ప్రపంచంలో అతి చిన్నదైన మ్యూజిక్ మొబైల్ ఫోన్

Posted By: Super

ప్రపంచంలో అతి చిన్నదైన మ్యూజిక్ మొబైల్ ఫోన్

సాధారణంగా చిన్న పిల్లలకి ఆడాడుకొవడానికి ఫోన్ వారి చేతికి ఇచ్చినప్పుడు వారు దానిని తెలియకుండా పగలు కొడుతుంటారు. రాబోయే రోజుల్లో ఇలాంటి సమస్యలకు పరిష్కార మార్గంగా 'బేసిక్ మొబైల్స్' సంస్ద నవంబర్‌లో ప్రపంచంలో కెల్లా చిన్నదైన మ్యూజిక్ ఫోన్‌ 'ఇమిని'ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ముఖ్యంగా మద్య వయసులో ఉన్న చిన్నపిల్లలను దృష్టిలో పెట్టుకొని ఈ చిన్న మ్యూజిక్ ఫోన్‌ని విడుదల చేయనున్నట్లు బేసిక్ మొబైల్స్ ప్రతినిధి వర్గాలు తెలిపాయి.

మ్యూజిక్‌ని చిన్నతనం నుండే పిల్లలకు ప్రత్యేకంగా అలవాటు చేసేందుకు గాను దీనిలో కొన్ని ప్రత్యేకమైన బటన్స్‌ రూపొందించడం జరిగింది. ఉపయోగించేందుకు కూడా ఇది సులువుగా ఉంటుంది. స్క్రీన్ సైజు చిన్నదిగా ఉన్నప్పటికీ మామూలు నెంబర్స్ కలిగిన కీప్యాడ్ దీని ప్రత్యేకత. అంతేకాకుండా కాల్ రిసీవింగ్, ఈ మెయిల్, ఎప్పుడు కావాలంటే అప్పడు మ్యూజిక్‌ని స్విచ్ ఆఫ్ చేసేందుకు ప్రత్యేకంగా బటన్స్ రూపొందించడం జరిగింది.

ప్రక్క చిత్రంలో గనుక మీరు చూసినట్లేతే మీకు బటన్స్‌లో తేడా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ మ్యూజిక్ ఫోన్ చుట్టుకొలతలు 7.8 x 3.6 x 1.4 cmగా రూపొందించడమే కాకుండా, బరువు కూడా కేవలం 40 గ్రాములుగా తయారు చేయడం జరిగింది. పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్ అప్‌ని అందింజేందుకు గాను ఇందులో 400 mAh బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది.

మెమరీ విషయానికి వస్తే మొబైల్‌లో 1 GB మెమరీ కార్డుతో పాటు, మైక్రో ఎస్‌డి స్లాట్‌ని కూడా నిక్షిప్తం చేయడం జరిగింది. దీని సహాయంతో మెమరీని కావాలంటే విస్తరించుకొవచ్చు. స్టీరియో హెడ్ సెట్ ప్రత్యేకం. వీటితో పాటు ఎఫ్ ఎమ్ రేడియో, అలారమ్ క్లాక్, వైబ్రేషన్ అలర్ట్ మొదలగునవి ప్రత్యేకం. ఇండియన్ మొబైల్ మార్కెట్లో దీని సుమారుగా రూ 3,900గా ఉండవచ్చునని మొబైల్ నిపుణులు భావిస్తున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot