మార్చి వరకు మెలిక పెట్టిన శామ్‌సంగ్ ..?

శామ్‌సంగ్ వేవ్ సీరీస్ ఫోన్‌లలో బడా 2.0 వర్షన్ వోఎస్‌ను అప్‌డేట్ చేసే ప్రక్రియ మరింత జాప్యం కానున్నట్లు తెలుస్తోంది. ముందుస్తు ప్రకటన ప్రకారం ఈ తాజా అప్‌డేట్ 2011 చివరిలోనే వర్తించాల్సి ఉంది. అనివార్య కారణాలు వల్ల తాము ఈ నవీకరణను అందించలేకపోయామని బ్రాండ్ అధికార వర్గాలు ప్రకటించాయి. మార్చి చివరి నాటికి ఈ అపడేట్ వేవ్ సిరీస్ వినియోగదారులకు వర్తిస్తుందని శామ్‌సంగ్ ఇటలీ కార్యాలయం పేర్కొంది. విడుదలకు సంబంధించి ఖచ్చితమైన తేదీని మాత్రం ఖరారు చేయలేదు.
పలు అద్భుతమైన లక్షణాలు బడా 2.0 ఆపరేటింగ్ సిస్టంలో ఒదిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వోఎస్ మల్టీ టాస్కింగ్‌ను సపోర్ట్ చేయ్యటంతో పాటు సంబంధిత అప్లికేషన్‌లను సులువుగా రన్ చేస్తుంది. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ) వ్యవస్థను బడా ఫ్లాట్‌పామ్ సపోర్ట్ చేస్తుంది.
కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేసే ఈ బడా అప్‌డేట్‌ను అందుకోవాలంటే సంబంధిత వినియోగదారులు మార్చి వరకు వేయిట్ చెయ్యక తప్పదు.


Click it and Unblock the Notifications








