ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా అసుస్ జెన్‌ఫోన్ Max Pro M1
బడ్జెట్ ధరలో అసుస్ విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ జెన్‌ఫోన్ Max Pro M1 కొన్ని నెలల క్రితం మార్కెట్లో భారీ సేల్స్ చేసింది.
బడ్జెట్ ధరలో అసుస్ విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ జెన్‌ఫోన్ Max Pro M1 కొన్ని నెలల క్రితం మార్కెట్లో భారీ సేల్స్ చేసింది.ఈ నేపథ్యంలో ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ జెన్‌ఫోన్ Max Pro M1 ఫోన్ పై 12pm నుంచి ఫ్లాష్ సేల్ నిర్వహిస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. తక్కువ ధరలో అత్యాధునిక ఫీచర్ల గల స్మార్ట్ ఫోన్ కొనాలి అనుకున్నవారికి ఈ ఫోన్ ఒక మంచి ఎంపిక . అసుస్ జెన్‌ఫోన్ Pro M1 ధర మరియు ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి.

ధర....
అసుస్ జెన్‌ఫోన్ Pro M1 3జీబీ ర్యామ్/ 32జీబీ అంతర్గత మెమొరీ కలిగిన ఫోన్ ధర రూ.10,999, 4జీ ర్యామ్/ 64జీబీ అంతర్గత మెమొరీ కలిగిన ఫోన్ ధర రూ.12,999, 6జీ ర్యామ్/ 64జీబీ అంతర్గత మెమొరీ కలిగిన ఫోన్ ధర రూ.14,999 .

ఫీచర్లు....
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

5000 ఎంఏహెచ్ బ్యాటరీ....
5.99 అంగుళాల(18:9) ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో పాటు, స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ అసుస్ జెన్‌ఫోన్ Pro M1 ఫోన్ యొక్క ప్రత్యేకత.

ఆఫర్లు....
3జీబీ ర్యామ్ గల ఫోన్ యొక్క EMI రూ.366,4జీబీ ర్యామ్ గల ఫోన్ యొక్క EMI రూ.432,6జీబీ ర్యామ్ గల ఫోన్ యొక్క EMI రూ.499.Axis క్రెడిట్ కార్డు తో ఈ అసుస్ జెన్‌ఫోన్ Max Pro M1 మొబైల్ కొన్నవారికి 10% డిస్కౌంట్ లభిస్తుంది.


Click it and Unblock the Notifications








