Home
Mobile

రూ.15 వేల ధరలో మంచి ఫోన్‌ కోసం చూస్తున్నారా.. అయితే ఈ మూడు ఫోన్‌ల గురించి తెలుసుకోండి..!

Budget 5G Smartphones : భారత్‌ మార్కెట్‌లో బడ్జెట్‌ రేంజ్‌ స్మార్ట్‌ఫోన్‌లకు మంచి డిమాండ్‌ ఉంది. దీంతో అనేక స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థలు ఈ ధర సెగ్మెంట్‌లో అనేక మోడల్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. గతంలో మిడ్‌ రేంజ్ ఫోన్లు, ప్రీమియం మోడల్స్‌లోనే బెస్ట్ ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లతో అందుబాటులోకి వచ్చేవి. ప్రస్తుతం బడ్జెట్‌ రేంజ్‌లోనూ మంచి ఫీచర్లను కలిగి ఉంటున్నాయి.

ప్రస్తుతం రూ.15 వేల ధర రేంజ్‌లో పోకో M7 ప్రో 5G, ఐకూ Z10x 5G, రెడ్‌మి నోట్‌ 14 SE 5G ప్రస్తుతానికి బెస్ట్ మోడల్స్‌ జాబితాలో ఉన్నాయి. ఈ ఫోన్‌లు డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ పరంగాను మంచి స్పెసిఫికేషన్‌లను కలిగి ఉన్నాయి. బ్యాంకు డిస్కౌంట్‌లతో డిస్కౌంట్‌ ధరకు సొంతం చేసుకోవచ్చు.

Best 5G smartphones under Rs15000 Price here is the list and specifications

పోకో M7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ :
ఈ హ్యాండ్‌సెట్ (Poco M7 Pro 5G) 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర రూ.12999 గా ఉంది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.14999 గా ఉంది. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఫోన్‌ లావెండర్‌ ఫ్రాస్ట్‌, లూనార్ డస్ట్‌, ఓలివ్‌ ట్విలైట్ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

ఈ హ్యాండ్‌సెట్ 6.67 అంగుళాల FHD+ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 2100 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌ను పొందుతుంది. ఈ హ్యాండ్‌సెట్ 45W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5110mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7025 అల్ట్రా SoC చిప్‌సెట్‌, ఆం‌డ్రాయిడ్‌ 14 ఆధారిత HyperOS పైన పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా 50MP సోనీ LYT 600 కెమెరా, 2MP డెప్త్‌ సెన్సార్‌, 20MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది.

Best 5G smartphones under Rs15000 Price here is the list and specifications

ఐకూ Z10x స్మార్ట్‌ఫోన్‌ :
ఈ ఫోన్‌ (iQOO Z10X 5G) 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.13498, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14998, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ ధర రూ.16498 గా ఉంది. టైటానియం, అల్ట్రామెరీన్ కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

ఈ ఐకూ ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.72 అంగుళాల ఫుల్‌ HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. MIL STD 810H మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. 44W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో 6500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 ను కలిగి ఉంది.

కెమెరా విభాగం 50MP అల్ట్రా HD ప్రైమరీ కెమెరా, 2MP బోకేష్‌ కెమెరా, LED ఫ్లాష్‌ మరియు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. AI Erase, AI Document, AI Translation వంటి పీచర్లను కలిగి ఉంది.

రెడ్‌మి నోట్‌ 14 SE 5G స్మార్ట్‌ఫోన్‌ :
ఈ ఫోన్‌ (Redmi Note 14 SE) ఇటీవలే లాంచ్‌ అయింది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ లోనే అందుబాటులోకి వచ్చింది. ధర రూ.14999 గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల ఫుల్‌ HD+ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

ఈ ఫోన్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 7025 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Hyper OS పైన పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా 50MP సోనీ LYT 600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరా మరియు 20MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో 5110mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Best 5G smartphones under Rs15000 Price here is the list and specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X