కుర్ర కారు మనసు దోచే బీటెల్ ఆండ్రాయిడ్ స్మార్ట్ పోన్..

Posted By: Staff

కుర్ర కారు మనసు దోచే బీటెల్ ఆండ్రాయిడ్ స్మార్ట్ పోన్..

బీటెల్ కంపెనీ గురించి తెలియని భారతీయుడు ఉండరంటే నమ్మండి. ఇండియాలో మద్యతరగతి కుటుంబాల ఇంట్లో ఉన్న ల్యాండ్ ఫోన్స్‌ ఖచ్చితంగా బీటెల్ కంపెనీకి చెందినవై ఉంటాయి. ఎందుకంటే బీటెల్ కంపెనీ వచ్చిన తర్వాత ఇండియన్ ల్యాండ్ ఫోన్స్‌లలో పెద్ద విప్లవమే వచ్చిందని చెప్పాలి. ఇప్పడు అదే బీటెల్ కంపెనీ మొబైల్ మార్కెట్లోకి స్మార్ట్ ఫోన్స్‌ని విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. అధునాతన ఫీచర్స్ కలిగిన మొబైల్ ఫోన్స్‌ని తక్కవ ధరలో మార్కెట్లోకి విడుదల చేయనున్నాయి. బీటెల్ స్మార్ట్ ఫోన్స్‌ని మార్కెట్లోకి ఈ అక్టోబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది.

పోయిన వారమే మార్కెట్లోకి బీటెల్ కంపెనీకి చెందిన టాబ్లెట్ బీటెల్ మాజిక్‌ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. విడుదల చేసిన కొన్నిరోజులకే కస్టమర్స్ నుండి మంచి రెప్సాన్స్‌ని సంపాదించుకొగలిగింది. దీని ఫీచర్స్ గనుక చూసినట్లైతే 7 అంగుళాల తాకేతెర, 1Ghz ప్రాసెసర్‌తో రూపొందించిన దీని ధర రూ.10,000. ఆండ్రాయిడ్‌ 2.2 ఆపరేటింగ్‌ సిస్టంతో పని చేస్తుంది. 512 ఎంబీ ర్యామ్‌, 8 జీబీ ఇన్‌బిల్డ్‌ మెమొరీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్‌, జీపీఎస్‌, ఇన్‌బిల్డ్‌ స్టీరియో స్పీకర్లు, 3.5 ఎంఎం జాక్‌... సౌకర్యాలున్నాయి. ముందు, వెనక భాగాల్లో 2 మెగాపిక్సల్‌ కెమెరాల్ని నిక్షిప్తం చేశారు. 3జీ సిమ్‌కార్డ్‌తో మొబైల్‌లా వాడుకోవచ్చు. మెమొరీ పరిధి 16 జీబీ. వెనక భాగంలో ఏర్పాటు చేసిన 'కిక్‌స్టాండ్‌' ప్రత్యేకత. సుమారు అరకేజీ బరువు ఉంటుంది.

మార్కెట్లోకి ఆండ్రాయిడ్ స్మార్ట్ పోన్స్‌ని విడుదల చేయాలన్న సంకల్పంతో కంపెనీ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినోద్ షాన్నే మాట్లాడుతూ మేము అక్టోబర్ లో విడుదల చేయనున్న స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 2.3 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు స్క్రీన్ సైజు 3.2 ఇంచ్‌గా రూపోందించబడింది. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే 1 GHz క్వాలికామ్ స్మాప్ డ్రాగన్ ప్రాసెసర్ నిక్షిప్తం చేయడం జరిగింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్నిరకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను సపోర్ట్ చేస్తుంది.

కమ్యూనికేషన్, కనెక్టివిటీ టెక్నాలజీలైన బ్లూటూత్, వై-పై లాంటి వాటిని కూడా సపోర్ట్ చేస్తుంది. మొబైల్‌లో పాటు గూగుల్ మ్యాప్స్, గూగుల్ సెన్సార్స్ లాంటివి నిక్షిప్తం చేయబడ్డాయి. ఇన్న అత్యాధునిక ఫీచర్స్ ఉన్న బీటెల్ స్మార్ట్ పోన్ ధర కేవలం రూ 9,000 వరకు ఉండవచ్చునని తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot