రూ.5,000కే Asus ఫోన్, 100జీబి స్టోరేజ్‌తో

Written By:

ప్రముఖ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ఆసుస్, ZenFone Go పేరుతో తన మొదటి అల్ట్రా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ ఈ-కామర్స్ మార్కెట్లో విడుదల చేసింది. ZC451TG మోడల్ నెంబర్‌తో వస్తోన్న ఈ ఫోన్‌ను ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ రూ.5,299కి విక్రయిస్తోంది.

రూ.5,000కే Asus ఫోన్, 100జీబి స్టోరేజ్‌తో

ఆండ్రాయిడ్ లాలీపాప్, క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3జీ కనెక్టువిటీ, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 5 మెగా పిక్సల్ కెమెరా వంటి స్పెసిఫికేషన్‌లతో వస్తోన్న ఈ పోన్‌ను జనవరి 2016 నుంచి ఆఫ్‌లైన్ మార్కెట్లలోనూ విక్రయించనున్నారు. ఆసుస్ జెన్ ఫోన్ గో స్మార్ట్‌ఫోన్‌లోని ఉత్సాహపరిచిన అంశాలతో పాటు నిరుత్సాహపరిచిన అంశాలను ఇప్పుడు చూద్దాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆసుస్ జెన్‌ఫోన్ గో స్మార్ట్‌ఫోన్‌లో నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

స్టోరేజ్ స్పేస్:

ZenFone Go స్మార్ట్‌ఫోన్‌ను 8జీబి ఇంటర్నల్ మెమరీతో లభ్యమవుతోంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు పెంచుకోవచ్చు. అదనం ఆసుస్ తన సొంత వెబ్ స్టోరేజ్ సర్వీస్ నుంచి 5జీబి క్లౌడ్ స్టోరేజ్ స్పేస్‌ను ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా గూగుల్ డ్రైవ్ ఆఫర్ చేసే 100జీబి ఉచిత స్టోరేజ్‌ను కూడా ఈ ఫోన్‌లో ఉపయోగించుకోవచ్చు.

ఆసుస్ జెన్‌ఫోన్ గో స్మార్ట్‌ఫోన్‌లో నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

యూజర్ ఇంటర్‌ఫేస్

ZenFone Go స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టంతో వస్తోంది. ఫోన్ లో పొందుపరిచిన జెన్ యూజర్ ఫేస్ ఆధునిక సాఫ్ట్‌వేర్ ఎన్‌హాన్స్‌మెంట్స్‌తో ఆకట్టుకుంటుంది.

ఆసుస్ జెన్‌ఫోన్ గో స్మార్ట్‌ఫోన్‌లో నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

ప్రాసెసర్

ZenFone Go స్మార్ట్‌ఫోన్‌ 1జీబి ర్యామ్ సపోర్ట్‌తో కూడిన మీడియాటెక్ క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో వస్తోంది.

ఆసుస్ జెన్‌ఫోన్ గో స్మార్ట్‌ఫోన్‌లో నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

డ్యుయల్ సిమ్:

ZenFone Go స్మార్ట్‌ఫోన్ డ్యుయల్ సిమ్ కనెక్టువిటీతో వస్తోంది. రెండు సిమ్ స్లాట్స్ ఏక కాలంలో పనిచేస్తాయి.

ఆసుస్ జెన్‌ఫోన్ గో స్మార్ట్‌ఫోన్‌లో నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

కలర్ వేరియంట్స్ ఇంకా అన్ని మార్కెట్లలో అందుబాటు

ZenFone Go స్మార్ట్‌ఫోన్ Charcoal Black, Pearl White, Rouge Pink and Flash Blue కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌లను ఆన్‌లైన్ మార్కెట్‌తో పాటు ఆఫ్‌లైన్ మార్కెట్లోనూ ఆసుస్ అందుబాటులో ఉంచటం విశేషం.

ఆసుస్ జెన్‌ఫోన్ గో స్మార్ట్‌ఫోన్‌లో నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

ర్యామ్

ఇదే ధర పరిధిలో లభ్యమవుతున్న అనేక స్మార్ట్‌ఫోన్‌లు 2జీబి ర్యామ్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ఆసుస్ తన ZenFone Go స్మార్ట్‌ఫోన్‌లో 2జీబి ర్యామ్‌ను పొందుపరిచి ఉంటే పోటీ మరోలా ఉండేది.

ఆసుస్ జెన్‌ఫోన్ గో స్మార్ట్‌ఫోన్‌లో నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

స్ర్కీన్ రిసల్యూషన్ క్వాలిటీని ఇంకాస్త పెంచి ఉంటే మరింత బాగుండేది

జెన్‌ఫోన్ గో స్మార్ట్‌ఫోన్ FWVGA క్వాలిటీ కూడిన 4.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 854పిక్సల్స్)తో వస్తోంది. ఆసుస్ ఈ ఫోన్‌లో 720 పిక్సల్ రిసల్యూషన్‌తో కూడిన హైడెఫినిషన్ డిస్‌ప్లేను పొందుపరిచి ఉంటే బాగుండేది.

ఆసుస్ జెన్‌ఫోన్ గో స్మార్ట్‌ఫోన్‌లో నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

వీజీఏ సెల్ఫీ కెమెరా

జెన్‌ఫోన్ గో స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన 5 మెగా పిక్సల్ కెమెరా ఓకే అనిపించినప్పటికి ముందు భాగంలో ఏర్పాటు చేసిన 0.3 మెగా పిక్సల్ వీజీఏ కెమెరా నిరుత్సాహపరుస్తుంది.

ఆసుస్ జెన్‌ఫోన్ గో స్మార్ట్‌ఫోన్‌లో నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

4జీ ఎల్టీఈ సపోర్ట్ లేదు

దేశవ్యాప్తంగా 4జీ నెట్‌వర్క్ పట్ల ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల లాంచ్ అవుతోన్నఅన్ని స్మార్‌ఫోన్‌లలో 4జీ కనెక్టువిటీ ఆప్షన్ తప్పనిసరైంది. ఆసుస్ ఆఫర్ చేస్తున్న జెన్‌ఫోన్ గో స్మార్ట్‌ఫోన్‌లో 4జీ నెట్‌వర్క్ కొరవడటమనేది కాస్తంత నిరుత్సాహానికి గురిచేసే విషయమే.

ఆసుస్ జెన్‌ఫోన్ గో స్మార్ట్‌ఫోన్‌లో నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

వాటర్ రెసిస్టెన్స్ పీచర్ లేదు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Asus ZenFone Go launched for Rs 5,299: 5 Best Features and 5 Features it Missed. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot