జడ్జి 'గ్రీన్ సిగ్నల్‌'తో జోష్ మీదున్న 'శాంసంగ్'

Posted By: Prashanth

జడ్జి 'గ్రీన్ సిగ్నల్‌'తో జోష్ మీదున్న 'శాంసంగ్'

 

శాంసంగ్, ఆపిల్ రెండూ కూడా స్మార్ట్ ఫోన్స్ రంగంలో తమదైన శైలిలో దూసుకుపోతున్నాయి. గత అక్టోబర్‌లో ఆపిల్ ఉత్పత్తులను శాంసంగ్ కాపీ కొట్టి 'శాంసంగ్ గెలాక్సీ టాబ్'ని రూపొందించిందంటూ ఆపిల్ ఆస్ట్రేలియా కోర్డులో కేసు వేసి శాంసంగ్‌పై విజయం సాధించి ఆస్టేలియాలో 'శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్' లను అమ్మకూడదంటూ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై శాంసంగ్ ఆస్టేలియా హైకోర్టుని సంప్రదించగా జడ్జి శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ వైపే మొగ్గు చూపడం జరిగింది.

ఈ విషయంపై ఆస్ట్లేలియా హైకోర్టు ప్రతినిధి మాట్లాడుతూ ఆపిల్ హైకోర్డుకి విన్నవించుకున్న అప్లికేషన్‌ని జడ్జి తోసిపుచ్చడం జరిగింది. ఇందుకు గల కారణం ఆపిల్ ఉత్పత్తుల ఖరీదుతో శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఖరీదు సరిపోకపోవడమేనని అన్నారు. దీంతో శాంసంగ్ త్వరలో ఆస్టేలియాలో శాంసంగ్ గెలాక్యీ ట్యాబ్‌ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్‌ని ఆస్ట్రేలియాలో శాంసంగ్ ఎప్పుడు విడుదల చేయనుందన్న విషయాన్ని త్వరలో పాఠకులకు తెలియజేస్తాం..

ఇది ఇలా ఉంటే ఒలంపిక్స్ 2012లో శాంసంగ్ ఓ కీలక పాత్ర పోషించనుంది. ఇందుకొసం ఇప్పుటినుండే లండన్ మాహా నగరం అంగరంగ వైభవంగా ముస్తాబవుతుంది. అక్కడికి వచ్చేటటువంటి అతిధులు, కస్టమర్స్ కొసం విసాయూరప్, శ్యామ్‌సంగ్ రెండు సంయుక్తంగా ఆశ్చర్యంలో ముంచెత్తనున్నాయి. ఇందుకొసం ఈ రెండింటి భాగస్వామ్యంతో ఒలంపిక్స్‌కి సంబంధించిన సమాచారం కొసం ప్రత్యేకంగా మొబైల్ ఫోన్‌ని తయారు చేయనున్నాయి.

ఈ మొబైల్ ఫోన్స్‌ వల్ల ఉపయోగం ఏమిటంటే ఇందులో నిక్షిప్తం చేసిన ఎన్‌ఎఫ్‌సి టెక్నాలజీ సహాయంతో యూజర్స్ మొబైల్ పేమంట్స్‌ని చెల్లించవచ్చు. లండన్‌లో ఉన్న మొబైల్ ఆపరేటర్స్‌తో విసాయూరప్ ఇప్పటికే సంప్రదింపులను పూర్తి చేయడం జరిగిందన్నారు. దీనిని ఎప్పుడైతే విడుదల చేయడం జరుగుతుందో అప్పటి నుండి యూజర్స్ వారియొక్క పేమంట్స్ అన్నింటిని కూడా ఈ మొబైల్ ద్వారా చెల్లించవచ్చు. ఈ అప్లికేషన్ ఈ మొబైల్‌లో నిక్షిప్తం చేసిన నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్‌కి అనుసంధానంగా పనిచేస్తుందన్నారు.

2012 ప్రధమార్దంలోనే లండన్ ఆపరేటర్స్‌ని సంప్రదించి ఈ మొబైల్‌ని యూజర్స్‌కు అందుబాటులోకి తేవడం జరుగుతుందని విసాయూరప్ వెల్లడించింది. 2102 ఒలంపిక్స్ వచ్చిన యూజర్స్, అతిధిలను దృష్టిలో పెట్టుకోని ఈ అప్లికేషన్‌ని తయారు చేయడం జరిగిందని తెలిపారు. ఈ అప్లికేషన్ సహాయంతో యూజర్స్ వారియొక్క పేమంట్స్ అన్నింటిని పిన్ నెంబర్ ఆధారంగా సెక్యూరిటీ ద్వారా చెల్లించవచ్చు. విసాయూరప్ హెడ్ సాంద్రా ఆల్ జట్టా ఈ సందర్బంలో మాట్లాడుతూ ఈ డివైజ్‌లో రన్ అయ్యేందుకు శ్యామ్ సంగ్ కంపెనీకి చెందిన ఆపరేటింగ్ సిస్టమ్ బడా లేదా గూగుల్‌కి చెందిన ఆండ్రాయిడ్ లను రెండింటిని సంప్రదిస్తున్నామని తెలియజేశారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot