తక్కువ ధరలో బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా.. రూ.10,000 కంటే తక్కువ ధరలో టాప్ 3 ఫోన్‌లు..!
భారత్ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఒకటిగా ఉంది. ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ఫ్లాప్‌షిప్ మోడళ్ల వరకు డిమాండ్ ఉంటోంది. ముఖ్యంగా ఎంట్రీ లెవల్, బడ్జెట్ రేంజ్ ఫోన్‌లకు కూడా భారీ డిమాండ్ ఉంటోంది. రూ.10,000 కంటే తక్కువ ధరలోనూ ప్రస్తుతం అనేక బ్రాండ్‌లు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి. 5G ఫోన్‌లకు (Best 5G Smartphones Under RS10,000) డిమాండ్ అధికంగా ఉన్న నేఫథ్యంలో ఎంట్రీ లెవల్ ధరలో 5G హ్యాండ్‌సెట్‌లను అందుబాటులోకి తీసుకొచ్చాయి.
ప్రస్తుతం Rs10,000 కంటే తక్కువ ధరలో శాంసంగ్, మోటోరోలా, వివో, రెడ్‌మి, రియల్‌మి, ఇన్ఫినిక్స్ సహా మరిన్ని సంస్థలు తమ ఉత్పత్తులను భారత్‌లో విడుదల చేశాయి. ఈ జాబితాలో రెడ్‌మి A4 5G, టెక్నో స్పార్క్ 30C 5G, మోటో G45 5G స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఈ ఫోన్‌ల పూర్తి వివరాలు.

రెడ్‌మి A4 5G స్మార్ట్‌ఫోన్ : ఈ హ్యాండ్‌సెట్‌ను (Redmi A4 5G Smartphone) గత సంవత్సరం చివర్లో షియోమీ విడుదల చేసింది. 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.88 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 4nm స్నాప్‌డ్రాగన్ 4s జెన్ 2 ప్రాసెసర్‌తో పనిచేస్తోంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS ను కలిగి ఉంది.
ఈ రెడ్‌మి హ్యాండ్‌సెట్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ, 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్లో అందుబాటులో ఉంది. కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా సహా మరో సెకండరీ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 5MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. 18W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5160mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ప్రారంభ ధర రూ.8499 గా ఉంది.
టెక్నో స్పార్క్ 30C 5G : ఈ హ్యాండ్‌సెట్ (Tecno Spark 30C 5G) 120Hz రీప్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల HD LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత HiOS 14 ను కలిగి ఉంది. 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ, 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ 48MP సోనీ IMX582 కెమెరాను సహా 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. వెనుక వైపు LED ఫ్లాష్ లైట్‌ను అమర్చారు. 18W వైర్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.9996 గా ఉంది. అదే హైఎండ్ వేరియంట్ ధర రూ.10,679 గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు క్రెడిట్ కార్డుతో 5 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.
మోటో G45 5G : ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.45 అంగుళాల HD+ డిస్‌ప్లేను (Moto G45 5G) కలిగి ఉంది. కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 3 తో రక్షణ పొందుతుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత మోటోరోలా UX తో పనిచేస్తోంది.
4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.10999 గా ఉంది., 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.12999 గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు కార్డులతో 5 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 50MP + 2MP కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.


Click it and Unblock the Notifications