రూ.15 వేల ధరలో బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్‌లు.. లిస్ట్, స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు..!
బడ్జెట్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లకు భారత్ మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంటుంది. ఈ ధరలో 5G ఫోన్‌లకు మరింత గిరాకీ ఉంటోంది. ఈ ధర సెగ్మెంట్ ఇటీవల బెస్ట్ ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. మెరుగైన ఫెర్ఫామెన్స్, భారీ బ్యాటరీ, భారీ డిస్‌ప్లే, కెమెరా ఇలా బెస్ట్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. ప్రస్తుతం రూ.15000 జాబితాలో (Best 5G Smartphones Under Rs15000) శాంసంగ్ గెలాక్సీ M16 5G, వివో T4x 5G, రియల్‌మి P3x 5G, పోకో M7 ప్రో వంటి ఫోన్‌లు ఉన్నాయి. వీటి పూర్తి స్పెఫికేషన్‌ల వివరాలు మీకోసం.
శాంసంగ్ గెలాక్సీ M16 5G స్మార్ట్‌ఫోన్ :
శాంసంగ్ గెలాక్సీ M16 5G (Samsung Galaxy M16 5G) భారత్ మార్కెట్‌లో ఇటీవల అందుబాటులోకి వచ్చింది. బడ్జెట్ రేంజ్ సెగ్మెంట్‌లో బెస్ట్ హ్యాండ్‌సెట్‌గా ఉంది. డిజైన్ సహా ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌ల పరంగా ఆకట్టుకుంటుంది. వాయిస్ ఫోకస్, విజన్ బూస్టర్, క్విక్ షేర్ వంటి అనేక ఫీచర్‌లు ఉన్నాయి.

శాంసంగ్ ఫోన్ ఫోన్ 90Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల FHD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7.0 OS తో పనిచేస్తోంది. ఈ ఫోన్ 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందనుంది.
కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రావైడ్ లెన్స్, 2MP డెప్త్ సెన్సార్‌తో అందుబాటులో ఉంది. మరియు 13MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 25W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
ఈ ఫోన్ 5G, 4G, బ్లూటూత్ 5.3, వైఫైతోపాటు విజన్ బూస్టర్, ఐ కేర్ షీల్డ్, శాంసంగ్ Knox vault, వాయిస్ ఫోకస్, క్విక్ షేర్ వంటి ఫీచర్‌లు ఉన్నాయి. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
శాంసంగ్ గెలాక్సీ M16 5G 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.11499 గా ఉంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.12999 గా ఉంటుంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.14999 గా ఉంది.
రియల్‌మి P3x 5G స్మార్ట్‌ఫోన్ :
రియల్‌మి P3x 5G (Realme P3x 5G) హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ వేగాన్ లెదర్ ఫినిష్ డిజైన్‌తో అందుబాటులో ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 OS తో పనిచేస్తుంది.
ఈ హ్యాండ్‌సెట్ డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP, 2MP కెమెరాలను అమర్చి ఉంటుంది. మరియు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 45W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh భారీ బ్యాటరీతో పనిచేస్తుంది. IP69 రేటింగ్‌తో బెస్ట్ డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
రియల్‌మి P3x 5G స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.13,999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,999 గా ఉంది.
వివో T4x 5G స్మార్ట్‌ఫోన్ :
వివో T4x 5G (Vivo T4x 5G) హ్యాండ్‌సెట్ 6.72 అంగుళాల FHD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 SoC చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS తో పనిచేస్తోంది. 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందనుంది.
వివో T4x 5G స్మార్ట్‌ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 2MP బొకేష్ లెన్స్‌లను అమర్చి ఉంది. డైనమిక్ లైట్ రింగ్ కూడా కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 44W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
ఈ వివో స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.13,999, 8GB ర్యామ్ +128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.16,999 గా ఉంది.
పోకో M7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ :
పోకో M7 ప్రో 5G హ్యాండ్‌సెట్ (Poco M7 Pro 5G) 6.67 అంగుళాల FHD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 5 రక్షణ ను పొందుతుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS తో పనిచేస్తుంది.
కెమెరాల పరంగా 50MP సోనీ LYT 600, 2MP డెప్త్ సెన్సార్‌లను కలిగి ఉంటుంది. మరియు 20MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 45W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5110mAh బ్యాటరీతో పనిచేస్తోంది. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.
పోకో M7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.13999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.15999 గా ఉంది. లూనార్ డస్ట్, ఓలివ్ ట్విలైట్, లావెండర్ ఫ్రాస్ట్ రంగుల్లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








