Best 5G Smartphones రూ.20,000 కంటే తక్కువ ధరలో బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్‌లు.. లిస్ట్, ఫీచర్‌ల వివరాలు!
భారత్‌లో బడ్జెట్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లకు భారీ డిమాండ్ ఉంటుంది. ఇటీవల మిడ్ రేంజ్ హ్యాండ్‌సెట్‌ల కొనుగోళ్లు కూడా భారీగా జరుగుతున్నాయి. ప్రస్తుతం అనేక స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థలు రూ.20,000 ధర సెగ్మెంట్‌లో (Best 5G Smartphones) తమ ఉత్పత్తులను విడుదల చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ సెగ్మెంట్‌లో రియల్‌మి, శాంసంగ్, వన్‌ప్లస్, వివో, ఐకూ వంటి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు ఉన్నాయి. రియల్‌మి P1 స్పీడ్, వన్‌ప్లస్ CE 4 లైట్ 5G, ఐకూ Z9s, వివో Y58 హ్యాండ్‌సెట్‌లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ల స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు, ధర, సేల్ పూర్తి వివరాలు.
రియల్‌మి P1 స్పీడ్ స్మార్ట్‌ఫోన్ (Realme P1 Speed 5G) 6.67 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మి UI 5.0 OS, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లలో లభిస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 2MP కెమెరాలు సహా 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 45W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. IP65 రేటింగ్‌తో కూడిన వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్‌గా అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.17999 గా ఉంది.
వివో Y58 5G స్మార్ట్‌ఫోన్ (Vivo Y58 5G) 6.72 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత Funtouch OS 14, స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 మొబైల్ ప్లాట్‌ఫాం చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ వివో హ్యాండ్‌సెట్ 50MP ప్రైమరీ, 2MP కెమెరాను కలిగి ఉంది.
సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ 8MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. హ్యాండ్‌సెట్ 44W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర ప్రస్తుతం రూ.18,399 గా ఉంది.
ఐకూ Z9s స్మార్ట్‌ఫోన్ (iQOO Z9s Smartphone) 6.77 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS తో పాటు 4nm ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 50MP + 2MP కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు 5500mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.19,999 గా ఉంది.
వన్‌ప్లస్ నార్డ్ CE 4 లైట్ స్మార్ట్‌ఫోన్ (Oneplus nord CE 4 Lite 5G) 6.67 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 695 SoC చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 14 ఆధారిత OxygenOS 14 తో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 80W వైర్ Supervooc ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీను కలిగి ఉంది.
కెమెరా విభాగం పరంగా OIS సపోర్టుతో 50MP సోనీ LYT 600 కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంది. మరియు 16MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది. స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ప్రారంభ ధర రూ.19999 గా ఉంది.


Click it and Unblock the Notifications








