Home
Mobile

అమ్మాయిలూ బీ రెడీ.. బార్బీ ఫ్లిప్ ఫోన్ ఇండియాలో త్వరలోనే లాంచ్.. ధర సో చీప్!

Barbie Flip Phone: 90ల్లో ఫ్లిప్ ఫోన్లు ఓ ఊపు ఊపేశాయి. ఇప్పుడు మళ్లీ ఆ రోజుల్ని గుర్తు చేయడానికి రెడీ అయిపోయింది HMD కంపెనీ. ఇది బార్బీ ఫ్లిప్ ఫోన్‌తో సరికొత్త ట్రెండ్ సృష్టించబోతోంది. ఈ ఫోన్ చూడటానికి రెట్రో స్టైల్‌లో ఉన్నా, లేటెస్ట్ ఫీచర్లతో అదిరిపోతుంది. పింక్ రంగులో బార్బీ బొమ్మలా ముద్దుగా ఉండే ఈ ఫోన్ 2024, ఆగస్టులో కొన్ని దేశాల్లోనే రిలీజ్ అయింది.

ఇప్పుడు మన ఇండియాలో కూడా త్వరలోనే లాంచ్ చేయబోతున్నట్లు HMD కంపెనీ స్వయంగా చెప్పింది. HMD సంస్థ అఫీషియల్ X (ట్విట్టర్) అకౌంట్ ఈ బార్బీ ఫ్లిప్ ఫోన్ ఇండియాకి వస్తున్న విషయాన్ని వెల్లడించింది. చేసింది. అయితే, లాంచ్ డేట్ ఎప్పుడనేది మాత్రం ఇంకా చెప్పలేదు.

Barbie Flip Phone Revival  HMD Brings Back the 90s to India

ఫోన్ ఫొటోలు చూస్తే, గ్లోబల్ మార్కెట్‌లో రిలీజ్ చేసిన డిజైన్‌నే ఇండియాలో కూడా కంటిన్యూ చేస్తారని తెలుస్తోంది. స్పెసిఫికేషన్స్ కూడా అవే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, దీని ధర ఎంత, ఇది ధరకు తగిన వ్యాల్యూ అందిస్తుందా అనేది తెలుసుకుందాం.

* డిజైన్, లుక్స్

బార్బీ ఫ్లిప్ ఫోన్ అంటేనే స్టైల్‌కు కేరాఫ్ అడ్రస్. పవర్ పింక్ కలర్‌లో, పింక్ కలర్ కీప్యాడ్‌తో చూడగానే అమ్మాయిలు ఫిదా అయిపోతారు. కీప్యాడ్‌లో పామ్ ట్రీ, హార్ట్, ఫ్లెమింగో బొమ్మలు ఉన్నాయి. అవి చీకట్లో మెరుస్తూ ఫోన్‌కి మరింత అందాన్నిస్తాయి. ఫోన్ కవర్ డిస్‌ప్లే అద్దంలా పనిచేస్తుంది.

అమ్మాయిలు హడావుడిగా రెడీ అయ్యేటప్పుడు మేకప్ టచ్ చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఫోన్‌తో పాటు వచ్చే జ్యువెలరీ బాక్స్ స్టైల్ ప్యాకింగ్ లగ్జరీ ఫీల్‌ని ఇస్తుంది. అంతేకాదు, ఫోన్ యాక్సెసరీస్, బ్యాక్ కవర్లు, ఛార్జర్, బ్యాటరీ కూడా పింక్ కలర్స్‌లోనే డిజైన్ చేశారు.

* డిస్‌ప్లే, హార్డ్‌వేర్

ఈ ఫోన్‌లో 2.8 అంగుళాల QVGA మెయిన్ స్క్రీన్, 1.77 అంగుళాల QQVGA కవర్ డిస్‌ప్లే ఉన్నాయి. కవర్ డిస్‌ప్లే మిర్రర్‌లా కూడా పనిచేస్తుంది. ఫోన్ యూనిసోక్ T107 SoC ప్రాసెసర్‌తో వస్తుంది. 64MB ర్యామ్, 128MB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. వెనుకవైపు 0.3-మెగాపిక్సెల్ కెమెరా, LED ఫ్లాష్ ఇచ్చారు. బేసిక్ ఫొటోగ్రఫీకి ఇది సరిపోతుంది.

* సాఫ్ట్‌వేర్, ఫీచర్స్

ఈ ఫోన్ S30+ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. బార్బీ థీమ్‌తో యూజర్ ఇంటర్‌ఫేస్ చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఫోన్ ఆన్ చేయగానే "హాయ్ బార్బీ" అనే వాయిస్‌తో వెల్కమ్ చెప్తుంది. గేమ్స్ విషయానికొస్తే, స్పెషల్ బీచ్-థీమ్డ్ మాలిబు స్నేక్ గేమ్స్‌తో టైమ్ పాస్ చేయొచ్చు.

* బ్యాటరీ, కనెక్టివిటీ

ఫోన్‌లో 1,450mAh రిమూవబుల్ బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 9 గంటల వరకు టాక్ టైమ్ వస్తుందట. 4G కనెక్టివిటీ, బ్లూటూత్ 5.0, 3.5mm ఆడియో జాక్, USB టైప్-C ఛార్జింగ్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. అమెరికాలో HMD బార్బీ ఫ్లిప్ ఫోన్ ధర 129 డాలర్లు (సుమారు రూ. 10,800). ఇండియాలో దీని ధర ఎంత ఉంటుందనేది లాంచ్ అయిన తర్వాత తెలుస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
HMD revives 90s flip phone craze with Barbie Flip Phone in India. Pink retro design meets modern features, launching soon. Stylish, nostalgic, and undeniably Barbie.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X