట్‌

రూ.6,499 ఉన్న గూగుల్‌ డేడ్రీమ్‌ వ్యూ వీఆర్‌ హెడ్‌సెట్‌పై ఫ్లిప్‌కార్ట్‌ 2,500 రూపాయల డిస్కౌంట్‌ ఆఫర్‌ చేయనుంది.

100జీబీ వరకు అదనపు డేటా

అదేవిధంగా రిలయన్స్‌ జియోకి, ఆసుస్‌కు భాగస్వామ్యం ఉన్నందున్న ఆ నెట్‌వర్క్‌ సబ్‌స్క్రైబర్లు ఈ ఫోన్‌ను కొనుగోలుచేస్తే 100జీబీ వరకు అదనపు డేటాను ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తోంది.కంప్లిమెంటరీ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ను కల్పిస్తోంది.

ప్రతిసారీ అదనంగా

రూ.309తో రీఛార్జ్‌ చేసుకున్న ప్రతిసారీ అదనంగా జియో యూజర్లు 10జీబీ డేటాను పొందుతూ ఉంటారు. ఇలా 2018 మార్చి వరకు 10 రీఛార్జ్‌లపై పొందవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Asus ZenFone AR With 8GB RAM, Google DayDream, Tango Support Launched at Rs. 49,999 Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot