నవంబర్ 29న అసుస్ RoG గేమింగ్ స్మార్ట్‌ఫోన్
మొబైల్ దిగ్గజం అసుస్ తొలిసారిగా గేమింగ్ ఫోన్ ని మార్కెట్లోకి తీసుకురానుంది. కంపెనీ నుంచి వచ్చిన ROG గేమింగ్ ఫ్లాట్ ఫాం మీద ఈ ఫోన్ ని రిలీజ్ చేయనుంది.
మొబైల్ దిగ్గజం అసుస్ తొలిసారిగా గేమింగ్ ఫోన్ ని మార్కెట్లోకి తీసుకురానుంది. కంపెనీ నుంచి వచ్చిన ROG గేమింగ్ ఫ్లాట్ ఫాం మీద ఈ ఫోన్ ని రిలీజ్ చేయనుంది. అసుస్ తొలి గేమింగ్ స్మార్ట్ ఫోన్ ఈ నెల 29వ తేదీన ప్రపంచ దేశాల మార్కెట్లలోకి విడుదల కానుంది. తైవాన్ కంపెనీ దిగ్గజం ఇప్పటికే ఈ ఫోన్ లాంచింగ్ ఆహ్వాన కరపత్రాలను మీడియాకు పంపింది. కాగా ఈ ఫోన్ గతేడాది తైవాన్ లో జరిగిన Computex Conferenceలో ప్రదర్శనకు వచ్చిన సంగతి తెలిసిందే.

Asus Republic of Gamers (RoG)...
Asus Republic of Gamers (RoG)ఫ్లాట్ ఫాం మీద రానున్న ఈ స్మార్ట్ ఫోన్ రీఫ్రెష్ రేటు 90Hz మీద డిస్ ప్లేని ఆఫర్ చేస్తున్న మొట్టమొదటి ఫోన్ గా కంపెనీ తెలిపింది. 6ఇంచ్ డిస్ ప్లేతో పాటు పుల్ హెచ్ డి రిజల్యూషన్ అమోల్డ్ స్క్రీన్ తో దూసుకొస్తోంది. octa-core Qualcomm Snapdragon 845తో Adreno 630 GPU మీద రన్ కానుంది.

8జిబి ర్యామ్ తో 512 జిబి ఇంటర్నల్ స్టోరేజ్....
Asus RoG Phone 8జిబి ర్యామ్ తో 512 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ని పొందుపరిచారు. ఆండ్రాయిడ్ ఆఫరేటింగ్ సిస్టం 8.1ని పొందుపరిచారు. కెమెరా విషయానికి వస్తే డ్యూయెల్ లెన్స్ కెమెరాతో 1 ఎంపి సెన్సార్ , సెకండరీ కెమెరా 8 ఎంపి మీద రానుంది.అలాగే 8 ఎంపి సెల్ఫీ కెమెరాని ఇందులో పొందుపరిచారు.

4000mAh battery...
బ్యాటరీ విషయానికొస్తే 4000mAh batteryతో వచ్చింది. దీనికి 'Hypercharge' technologyని పొందుపరిచారు. ఈ టెక్నాలజీ ద్వారా 33 నిమిషాల్లో 60 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఇంకో ఆసక్తిక ఫీచర్ ఏంటంటే dual USB charging portతో రావడం.

గేమింగ్ ఆడే సమయంలో....
గేమింగ్ ఆడే సమయంలో ఛార్జింగ్ అయిపోతుందన్న బాధ లేకుండా వేరే పోర్టు ద్వారా ఛార్జింగ్ చేసుకోవచ్చు.దీనివల్ల ఫోన్ ఎటువంటి పేలుడు సమస్యలు గాని హీటింగ్ సమస్యలు కాని రావు. ఇంకా ఆసక్తికర ఫీచర్ ఏంటేంటే ఈ ఫోన్ పెద్ద మానిటరింగ్ లకు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని వెనుక పొందుపరిచారు. 3.5mm headphone jackతో dual speakers ఉన్నాయి


Click it and Unblock the Notifications








