డ్యుయల్ కెమెరా, 5,000 mAh బ్యాటరీతో ఆసుస్ ఫోన్

తైవాన్ చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ Asus సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. Asus Zenfone Zoom S పేరుతో విడుదలైన ఈ ఫోన్ ధర రూ.26,999. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా దొరుకుతుంది.

Read More : నోకియా 8 వచ్చేసింది.. ఇదుగోండి మొదటి లుక్, స్పెసిఫికేషన్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వన్‌ప్లస్ 5, హానర్ 8లకు పోటీ....

ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన వన్‌ప్లస్ 5, హువావే హానర్ 8 ఫోన్‌ల సరసన ఈ ఫోన్ చేరుతుంది

స్పెషల్ ఫీచర్స్ ఇవే...

Asus Zenfone Zoom S స్మార్ట్ ఫోన్ లో డ్యుయల్ కెమెరా సెటప్, 4కే క్వాలిటీ వీడియో రికార్డింగ్, 5,000 mAh బ్యాటరీ, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నెల్ స్టోరేజ్, 4G LTE వంటి శక్తివంతమైన ఫీచర్లు ఉన్నాయి.

Asus Zenfone Zoom S స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్) విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం విత్ జెన్ యూజర్ ఇంటర్‌ఫేస్ 3.0, 2GHz ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, అడ్రినో 506 జీపీయూ.

ర్యామ్, స్టోరేజ్, కెమెరా,

4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 2TB వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ ( f/2.0 అపెర్చుర్, సోనీ ఐఎమ్ఎక్స్362 సెన్సార్, 59 ఎమ్ఎమ్ లెన్స్) + 12 మెగా పిక్సల్ (f/1.7 అపెర్చుర్, సోనీ ఐఎమ్ఎక్స్362 సెన్సార్, 25 ఎమ్ఎమ్ వైడ్ యాంగిల్ లెన్స్) డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా , 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : f/1.7 అపెర్చుర్, సోనీ ఐఎమ్ఎక్స్362 సెన్సార్), ఈ కెమెరా ద్వారా 4కే వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు.

బ్యాటరీ ఇంకా కనెక్టువిటీ ఫీచర్లు..

5,000 mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్, 4జీ వోల్ట్, వై-ఫై, బ్లుటూత్ 4.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ కనెక్టువిటీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫోన్ బరువు 172 గ్రాములు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Asus Zenfone Zoom S with dual rear camera, 5,000 mAh battery launched in India at Rs 26,999. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot