మార్చి వరకు ఆగాల్సిందే : శామ్‌సంగ్

Posted By: Super

మార్చి వరకు ఆగాల్సిందే : శామ్‌సంగ్

 

శామ్‌సంగ్ వేవ్ సీరీస్ ఫోన్‌లలో  బడా 2.0 వర్షన్  వో‌ఎస్‌ను అప్‌డేట్ చేసే ప్రక్రియ మరింత జాప్యం కానున్నట్లు తెలుస్తోంది. ముందుస్తు ప్రకటన ప్రకారం ఈ  తాజా అప్‌డేట్  2011 చివరిలోనే వర్తించాల్సి ఉంది. అనివార్య కారణాలు వల్ల తాము ఈ

నవీకరణను అందించలేకపోయామని బ్రాండ్ అధికార వర్గాలు ప్రకటించాయి. మార్చి చివరి నాటికి ఈ అపడేట్  వేవ్ సిరీస్ వినియోగదారులకు వర్తిస్తుందని  శామ్‌సంగ్ ఇటలీ కార్యాలయం పేర్కొంది.  విడుదలకు సంబంధించి  ఖచ్చితమైన తేదీని మాత్రం ఖరారు చేయలేదు.

పలు అద్భుతమైన లక్షణాలు బడా 2.0 ఆపరేటింగ్ సిస్టంలో  ఒదిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వోఎస్ మల్టీ టాస్కింగ్‌ను సపోర్ట్ చేయ్యటంతో పాటు సంబంధిత అప్లికేషన్‌లను సులువుగా రన్ చేస్తుంది. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ) వ్యవస్థను బడా

ఫ్లాట్‌పామ్ సపోర్ట్ చేస్తుంది.

కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేసే  ఈ  బడా అప్‌డేట్‌ను  అందుకోవాలంటే  సంబంధిత వినియోగదారులు మార్చి వరకు వేయిట్  చెయ్యక తప్పదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot