Home
Mobile

రూ. 15 వేల లోపు బెస్ట్ 5G ఫోన్లు: జనం ఎగబడి కొంటున్న టాప్ మొబైల్స్ ఇవే!

మంత్ ఎండ్ ఆఫర్లతో రూ. 15,000 లోపు లభించే 5G ఫోన్లకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో సాంసంగ్ గెలాక్సీ F15 5G, వివో T3x 5G మోడళ్ల బేసిక్ వేరియంట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతూ 'బెస్ట్ సెలర్' బ్యాడ్జ్‌ను సొంతం చేసుకున్నాయి. అమెజాన్ స్వాతంత్ర్య దినోత్సవ సేల్ తెచ్చిన జోరుకు తోడు, బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్లు కూడా తోడవడంతో ఈ వారం కొనుగోలుదారులు ఈ బడ్జెట్ ఫోన్ల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.

అసలు ఈ ఫోన్లకే ఎందుకు ఇంత క్రేజ్ అంటే... పెద్ద బ్యాటరీ, నమ్మకమైన సాఫ్ట్‌వేర్, విస్తృతమైన బ్రాండ్ సర్వీసే ప్రధాన కారణాలు. 6000 mAh బ్యాటరీ, క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌తో మోటోరోలా G64 5G కూడా ఆకట్టుకుంటోంది. అయితే దీని స్టాక్ కాస్త అటూఇటూగా ఉంది. క్యూ2 (Q2)లో భారత్‌కు స్మార్ట్‌ఫోన్ల సరఫరా కాస్త తగ్గడంతో బడ్జెట్ ఫోన్ల లభ్యత తగ్గింది. అందుకే మంచి ఆఫర్ కనిపించగానే జనాలు ఆలస్యం చేయకుండా వెంటనే కొనేస్తున్నారు.

Best 5G Smartphones Under 15000 in India 2026: Top Selling Models on Amazon, Flipkart and Offline Stores

రూ.15,000 లోపు బెస్ట్ సెల్లింగ్ 5G ఫోన్లు: నేడు కస్టమర్లు వేటిని ఎక్కువగా కొంటున్నారంటే..

ఫ్లిప్‌కార్ట్‌లో సాంసంగ్ గెలాక్సీ F15 5G సాధారణంగా ఆఫర్లు లేకుండా రూ. 13,499 నుంచి రూ. 14,999 ధరకు లభిస్తోంది. పేమెంట్ సమయంలో క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో ధర మరింత తగ్గుతుంది. విద్యార్థులు, మొదటిసారి 5G కి మారే వారి నుంచి మంచి డిమాండ్ ఉండటంతో వివో T3x 5G అన్ని ర్యామ్ వేరియంట్లలో 'బెస్ట్ సెలర్'గా నిలుస్తోంది. బ్యాంక్ ఆఫర్లు, పిన్ కోడ్ ఆధారంగా ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉన్నందున, పేమెంట్ చేసే ముందు కార్ట్‌ను ఒక్కసారి రీఫ్రెష్ చేసుకోవడం మంచిది.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు; ఏపీ, తెలంగాణ ఆఫ్‌లైన్ మార్కెట్లోనూ హవా

అమెజాన్‌లో రెడ్‌మి 13 5G మోడల్ రూ. 12,499 ధరకు అందుబాటులో ఉన్న బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది. ఇక గెలాక్సీ M15 5G సాధారణంగా రూ. 15,999 వద్ద ఉన్నప్పటికీ, కార్డ్ డిస్కౌంట్లలో దీని ధర బాగా తగ్గుతుంది. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా ఉపయోగిస్తే, ఎఫెక్టివ్ ప్రైస్ సులభంగా రూ. 15,000 కంటే తక్కువకే వస్తోంది.

ఆఫ్‌లైన్ మార్కెట్ విషయానికొస్తే.. హైదరాబాద్, వైజాగ్ స్టోర్లలో గెలాక్సీ F15, వివో T3x ఫోన్ల కోసం విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. మెరుగైన బ్యాటరీ లైఫ్, యూపీఐ లావాదేవీలు స్మూత్‌గా సాగడం, సులువైన రిపేర్ సర్వీసులు వీటికి కలిసిసొస్తున్నాయి. ఆన్‌లైన్‌కు పోటీగా లాట్ మొబైల్స్ (LOT Mobiles) నో-కాస్ట్ ఈఎమ్‌ఐ, జీరో డౌన్ పేమెంట్ ఆఫర్లను అందిస్తోంది. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బిగ్ సీ (Big C) స్టోర్లు ప్రత్యేక 5G బండిల్ ఆఫర్లతో ఆకట్టుకుంటున్నాయి.

ఆగస్టు 29 నుంచి 31 వరకు సరైన సమయంలో కొనుగోలు చేయడమే కీలకం. ముందుగా బెస్ట్ సెలర్ ట్యాగ్‌లను గమనించి, ఆ తర్వాత బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్ లెక్కింపు పూర్తయ్యాకే ఆర్డర్ కన్‌ఫర్మ్ చేయండి. క్రమం తప్పకుండా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, మంచి సర్వీస్ నెట్‌వర్క్ ఉన్న మోడళ్లకే ప్రాధాన్యత ఇవ్వండి. ఒకవేళ ఆన్‌లైన్‌లో స్టాక్ లేకపోతే, లాట్ లేదా బిగ్ సీ స్టోర్లను సంప్రదించి బెస్ట్ ప్రైస్ కోట్ అడగొచ్చు; మంత్ ఎండ్ సేల్స్ టార్గెట్ల వల్ల ఆఫ్‌లైన్‌లోనూ ఆన్‌లైన్ స్థాయి ఆఫర్లు వెంటనే లభించే అవకాశాలు ఉంటాయి.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X