చైనా కంపెనీలకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన తైవాన్ కంపెనీ

Written By:

దేశీయ స్మార్ట్‌ఫోన్ రంగంలో దూసుకుపోతున్న చైనా స్మార్ట్‌ఫోన్ల ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ తైవాన్ కంపెనీ ఇండియా మార్కెట్లోకి దూసుకొచ్చింది. ముఖ్యంగా దేశీయంగా స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటున్న షియోమికి తైవాన్ కంపెనీ అసుస్ షాకిచ్చింది. చైనా మొబైల్‌ కంపెనీలకు దీటుగా సరికొత్త ఫీచర్లతో, బడ్జెట్‌ ధరలో ఆసుస్‌ విడుదల చేసిన తాజా మొబైల్‌ ఆసుస్‌ జెన్‌ఫోన్‌ మ్యాక్స్‌ ప్రొ ఎం1 మార్కెట్లో దుమ్మురేపుతోంది. ప్రముఖ ఇ-కామర్స్‌ వెబ్‌సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా మే 3న అమ్మకానికి వచ్చిన ఈ ఫోన్ నిమిషాల వ్యవధిలోనే అవుట్ ఆఫ్ స్టాక్ అయినట్లు తెలుస్తోంది. కాగా తరువాత సేల్ ఈ నెల 10న జరగనుంది.

రివ్యూ టైం, జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎమ్1 VS రెడ్‌మి నోట్ 5 ప్రొ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Zenfone Max Pro M1 ఫీచర్లు

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

మూడు వేరియంట్లతో..

మూడు వేరియంట్లతో ఈ ఫోన్‌ లభ్యం కానుంది. 3జీబీ ర్యామ్‌/ 32జీబీ అంతర్గత మెమొరీ కలిగిన ఫోన్‌ ధర రూ.10,999కాగా, 4జీ ర్యామ్‌/ 64జీబీ అంతర్గత మెమొరీ కలిగిన ఫోన్‌ ధర రూ.12,999. బ్లాక్‌, గ్రే రంగుల్లో లభించే ఈ ఫోన్‌లకు రూ.49తో ఏడాది పాటు కంపెనీ మొబైల్‌ ప్రొటెక్షన్‌ను అందిస్తోంది.

వొడాఫోన్‌ ప్రత్యేక ఆఫర్‌

ఆసుస్‌ మ్యాక్స్‌ ప్రో ఎం1ను కొనుగోలు చేసే వారికి వొడాఫోన్‌ ప్రత్యేక ఆఫర్‌ను అందించనుంది. రూ.199 రీఛార్జ్‌తో నెలకు 10జీబీ డేటాను 12నెలలపాటు అందించనుంది. ప్రతీ వారం వొడాఫోన్‌ ప్రకటించే ఆఫర్లూ ఆసుస్‌ ఫోన్‌ వినియోగదారులకు అందుతాయి. అంతేకాదు ఆండ్రాయిడ్‌ పి, క్యూ అప్‌డేట్‌లను కచ్చితంగా అందిస్తామని ఆసుస్‌ వెల్లడించింది.

5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ..

5.99 అంగుళాల(18:9) ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లేతో పాటు, స్నాప్‌డ్రాగన్‌ 636 ప్రాసెసర్‌, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ దీని ప్రత్యేకత. 6జీబీ ర్యామ్‌ 64జీబీ ఇంటర్నల్‌ మెమొరీతో కూడా మరో వేరియంట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ. 14,999గా ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Asus Zenfone Max Pro (M1) Next Sale Date is May 10: Price in India, Pre-Orders, Offers, Specifications, Features More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot